నసీరుద్దిన్ షా
‘‘సినిమా అనేది ఆ కాలమానంలో మనుషులు ఎలా ఉండేవారో, ఎలా జీవించారో భవిష్యత్తులో చెప్పడానికి ఓ రికార్డ్‌లా ఉండాలి’’ అన్నారు నటుడు నసీరుద్దిన్ షా. ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఒకవేళ ఓ వందేళ్ల తర్వాత 2018లో సినిమా చూస్తే అప్పటి పరిస్థితులు, స్థితిగతులు ఆ సినిమా కళ్లకు కట్టాలి. సినిమా అంటే కేవలం వినోదంగానే మిగిలిపోకూడదు. సినిమా సమాజాన్ని మార్చదు, ఎటువంటి మార్పూ తీసుకు రాలేదనీ నాకు తెలుసు.
సినిమాను ఎడ్యుకేషన్ మీడియంగానూ చూడలేను. ఎందుకంటే సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం. మళ్లీ మర్చిపోతాం. అయితే పూర్వకాలపు పరిస్థితులు భవిష్యత్తులో తెలుసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా అప్పటి స్థితిగతులను సినిమాల్లో క్యాప్చర్ చేయాలి. 2018లో ఇండియన్స్ ఇలా ఉండేవారా? అని చూపించుకునేలా ఉండాలి. సినిమా ఓ కొలమానంలా ఉండాలి. కేవలం సల్మాన్‌ఖాన్ సినిమాలతో మిగిలిపోకూడదు. అలా చూసుకోవడం నటీనటుల బాధ్యత’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment