
టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
కనగానపల్లి మండలం ఎలకుంట్లలోని వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
కనగానపల్లి(అనంతపురం): కనగానపల్లి మండలం ఎలకుంట్లలోని వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలపై వరస దాడులు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని వైఎస్సార్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత సహకారంతోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.