
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక తెలుగు హీరో గురించి పలు వ్యాఖ్యలు చేసింది. మొదటి సినిమాతోనే యూత్‌కు బాగా దగ్గరైన ఈ బ్యూటీ అమాయకపు చూపుతో దగ్గరైంది. నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతోమంది గుండెలు కొల్లగొట్టిందీ హీరోయిన్. టాలీవుడ్‌లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఛాన్సులు పెద్దగా దక్కలేదు. సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొనితెచ్చుకుంది.
తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. ఏడేళ్లపాటు తెలుగు తెరకు దూరమైన ఆమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. తను నటించిన 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ హీరో తెలుగువాడే.. అయినా తెలుగు రాదు: శ్వేతా బసు
నటి శ్వేతా బసు ప్రసాద్ ఒక తెలుగు సినిమా సెట్‌లో వేధింపులకు గురైనట్లు ఆమె గుర్తుచేసుకుంది. తాను ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. పలు ఛాన్స్‌లతో కెరీర్ పరంగా బాగానే ఉందని చెప్పింది. కానీ, ఒక సందర్భంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపింది. అది కూడా తెలుగు సినిమా సెట్‌లోనే అంటూ పేర్కొంది. 'నేను తెలుగులో ఒక హీరోతో సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. నా హైట్ 5'2 ఉంటుంది. ఆయన మాత్రం సుమారు ఆరు అడుగులు ఉంటాడు. దీంతో అందరూ నన్ను హీరోతో పోలుస్తూ.. నేను ఎత్తు తక్కువగా ఉన్నానంటూ సెట్‌లో ప్రతిఒక్కరూ ఎగతాళి చేసేవారు. ఆయనేంటి అంత ఎత్తు ఉంటే.. ఈవిడేమో 5 అడుగులు మాత్రమే ఉందని కామెంట్లు చేసేవారు.
ఈ విషయంలో హీరో కూడా కామెంట్ చేసినట్లు తెలిసింది. నా హైట్ మీద ఆయన కూడా పలుమార్లు వ్యంగ్యాన్ని కూడా ప్రదర్శించేవాడు. ప్రతిరోజూ నా ఎత్తును గుర్తుచేస్తూ కామెంట్ చేసేవారు. ఇక్కడ హీరోతో మరో సమస్య ఉంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు అతను ప్రతి సన్నివేశాన్ని గందరగోళానికి గురిచేసేవాడు. ఎన్నో రీటేక్‌లు తీసుకుంటాడు. తెలుగువాడే అయినప్పటికీ అతనికి భాష కూడా సరిగ్గా రాదు. తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు. అతని మాటలు సెట్స్‌లో ఎవరికీ అర్థం కావు. నేను చాలా కష్టపడి తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదానిని. అయినప్పటికీ చాలామంది నా హైట్ గురించే కామెంట్ చేసేవాళ్లు. అతని భాష గురించి ఎవరూ పట్టించుకోరు. నా కంట్రోల్‌లో లేని హైట్ గురించి వాళ్లు కామెంట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించేది.' అని ఆమె చెప్పింది. ఈ గొడవ అంతా ఏ సినిమాలో జరిగిందో ఆమె వెళ్లడించలేదు.

ఆమె కొత్త బంగారు లోకం (2008)లో తన తొలి చిత్రంతో ఎంట్రి ఇచ్చింది. ఆపై రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ చిత్రాలలో ఆమె నటించింది. ఆమె చివరి తెలుగు చిత్రం విజేత (2016) అని తెలిసిందే. తెలుగు సినిమాతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో కూడా శ్వేత మెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment