![Union Minister Kishan Reddy Slams HYDRA Demolished In Hyderabad](/styles/webp/s3/article_images/2024/08/24/kishanreddy1.jpg.webp?itok=NclrPptF)
సాక్షి, న్యూఢిల్లీ: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని మండిపడ్డారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు.
ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment