Shivapal Yadav
-
అనూహ్య నిర్ణయం తీసుకున్న అఖిలేష్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు దగ్గరైన కొందరు నాయకులపై వేటు వేశాడు అఖిలేష్. దీంతో శివపాల్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజీపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే, కైలాష్ సింగ్, ఘాజీపూర్ జిల్లా మాజీ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ సహా పలువురు పార్టీ సభ్యులను బహిష్కరించారు. ఇదిలా ఉండగా, పార్టీ మిత్రపక్షాలైన అప్నాదళ్ (కె), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) నాయకులతో యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జస్వంత్ నగర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేసిన అఖిలేష్ బాబాయ్ , ఎమ్మెల్యే, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (పీఎస్పీ) నేత శివపాల్ యాదవ్ హాజరుకాలేదు. ఆయనతోపాటు అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. అఖిలేష్ యాదవ్‌తో జరిగిన సమావేశానికి ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్‌పాల్ బలియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటిమికి గల కారణాలు, సామాన్యుడి సమస్యలు, నిరుద్యోగం తదితర విషయాల పై చర్చించారు. అయితే సమావేశానికి శివపాల్ యాదవ్ గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలు లేవని.. అందరం కలిసి ఉన్నామని అఖిలేష్ చెప్పారు. (చదవండి: బీజేపీపై ఉమ్మడి పోరు ) -
యూపీ అసెంబ్లీలో రచ్చ!
- గవర్నర్‌పై కాగితపు బంతులు విసిరిన ప్రతిపక్ష నేతలు - తొలిసారి డీడీలో ప్రత్యక్ష ప్రసారం లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత సోమవారం తొలిసారి సమావేశమైన శాసన సభలో ప్రతిపక్ష పార్టీలు రచ్చరచ్చ చేశాయి. సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ రామ్నా యక్‌పై ఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు కాగితపు బంతులు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలతో హోరెత్తించారు. ఈలలేసి గోల చేశారు. దూసుకువస్తున్న కాగితపు బంతుల నుంచి గవర్నర్‌ను రక్షించేందుకు మార్షల్స్... పుస్తకాలు, ఫైళ్లను అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు. కాగా, యూపీలో అసెంబ్లీ సమావేశాలను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. యూపీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే... ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా పెద్దపెట్టున నిరసనలు తెలిపారు. ఎస్పీ శాసనసభాపక్ష నాయకుడు రాజేష్‌యాదవ్... తనకు ప్రసం గం వినిపించడం లేదంటూ పెద్దగా ఈల వేసి చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి చొచ్చుకు పోయారు. 84 పేజీల ప్రసంగాన్ని తీవ్ర గందరగోళం మధ్య గవర్నర్ రామ్‌నాయక్ 35 నిమిషాల్లో పూర్తి చేశారు. ఒకప్పుడు యూపీ అన్నింటా ముందుండేదని, కానీ.. గత కొన్నేళ్లుగా వెనుకబడిందని గవర్నర్ చెప్పారు. మళ్లీ ఇన్నాల్టికి యోగి ఆధ్వర్యంలో అగ్ర భాగాన దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఈ గందరగోళం సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలోనే ఉన్నారు. -
ఒక్కటైన విపక్షాలు; ఆ ఇద్దరి రూటే వేరు
- యూపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రచ్చరచ్చ - గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన ఎస్పీ, బీఎస్పీ - యోగి సర్కారుపై ‘ఉమ్మడి’ పోరుకు పిలుపు - ఎడమొహం, పెడమొహంగా అఖిలేశ్- శివపాల్ లక్నో: ఉత్తరప్రదేశ్ 17వ అసెంబ్లీ తొలి సమావేశాలు.. విపక్షాల నిరసనల మధ్య రసాభసగా సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతోన్న మొదటి సమావేశాలు కావడంతో అధికార బీజేపీ అసెంబ్లీ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ విపక్షలు కూడా అంతే స్థాయిలో నిరసనలు తెలిపాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రామ్‌నాయక్ సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యులు ఒక దశలో గవర్నర్ పైకి పేపర్లు విసరడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మార్షల్స్ అడ్డుగా నిలవగా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో స్పీకర్ హృదయనారాయణ్ దీక్షిత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు సభలోనే ఉన్నారు. విపక్షాల ఐక్యత.. యూపీలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలన సాగుతున్నదని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని ఎస్పీఎల్పీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన రాంగోవింద్ చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీని అడ్డుకోకపోతే అది యూపీ సర్వనాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీఎస్పీ పక్ష నేత లాల్జీ వర్మ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘బీజేపీని, అది సాగిస్తోన్న ప్రజావ్యతిరేక పాలను ఎండగట్టే క్రమంలో భావస్వారూప్యం ఉన్న పార్టీలతో.. అది ఎస్పీ అయినా, మరొక పార్టీ అయినా కలిసి పనిచేయడానికి బీఎస్పీ సిద్ధంగా ఉంది’ అని లాల్జీ వర్మ చెప్పారు. చెరోదారిలో బాబాయి - అబ్బాయి.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభలో అఖిలేశ్‌యాదవ్, శివపాల్ యాదవ్‌లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. అందరికంటే ముందే సభకు వచ్చిన శివపాల్.. ఎస్పీ సభ్యులు అందరితో కలివిడిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. గవర్నర్ రాకకు కొద్దిగా ముందు సభలోకి వచ్చిన అఖిలేశ్.. బాబాయిని చూసి కూడా చూడనట్లే ముఖం తిప్పుకున్నారు. ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత శివపాల్.. ములాయం నేృత్వంలో లైకిక ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యూపీ అసెంబ్లీలో తొలిరోజే రభస
-
రెండుకళ్ల సిద్ధాంతంతో 'సైకిల్'కి రిపేరు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చుతారంటూ చెలరేగుతున్న ఊహాగానాలకు సమాజ్ వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ సమాధానం ఇచ్చారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రిని మార్చబోమని స్పష్టం చేశారు. సీఎం అఖిలేశ్ యాదవ్, ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ లు కూడా ములాయంతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముగ్గురూ మూడు భిన్నవాదలను వినిపించారు. తొలుత ఆవేశపూరిత ప్రసంగం చేసిన అఖిలేశ్.. 'నాన్నే నాకు గురువు, దైవం' అని, పార్టీని చీల్చాలనే ఆలోచన లేనేలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో శివపాల్, అమర్ సింగ్ ల తీరును ఆక్షేపించారు. 'కేబినెట్ కు సమాంతరంగా అమర్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారా?'అని అఖిలేశ్ ప్రశ్నించారు. పూర్తికాకముందే అఖిలేశ్ నుంచి మైక్ లాగేసుకున్న శివపాల్ యాదవ్.. తన వర్గంపై సీఎం చేస్తోన్న ఆరోపణలకు ఖండించారు. 'ముఖ్యమైన పనిమీద ఇటీవలే సీఎం చాంబర్ కు వెళ్లా. మాటల సందర్భంలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సీఎం నాతో అన్నారు. ఇది నినిజం. గంగమ్మమీద ఒట్టు. అఖిలేశ్, బీజేపీ కుమ్మక్కయ్యారు'.. ఇదీ సమాజ్ వాది పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ తాజా వాదన. అన్నకొడుకు అఖిలేశ్ బీజేపీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని, ఎస్పీని విచ్ఛిన్నం చేసేదిశగా బీజేపీ కూడా అతనికి మద్దతు పలుకుతోందని వ్యాఖ్యానించారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత మైక్ అందుకున్న ములాయం.. మొదట అఖిలేశ్- శివపాల్ లు ఆలింగనం చేసుకోవాలని ఆదేశించారు. ఇద్దరూ తనకు ముఖ్యులేనని అన్నారు. గతంలో చేసిన తప్పులకు అమర్ సింగ్ ను క్షమించేశానని, కష్టకాలం అతను పార్టీకి అండగా నిలిచాడని ములాయం గుర్తుచేశారు.. శివపాల్, అమర్ సింగ్ లను ఒదులుకోలేనని స్పష్టంగా చెప్పారు. అదేసమయంలో అఖిలేశ్ ను సీఎం పదవినుంచి తొలిగించబోనని తేల్చిచెప్పారు. తద్వారా రెండు కళ్ల సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని సైకిల్ పార్టీ చీఫ్ చెప్పకనే చెప్పారు. నవంబర్ 5న నిర్వహించనున్న సమాజ్ వాది పార్టీ రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో చర్చించారు. -
టీ, సమోసా, గులాబ్జామ్లకు రూ. 9 కోట్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రులు తమను కలవడానికి వచ్చిన అతిథులు, అధికారులకు టీ, సమోసా, గులాబ్ జామ్ వంటి అల్పాహారం ఇవ్వడానికి నాలుగేళ్లలో ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేశారు. అదేదో వారి సొంత డబ్బుతో కాక ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రజల సొమ్ముతో వారు ఈ ఆర్భాటాలు చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా బుధవారం శాసనసభలో వెల్లడించారు. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారానికి అక్షరాలా రూ.8,78,12,474 ఖర్చయిందని ఆయన చెప్పారు. అల్పాహారం కోసం రూ.21 లక్షలకు పైగా వెచ్చించిన మంత్రులు ఆరుగురు. సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అరుణ్ కుమార్ కోరి ఇందుకోసం అత్యధికంగా రూ.22,93,800 ఖర్చు చేశారు. ప్రజాపనుల విభాగం మంత్రి శివ్‌పాల్ యాదవ్ మాత్రం అల్పాహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తమ అతిథులకు మర్యాదలు చేయడానికి అక్కడి మంత్రులు రోజుకు రూ.2,500 ల నుంచి రూ. 3 వేల వరకు ఖర్చు పెట్టొచ్చు.