టీ, సమోసా, గులాబ్‌జామ్లకు రూ. 9 కోట్లు! | Rs 9 crore to spend to Samosas and Gulabijams since four years | Sakshi
Sakshi News home page

టీ, సమోసా, గులాబ్‌జామ్లకు రూ. 9 కోట్ల ఖర్చు!

Published Wed, Aug 31 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

టీ, సమోసా, గులాబ్‌జామ్లకు రూ. 9 కోట్లు!

టీ, సమోసా, గులాబ్‌జామ్లకు రూ. 9 కోట్లు!

లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రులు తమను కలవడానికి వచ్చిన అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామ్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేశారు. అదేదో వారి సొంత డబ్బుతో కాక ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సొమ్ముతో వారు ఈ ఆర్భాటాలు చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా బుధవారం శాసనసభలో వెల్లడించారు. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి అక్షరాలా రూ.8,78,12,474 ఖర్చయిందని ఆయన చెప్పారు.

అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అరుణ్ కుమార్ కోరి ఇందుకోసం అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు. ప్రజాపనుల విభాగం మంత్రి శివ్‌పాల్ యాదవ్ మాత్రం అల్పాహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తమ అతిథులకు మర్యాదలు చేయడానికి అక్కడి మంత్రులు రోజుకు రూ.2,500 ల నుంచి రూ. 3 వేల వరకు ఖర్చు పెట్టొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement