
హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాల్మీకీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో వెనుక బడిన తరగతుల సంక్షేమశాఖ, మహర్షి శ్రీవాల్మీకి జయంతి ఉత్సవ కమిటీ నిర్వహిం చిన వాల్మీకి జయంతి వేడుకల్లో కడియం మాట్లాడారు. ప్రత్యేక వృత్తి లేని వాల్మీకీలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీని చ్చారు. వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీలో కలపాలనే డిమాండ్ ఉందని, ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ వేసిందని చెప్పారు. కమిటీ సిఫా రసుల మేరకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ అభివృద్ధి సంస్థ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్, కమిష నర్ టి.విజయ్‌కుమార్, ఎంబీసీ అభివృద్ధి సంస్థ సీఈవో కె. అలోక్ కుమార్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, వాల్మీకి జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌లు వెంకటరమణ, గట్టు భీముడు, ఎం.వేణుగోపాల్, తిమ్మప్ప, కె.అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment