
కర్నూలు జిల్లా: గత ఎన్నికల్లో ఎస్టీ జాబితాలోకి చేరుస్తానని మాట ఇచ్చి మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వాల్మీకీలు బుద్ది చెప్పే సమయం వచ్చిందని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆలూరులో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాల చరిత్ర మార్చేది బీసీలేనని, అలాంటి తమని చంద్రబాబు విస్మరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రానున్న ఎన్నికలలో తమని గుర్తుంచకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఒక ప్రాంతంలోని 5 జిల్లాలో వాల్మీకులను ఎస్టీలుగాపెట్టి మిగతా 8 జిల్లాలో బీసీల జాబితాలో ఉంచడం చాలా దారుణమన్నారు.