
సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్‌నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.
కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది.
దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం.
“విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరొక వైయస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత కుట్రపై బయటపడ్డ సంచలన ఆడియో”
తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పడు ఈ పార్టీ ఆఫీసునీ కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు. ఈ మేరకు కార్పొరేషన్… pic.twitter.com/HOj5nlm3Fx— YSR Congress Party (@YSRCParty) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment