బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్.. ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘ఏకడా..’ అంటూ శ్వేత చెప్పిన డైలాగ్ ఎప్పటికీ గుర్తిండి పోతుంది. అయితే ఈ సినిమా తర్వాత శ్వేతాకు పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. కాస్కో, రైడ్, ‘కళావర్ కింగ్’ వంటి సినిమాల్లో నటించినా అవి అంతగా విజయం సాధించలేదు. అనంతరం బాలీవుడ్‌కి వెళ్లిపోయి అక్కడ చిన్న చిన్న సినిమాలు చేశారు. ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ అనే సినిమాలో వదిన పాత్రగా మెప్పించిన శ్వేతా చివరగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ది తాష్కెంట్ ఫైల్స్ లో కనిపించింది. ఆమె ఇప్పటివరకు తమిళం, తెలుగు, బెంగాలీ భాషలలో ఎనిమిది సినిమాలు చేసింది. చదవండి: డిప్రెషన్‌లో నటి శ్వేతా బసు..!
ఇదిలా ఉండగా శ్వేతా బసు ఈరోజు తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1991 జనవరి 11న జమ్ షెడ్ పూర్’లో శ్వేతా జన్మించింది. తన చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడిన శ్వేతా మాస్ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె మొదటి హిందీ సినిమా ఫిర్ బి హిందూస్తానీ. ఆ సినిమా తర్వాత 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో బాల నటిగా నటించింది. ఈ సినిమాకు శ్వేతా ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకుంది. అయితే 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కాగా ప్రముఖ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరు 2018 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోతున్నట్లు శ్వేత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment