సాక్షి, విజయవాడ: ఏపీలో ఈఎస్‌ఐ స్కాం కి పాల్పడిన మాజీ మంత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఒత్తిడి తెచ్చినందుకే ఈ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.. వారు అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలకు పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.(ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)
నెలకు రూ.75 లక్షలు దోచుకునే ఉద్దేశ్యంతోనే అచ్చెన్నాయుడు టెలి మెడిసిన్ కంపెనీకి సిఫారసు లేఖ ఇచ్చారని జయరాం ఆరోపించారు. ప్రధాని మెరుగైన సేవలందించాలని చెబుతారని.. కానీ స్కాములు చేయమని చెబుతారా అని ప్రశ్నిస్తూ.. టీడీపీ నేతల వాదన వింటుంటే నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మందుల్లేవని కార్మికులు, చెల్లించాల్సిన బకాయిలున్నాయని కంపెనీలు తన దృష్టికి తీసుకువచ్చాయని.. తన పరిశీలనలో వచ్చిన అనుమానాలతోనే విచారణకు ఆదేశించానని మంత్రి జయరాం పేర్కొన్నారు.
‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’
Comments
Please login to add a commentAdd a comment