ఓ చెత్త ఆటగాడిలా కోహ్లి ప్రవర్తన! | Naseeruddin Shah Says Virat Kohli is World's Worst Behaved Player | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 18 2018 8:38 AM | Last Updated on Tue, Dec 18 2018 12:41 PM

Naseeruddin Shah Says Virat Kohli is World's Worst Behaved Player - Sakshi

విరాట్‌ కోహ్లి, నసీరుద్దీన్‌ షా

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు అత్యంత చెత్త ప్రవర్తన గల ఆటగాడని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా తీవ్ర విమర్శలు చేశాడు. దూకుడు, చెడు ప్రవర్తన కారణంగా క్రికెట్లో అతడు సాధించిన నైపుణ్యం, ప్రతిభలను కోల్పోతున్నాడని నసీరుద్దీన్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. తనేం దేశం విడిచిపోవడం లేదని కూడా పేర్కొన్నాడు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరుజట్ల కెప్టెన్లు మాటల యుద్దానికి దిగిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో ప్రాంరంభమైన ఈ వార్‌.. నాలుగో రోజు ఆటలోను కొనసాగింది. ఎంతలా అంటే వీరి మాటల యుద్ధం ఆపేందుకు... చివరకు అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బుమ్రా బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా ఆడిన పైన్‌ సింగిల్‌ పూర్తి చేసుకోబోతున్న సమయంలో లాంగాఫ్‌లో ఉన్న కోహ్లి క్రీజ్‌ వైపు నడిచాడు. వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు.

దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తలేవు’ అంటూ పైన్‌ బదులిచ్చాడు! దాంతో అంపైర్‌ క్రిస్‌ గాఫ్‌నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్‌ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్‌ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్‌ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్‌ వ్యాఖ్యానించాడు. ఈ మాటల యుద్దం నేపథ్యంలోనే నసీరుద్దీన్‌ షా కోహ్లిని తప్పుబట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement