Pitani Satyanarayana
-
చక్రం తిప్పిన పితాని కుమారుడు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించిన ఈఎస్ఐ స్కాం మూలాలు జిల్లాలో బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. పితాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఈ వ్యవహారంలోచక్రం తిప్పినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట్, పితాని పీఎస్ మురళీమోహన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ను శుక్రవారం ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 శాతం కమీషన్ చెల్లిస్తేనే పనులు? తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పనిజరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది. తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారు. పితాని వెంకట్ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి పీఎస్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాదించిన ఏసీబీ పితాని పీఎస్ మురళీమోహన్ను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మురళీమోహన్ సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. (ఎందుకు దాస్తున్నారు?) -
ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ తమ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెనాయుడు సహా పది మంది ఈ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ అనే వ్యక్తిని సచివాలయంలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెనాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు) -
ఆ మాజీ మంత్రులు తప్పించుకోలేరు..!
సాక్షి, పోడూరు: ఈఎస్ఐ స్కాం లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు.. అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కుమారుడి చేత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.(ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!) ఈఎస్ఐ స్కాం లో చంద్రబాబుకు కూడా వాటా ఉందని మంత్రి శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. కార్మికుల్లో అధిక శాతం బీసీలే ఉంటారని అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులను చేస్తే.. వైఎస్ జగన్ పేద బీసీలను మంత్రులను చేశారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్ జగన్ తన కేబినెట్లో అవకాశం కల్పించారని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బట్టబయలైంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్‌పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం తెలిసిందే. అనంతరం కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తాజా లేఖలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలోని దాదాపు 12.5 లక్షల మంది కార్మికులు, 38 లక్షల మంది కుటుంబ సభ్యులు గత సర్కారు అవినీతి వ్యవహారాల వల్ల సరైన వైద్యం పొందలేకపోయారు. ఆ ఇద్దరూ.. ఇష్టారాజ్యం నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నామినేషన్‌పై పనులు కట్టబెట్టాలని లేఖలో సూచించగా అనంతరం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన పితాని ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారు. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలి. ఈమేరకు ఓ ఉన్నతాధికారి మెమో కూడా జారీ చేశారు. అయితే పితాని సత్యనారాయణ కార్మికశాఖ బాధ్యతలు చేపట్టగానే మరో మెమో ఇచ్చారు. 2017 నవంబర్ 28న అధికారులు ఇచ్చిన మెమోను అభయెన్స్‌లో పెడుతూ 2018 ఫిబ్రవరిలో మరో మెమో జారీ అయింది. ఈఎస్ఐ ఉన్నతాధికారులకు అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖ పితాని తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపి కమీషన్లు అందుకున్నారని పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు చిన్న కాగితం రాసిచ్చినా ఆర్డర్లు ఇచ్చారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో 500కిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ఫైలు పెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం వెలువడటంతో అప్పటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా ఈ ప్రతిపాదనను రద్దు చేశారు. ఐదేళ్లలో ఇద్దరు మంత్రులూ కార్మికుల కడుపుకొట్టారని, ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందలేదని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 2017లో ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలని ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేసుకోవచ్చంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని ఇచ్చిన మరో మెమో. అచ్చెన్నకు కొత్త కాదు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నీరు– చెట్టు పనులనూ తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నీరు చెట్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవున రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే అచ్చెన్నాయుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించేవారు. ఈఎస్ఐలో ప్రధాని మోదీ చెప్పినట్టే చేశా: అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో నామినేషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ చెప్పినట్లే చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంపై శుక్రవారం ఆయన వివరణ ఇచ్చారు. టెలి హెల్త్ సర్వీసెస్‌కి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలన్న ప్రధాని సూచన మేరకు వ్యవహరించామని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తొలుత తెలంగాణలో దీన్ని ప్రారంభించారని, అక్కడ మాదిరిగానే ఏపీలోనూ చేయాలని నోట్ పంపానన్నారు. నామినేషన్‌పై ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అప్పటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. సగటున 132 శాతం అధిక ధరకు కొనుగోలు వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132 శాతం అధికంగా చెల్లించి కొన్నారంటే నాటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఎంత భారీ స్థాయిలో లావాదేవీలు నడిచాయో బోధపడుతోంది. 2017–18 మధ్య ఏకంగా 198.66 శాతం అధికంగా చెల్లించారు. ఆ ఏడాది కొన్ని మందుల వాస్తవ విలువ రూ.10.82 కోట్లు కాగా ఏకంగా రూ.32.31 కోట్లు వెచ్చించి కొన్నారు. విజిలెన్స్ నివేదికలో ముఖ్యాంశాలు - రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారు. - టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. - ల్యాబొరేటరీ పరికరాలను ఎలాంటి టెండరు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. - శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా 129.32 శాతం అధిక రేట్లకు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చారు. - ఫర్నీచర్ కొనుగోళ్లకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్లు చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. - ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులున్నారు - రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. - రూ.కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించుకోకుండా మూలన పడేశారు. - జెర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డా.సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. - రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అవి ఎక్కడా పనిచేయడం లేదు. -
ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం..!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఈఎస్ఐ స్కాం కి పాల్పడిన మాజీ మంత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఒత్తిడి తెచ్చినందుకే ఈ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.. వారు అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలకు పాల్పడి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.(ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) నెలకు రూ.75 లక్షలు దోచుకునే ఉద్దేశ్యంతోనే అచ్చెన్నాయుడు టెలి మెడిసిన్ కంపెనీకి సిఫారసు లేఖ ఇచ్చారని జయరాం ఆరోపించారు. ప్రధాని మెరుగైన సేవలందించాలని చెబుతారని.. కానీ స్కాములు చేయమని చెబుతారా అని ప్రశ్నిస్తూ.. టీడీపీ నేతల వాదన వింటుంటే నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మందుల్లేవని కార్మికులు, చెల్లించాల్సిన బకాయిలున్నాయని కంపెనీలు తన దృష్టికి తీసుకువచ్చాయని.. తన పరిశీలనలో వచ్చిన అనుమానాలతోనే విచారణకు ఆదేశించానని మంత్రి జయరాం పేర్కొన్నారు. ‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’ -
సీఎం రమేష్‌తో ఎమ్మెల్యే పితాని సమావేశం
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పార్టీ నేత వరదరాజులరెడ్డి బుధవారం ఉదయం సీఎం రమేష్ నివాసానికి వెళ్లారు. సీఎం రమేష్‌తో వీరు ఇరువురు భేటీ అయ్యారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కలిశారు. -
పితాని పితలాటకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ భూ సంతర్పణ రావణకాష్టంలా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పితాని తన అనుచరులకు కట్టబెట్టిన భూముల వ్యవహా రంపై ఇప్పుడు దళితులు, మహిళలు ఎడతెగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకీ తీవ్రతరమవుతున్న ఈ భూవివాదం పూర్వాపరాలను పరి శీలిస్తే.. ఆచంటలోని నటరాజ్ థియేటర్ వెనుక భాగంలో గల రెండెకరాల 70సెంట్ల పోరంబోకు స్థలం (ఆర్ఎస్ నెం.1246/3) కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతోంది. విలువైన ఈ భూమి మొత్తంగా కబ్జా అవుతున్న నేపథ్యంలో ఎప్పటినుంచో అక్కడ నివాసముంటున్న పేదలు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరుతూ వచ్చారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌కు, రచ్చబండ కార్యక్రమాల్లో అధికారులకు పలుమార్లు దరఖాస్తులు అందజేశారు. స్పందించిన అధికారులు అర్హులైన 40మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే విలువైన ఈ భూమిపై కన్నేసిన అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ అనుచరులు అర్హులైన 38మంది లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను రాసుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు మంత్రి చేతుల మీదుగా ఆయన ఇంట్లోనే పట్టాలు పొందారు. ఎన్నో ఏళ్లనుంచి అక్కడే ఉంటున్న తమకు కాకుండా అనర్హులకు పట్టాలివ్వడంపై స్థానికులు వెంటనే పితాని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, అక్కడికి సమీపంలో శివారు గ్రామమైన పోర ప్రాంతంలో 15 మందికి పట్టాలిప్పిస్తామని ఆయన నచ్చజెప్పారు. అక్కడ ఎప్పటినుంచో నివాసముంటున్న తాము మరోచోటకు ఎందుకు వెళ్తామంటూ స్థానికులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో సదరు భూముల వ్యవహారం కొంతకాలం సద్దుమణిగింది. టీడీపీ వాళ్లే మిమ్మల్ని పంపించి ఉంటారు : పితాని ఆగ్రహం తాజాగా ఈ ప్రాంతవాసులు మళ్లీ తాము ఉంటున్న స్థలాలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలిసి అభ్యర్థించేందుకు సుమారు యాభైమంది మహిళలు కొద్దిరోజుల కిందట పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలోని పితాని స్వగృహానికి వెళ్లారు. అంతే.. వారిని చూడగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘పట్టాల్లేవ్.. స్థలాల్లేవ్.. మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు. ఆచంట టీడీపీ వాళ్లే ఇదంతా చేస్తున్నారు. ఈ రాజకీయాలు నా దగ్గరొద్దు. ముందు ఇక్కడి నుంచి పోండి..’ అంటూ ఒకింత కటువుగా మాట్లాడినట్టు చెబుతున్నారు. పితాని వ్యవహార శైలిపై స్థానికులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసనలు చేపడు తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అయిన పితాని వద్దకు ఎప్పటినుంచో ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న తాము వెళ్తే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకారులను అవమానిస్తున్నారు మహిళలని కూడా చూడకుండా ఇంటికొచ్చిన వారి పై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు భూముల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న ఆందోళనకారులను కూడా అవమానిస్తున్నారు. వారం రోజులకుపైగా ఆచంట నియోజకవర్గ కేంద్రంలో పేదలు, మహిళలు నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయం. అర్హులైన వారికే పట్టాలు వచ్చాయని మంత్రి వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులతో పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయి. - వసంతాడ నాగేశ్వరరావు, దళిత ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు -
హ్యాట్రిక్ సాధించిన పితాని
ఆచంట, న్యూస్‌లైన్: ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. పితాని వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 3,920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004లో పెనుగొండ నియోజకవర్గం నుంచి పితాని తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గం రద్దు కావడంతో పితాని ఆచంట నుంచి పోటీ చేసి రెండవసారి విజయం సాధించారు. అనంతరం ఆయనకు దివంగత వైఎస్ మంత్ర పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరిన పితాని ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు టీడీపీ చేరి ఆచంట నుంచి పోటీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,59,559 ఓట్లు ఉండగా 1,29,833 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పితాని సత్యనారాయణకు 63,549 ఓట్లు ప్రసాదరాజుకు 59,629 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కేతా గోపాలన్‌కు 1654 ఓట్లు రాగా కాంగ్రెస్ 1641 ఓట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. -
బావమరిదికి షాక్ ఇచ్చిన తమ్మయ్య
ఆచంట: 'బావ బావ పన్నీరు బావను పట్టుకుని తన్నారు...' అని తెలుగులో ఒక సరదా పాట ఉంది. ఆత్మీయులే ప్రత్యర్థులుగా మారుతున్న ఆధునిక రాజకీయ ఎన్నికల సమరాంగణంలో ఈ పాట పాడుకునే సందర్భాలు ఆగుపిస్తున్నాయి. ఇందుకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గమే ఉదాహరణ. ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని పెనుగొండ డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ గుబ్బల తమ్మయ్య భావించారు. పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందన్న దీమాతో ముందే ప్రచారం కూడా మొదలుపెట్టారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో తమ్మయ్య బావమరిది పితాని సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసవచ్చారు. ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి చందంగా తమ్మయ్యను కాదని పితానికి టిక్కెట్ ఇచ్చారు సైకిల్ పార్టీ అధినేత. సొంత బావమరిదే తన సీటు ఎసరు పెట్టడంతో తమ్మయ్య మనస్తాపానికి గురయ్యారు. తన మద్దతుదారుల సలహాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను వైఎస్సార్ సీపీ నేతలు వంకా రవీంద్ర, ప్రసాదరాజు, చీర్ల రాధయ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బావమరిది ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి తమ్మయ్య 'ఫ్యాన్' గాలిని ఆశ్రయించారు. మరోవైపు టీడీపీని వదిలిపెట్టి బావమరిదికి తిరిగి షాక్ ఇచ్చారు. -
చంద్రబాబును కలసిన పితాని సత్యనారాయణ
టీడీపీలో చేరిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సాక్షి, హైదరాబాద్: జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా గుబ్బల తమ్మయ్యను చంద్రబాబు ఖరారు చేశారు. పితాని పార్టీలో చే రితే తమ్మయ్యను తప్పించి పితానిని బరిలోకి దింపుతారు.సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకరరె డ్డి కూడా టీడీపీలో చేరారు. -
పితానికి ఝలక్
ఆచంట, న్యూస్‌లైన్ : ఆచంట నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం.. చేసిందే నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పితాని సత్యనారాయణను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు తీర్మానించారు. శనివారం ఆచంటలోని రామేశ్వరస్వామి సత్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లెం ఆనంద్‌ప్రకాష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర అభ్యర్థుల ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని ప్రకటించారు. కష్టపడి పనిచేసిన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను పితాని సత్యనారాయణ అణగదొక్కారని, వలసదారులను ప్రోత్సహించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పితానికి తగిన గుణపాఠం చెప్పడానికి అంతా సంసిద్ధంగా ఉన్నారన్నారు. డీసీసీ కార్యదర్శి కానుమిల్లి జోగిరాజు మాట్లాడుతూ ఆచంటలో ప్రధాన సమస్యలైన డ్రెయినేజీ, రహదారుల విస్తరణ, 30 పడకల ఆసుపత్రి వంటి అతి ముఖ్య మైన పనులను పూర్తి చేయడంలో పితాని విఫలమయ్యారని ధ్వజమె త్తారు. ఏఎంసీ ఉపాధ్యక్షుడు చేకూరి సూరిబాబు మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గానికి ఎంపీ కోటాలో 2 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరైతే వాటిని పేదలకు అందకుండా పితాని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను చెల్లెం ఆనందప్రకాష్కు ఇవ్వాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కానుమిల్లి మోహన్‌రావు, నెక్కంటి సతీష్, పోడూరి సాయిబాబా, డీటీడీసీ బాబు, కానుమిల్లి జోగిరాజు, పెదపాటి పెద్దిరాజు, పిల్లి వీరన్న తదితరులు మాట్లాడారు. -
ఇంకా ఊగిసలాటే..!
-
ఇంకా ఊగిసలాటే..!
* కొత్తపార్టీపై కిరణ్ ఎడతెరిపిలేని చర్చలు * ప్రజల్లో స్పందన లేదన్న సన్నిహితులు.. సందిగ్ధంలోనే మాజీ సీఎం సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన తన అనుచర నేతలతో చర్చోపచర్చలు సాగిస్తున్నా పార్టీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. కిరణ్ తన మనసులోని అభిప్రాయాలను బయటపెట్టకుండానే నేతలతో చర్చలు కొనసాగిస్తుండడంతో వారు కూడా ఇదమిత్థంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో మరింతగా అప్రతిష్ట పాలవుతామంటూ ఒకరిద్దరు నేతలు పార్టీ ఏర్పాటు దిశగా ఒత్తిడి పెంచుతున్నా ప్రజల్లో స్పందన మాట అటుంచి తనతో కలసి వచ్చేవారెంత మంది ఉంటారో అర్థంకాక కిరణ్ ముందుకు వెళ్లాలా? లేదా? అన్న సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఎప్పటిలాగానే ఈ అంశంపై ఒకటీ రెండురోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశముందని కిరణ్ సన్నిహిత నేతలు పేర్కొంటున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాధ్, తోట నరసింహం, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కందుల రాజమోహన్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు అమాసరాజశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కిరణ్‌తో సమావేశమయ్యూరు. లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్, తదితర అంశాలపై చర్చించారు. షెడ్యూల్ వచ్చేసినందున ఇక కొత్త పార్టీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు సమయం లేదన్న అభిప్రాయానికి నేతలు వచ్చారని తెలుస్తోంది. సమైక్యవాదం విన్పించినప్పటికీ.. తాజాగా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా ప్రజల్లో స్పందన వ్యక్తం కాలేదని, ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్పాటుచేసినా ఫలితం ఉండదని నేతలు కిరణ్‌కు తెలిపారు. అంతిమంగా పార్టీ పెట్టాలా? వద్దా? అనే అంశంపై ఎలాంటి తుది నిర్ణయానికి రాకుండానే కిరణ్ ఈ భేటీని ముగించారు. గురువారం కూడా మరికొందరు నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశముందని కిరణ్ సన్నిహితుడొకరు తెలిపారు. -
గోదావరి మణిహారం పూర్తయ్యేదెప్పటికో..!
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి 2009 మే నెలలో శ్రీకారం చుట్టారు. గామన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిపై పనులను చేపట్టారు. ప్రభుత్వం ముందుగా నిర్దేశించిన ప్రకారం 2013 మే నెలాఖరుకు పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. గడువు పూర్తయి 8 నెలలు కావస్తున్నా పనులు మొక్కుబడి తంతుగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కొవ్వూరు వైపు పెండింగ్‌లో ఉందన్న సాకుతో నిర్మాణ పనులను నిలిపివేశారు. ఇటీవల భూ సేకరణకు కోర్టు అడ్డంకులు తొలిగినా పనుల్లో పురోగతి లేదు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినా పనులు పూర్తికాకపోవడంతో 2014 మే నెలాఖరు వరకు గడువు పెంచారు. గత నవంబర్ 12న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. 2014 ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా ప్రయోజనం లేదు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగడానికి అనుకూలంగా ఉన్నా కాంట్రాక్ట్ సంస్థ ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4.1 కి.మీ.. 164 పిల్లర్లు గోదావరి నదిపై 4.1 కిలోమీటర్ల పొడవున, 10.3 మీటర్లు వెడల్పు గల రెండు లైన్ల రోడ్డు వంతెన నిర్మిస్తున్నారు. వంతెనకు కుడి వైపున 82 పిల్లరు, ఎడమవైపున 82 పిల్లర్లు ఉన్నాయి. వీటిపై వాహనాలు రాకపోకలు సాగేందుకు అనువుగా ముందుగానే తయారు చేసిన సిమెంట్ సిగ్మెంట్లను అమర్చారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఎడమ వైపున.. ఎడమ వైపున 1 నుంచి 30వ పిల్లర్ వరకు సిగ్మెంట్ల అమరిక, 30వ పిల్లర్ నుంచి 53వ పిల్లర్ వరకు జాయింట్లు అతకడం పూర్తయింది. 53 నుంచి 82వ పిల్లర్ వరకు జాయింట్లను అతకాల్సి ఉంది. వీటికి తోడు వంతెన సైడు నిర్మించే రెయిలింగ్స్‌కు కాంక్రీటు పనులు చేపట్టాల్సి ఉంది. కుడి వైపున.. కుడి వైపున 1 నుంచి 16వ పిల్లర్ వరకు రెయిలింగ్‌తో సహా రెండు లైన్ల వంతెనను పూర్తి స్థాయిలో నిర్మించారు. 30వ పిల్లర్ నుంచి 40వ పిల్లర్ వరకు ఫుట్‌పాత్ రెయిలింగ్స్, 40వ పిల్లర్ నుంచి 82వ పిల్లర్ వరకు సైడ్ రెయిలింగ్‌తోపాటు ఫుట్‌పాత్ రెయిలింగ్ పనులు పూర్తికాలేదు. సిగ్మెంట్ల జాయింట్లను అతికి రహదారి స్వరూపం ఏర్పడిన తరువాత దీనిపై బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ముందుకు సాగని అప్రోచ్ రోడ్లు తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుంచి జాతీయ రహదారి వరకు 9 కి.మీ., కొవ్వూరు వైపు 1.98 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సి ఉంది. దీనిలో కొవ్వూరు వైపు 4.55 ఎకరాల భూమి కోర్టు వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కోర్టు అడ్డంకులు తొలగడంతో రెవెన్యూ అధికారులు ఈ భూమిని కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. రెండు రోజుల నుంచి ఈ భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ పూర్తయి చాలాకాలం గడిచినా అప్రోచ్ రోడ్డు నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే ఉంది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు సాగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో అప్రోచ్ రోడ్డు కోసం భూమిని సీఆర్బీతో నింపి సరిపెట్టారు. -
రీయింబర్స్మెంట్ పై యాజమాన్యాలదే నిర్లక్ష్యం: పితాని
హైదరాబాద్: విద్యార్థుల కొరకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యాజమాన్యాలే నిర్లక్ష్యం చేస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆ పథకం పేరుతో రూ.2100 కోట్ల విడుదల చేస్తే.. విద్యార్థులకు చేరింది మాత్రం రూ.82 కోట్లేనని తెలిపారు. ఫీజు రియింబర్స్ మెంట్ పై నిర్లక్ష్యం తగదని ఆయన సూచించారు. రీయింబర్స్మెంట్ పథకం 2లక్షల మంది విద్యార్థులకు మాత్రమే చేరిందన్నారు. ఈ ఏడాది బయో మెట్రిక్ విధానం నుంచి ఇంటర్మిడియట్ విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్లు పితాని తెలిపారు. -
అన్నిటికీ సవరణలు.. ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అన్ని క్లాజులకూ సవరణలు ప్రతిపాదించాలని, వాటిపై ఓటింగ్ కోరాలని కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతా చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకి స్తూ గట్టిగా తవు అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నారు. బిల్లుపై శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయుణ, శైలజానాధ్, వట్టి వసంతకుమార్, మహీధర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, పాలడుగు వెంకటరావు, ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై సమీక్ష చేశారు. బిల్లుపై సవరణల ప్రతిపాదనకు స్పీకర్ శుక్రవారం వరకు గడువు విధించినందున దానిపైనా సమాలోచన చేశారు. సీఎం మాట్లాడుతూ న్యాయనిపుణులతో చర్చించి సవరణల ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు. పార్టీల వారీగా స్పీకర్ సమయం కేటాయించనున్నందున ఆ మేరకు ఎంతవుందికి అవకాశం వస్తుందో అంతమందినే ఎంపిక చేస్తే సరిపోతుందని కొందరు మంత్రులు సూచించారు. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక బిల్లు అయినందున ప్రతి ఒక్క సభ్యుడు తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరముందని గాదె, పాలడుగు తదితరులు అభిప్రాయపడ్డారు. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ తరఫున సమగ్ర అభిప్రాయాలు వినిపించేందుకు కొందరి పేర్లను ప్రత్యేకంగా ఎంపికచేశారు. సభలో అభిప్రాయం చెప్పి వ్యతిరేకత వ్యక్తపరిస్తే చాలని, రాష్ట్ర విభజన బిల్లుకు అడ్డుకట్ట పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారని సమాచారం. తన అభిప్రాయం ఏమిటో చర్చలో పాల్గొన్నప్పుడు స్పష్టంగా చెబుతాన న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే మెజారిటీ రాదని, ఆ ప్రాంతంలోని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల సహకారం కూడా అవసరమని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశానంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సవరణల ప్రతిపాదనలపై అడ్వొకేట్ జనరల్‌తో, మరికొందరు న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. -
పారదర్శకంగా స్కాలర్‌షిప్‌ల మంజూరు
=అమలులోకి కొత్త విధానం =ఇక అవినీతికి అవకాశముండదు.. =వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి పితాని వెల్లడి కలెక్టరేట్ (విజయవాడ), న్యూస్‌లైన్ : విద్యార్థులకు పారదర్శకంగా స్కాలర్షిప్లు మంజూరు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులకు సూచించారు. హైదరాబాదు నుంచి ఆయనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రేమాండ్ పీటర్, ఎస్సీ కార్పొరేషన్ కమిషనర్ జయలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వాణిప్రసాద్లు జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు పారదర్శకంగా మంజూరు చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ విధానంలో విద్యార్థి దరఖాస్తును ఆన్లైన్ ద్వారా సంబంధిత జిల్లా అధికారి వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. విద్యార్థి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఆర్ఏఎస్ఎఫ్ వెబ్సైట్ ద్వారా జిల్లా అధికారులు వాటిని పరిశీలించి సంబంధిత కళాశాలలకు లాగిన్ చేస్తారని వివరించారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థి దరఖాస్తుతో పాటు కావాల్సిన ధ్రువపత్రాలు పొందుపరిచేలా పరిశీలించి.. పాస్ డివైస్ పరికరం ద్వారా విద్యార్థి వేలిముద్రను ఈ-పాస్ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలను ధ్రువీకరించి ఒక బార్కోడ్ నంబరు ఇస్తారని చెప్పారు. ధ్రువీకరించిన బార్కోడ్ నంబర్ల ద్వారా విద్యార్థుల కులాలవారీగా వివరాలను జాబితా తయారుచేసి సంబంధిత జిల్లా అధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. బార్కోడ్ నంబరు ద్వారా విద్యార్థుల వివరాలను స్కానింగ్ ద్వారా ధ్రువీకరించి స్కాలర్షిప్లు మంజూరు చేస్తారని వివరించారు. మంజూరైన స్కాలర్‌షిప్‌ల వివరాలు ఒకే సమయంలో ట్రెజరీకి, విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా... ఈ విధానం వల్ల విద్యార్థి స్కాలర్షిప్ మంజూరు విషయంలో ఎలాంటి అవినీతీ జరగదని, బోగస్ విద్యార్థి, కళాశాలకు అవకాశం కలగదని మంత్రి, అధికారులు.. జిల్లా అధికారులకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. దాని ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.శివశంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పాల్గొన్నారు. -
దాళ్వాకు ఓకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రానున్న దాళ్వాలో పూర్తి విస్తీర్ణానికి సాగునీరు ఇవ్వాలని జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్ణయించింది. దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలా.. పూర్తిగా పంట విరామం ప్రకటించాలా.. లేక ఆధునికీకరణ పనులకు అవకాశం కల్పిస్తూ కొంత ఆయకట్టుకు మాత్రమే నీరివ్వాలా? అనే సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా నీటిపారుదల సలహా మం డలి సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాళ్వాకు నీరివ్వాల్సిందేనని రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరడంతో, అందుకు అంగీకరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటన చేశారు. దాళ్వాకు నీరివ్వాలనే నిర్ణయంతోపాటు వచ్చే సార్వా సాగుకు ఆలస్యంగా నీరిచ్చి, డెల్టా ఆధునికీకరణ పనులకు వెసులుబాటు కల్పించాలని తీర్మానించారు. దీర్ఘకాలికంగా సమస్యగా ఉన్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన పనులు పూర్తయ్యాక తొలగించాలని నిర్ణయించారు. మూడు ప్రతిపాదనల నడుమ... నీటిపారుదల సలహా మండలి చైర్మన్, కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తొలుత ఇరిగేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటి విడుదల, డెల్టా ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ముందుంచారు. జిల్లా యంత్రాంగం తరఫున ఆయన మూడు ప్రతిపాదనలు చేశారు. డెల్టా ప్రాంతంలో నికరంగా వరి సాగుచేసే 4.60 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరివ్వాలనేది మొదటి ప్రతి పాదన కాగా, ఉప్పుటేరు బేసిన్‌లోని వెంకయ్యవయ్యేరు, ఉండి కాలువ, పాత వయ్యేరు కాలువ, గోస్తనీ పరిధిలోని ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి.. మిగిలిన ఏడు కాలువలకు సాగు నీరందించాలనేది రెండో ప్రతిపాదన. తద్వారా పంట విరామం ప్రకటించిన నాలుగు కాలువల పరిధిలో రూ.167 కోట్ల ఆధునికీకరణ పనులు చేపడతామని ఎస్ఈ ప్రతిపాదించారు. దాళ్వా తర్వాత వచ్చే సంవత్సరం మార్చి 31న కాలువలు మూసివేసి, జూలై 31 తిరిగి నీరు విడుదల చేయూలనేది మూడో ప్రతిపాదన. తద్వారా 120 రోజుల్లో రూ.171 కోట్ల డెల్టా ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. సమావేశంలో మొదటి, మూడు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మూడు కాలువల పరిధిలో పంట విరామం లోసరి మెయిన్ కెనాల్, తోకతిప్ప బ్రాంచి కెనాల్, వీ అండ్ డబ్ల్యు కాలువ చివరి రీచ్‌తోపాటు మెరక ప్రాంతాలను సాగునీటి సరఫరా నుంచి మినహాయిస్తూ సమావేశం తీర్మానిం చింది. నీటి లభ్యత దృష్ట్యా తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వా డ కాలువ ఆయకట్టులో రబీ సాగుకు అనుమతించింది. రైతులతో సమావేశాలు నిర్వహించి వచ్చే దాళ్వాలో ఆరుతడి పంటలు వేసుకోవడానికి సిద్ధం చేయాలని తీర్మానించారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే : పితాని పూర్తి స్థాయి పంట విరామం బదులు కొంత ఆయకట్టుకు పంట విరామాన్ని ప్రకటించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని తొలుత భావించామని, కానీ.. వరుస తుపానుల నేపథ్యంలో రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నిర్ణయాన్ని మార్చుకుని దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయిం చామని మంత్రి పితాని తెలిపారు. రైతులు త్వరగా నారుమడులు వేసుకుని, నాట్లను త్వరితగతిన పూర్తి చేయూలని కోరారు. తుపాన్లకు దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని త్వరలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, బీమా కూడా ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలి కంగా అపరిష్కృతంగా ఉన్న నందమూరు పాత ఆక్విడెక్టును జూన్ 30లోగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సమయంలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డెల్టా ఆధునికీరణ పనులు చేయడంలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారని పితాని పేర్కొన్నారు. ఇప్పటివరకూ కేవలం 30 శాతం పనులు మాత్రమే అయ్యాయమని తెలిపారు. ‘ఖరీఫ్‌కు ఆలస్యంగా నీరిస్తే కోర్టుకెళతాం’ ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరిస్తామని ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించిందని, అందుకు విరుద్ధంగా ఆలస్యంగా సాగు నీరిస్తే హైకోర్టులో కోర్టు ధిక్కారణ పిటీషన్ వేస్తామని రైతాంగ సమాఖ్య అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు అధికారులను హెచ్చరించారు. ఆధునికీకరణ పనులపై ప్రజలకు నమ్మకం పోయిందని, దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని అన్నారు. నీటిపారుదల ఎస్ఈకి వ్యవసాయంపై అవగాహన లేదనిపిస్తోం దని, జూలై నెలలో ఖరీఫ్‌కు నీరిస్తే ఎలాగని ప్రశ్నించారు. జూన్ ఒకటో తేదీకల్లా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు ఆలస్యమైతే తుపానుల వల్ల కోట్లాది రూపాయల పంటల్ని నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేదు : దాళ్వా కావాలో, ఆధునికీకరణ కావాలో తేల్చుకోమనడం సరికాదని కౌలు రైతు సం ఘం నాయకుడు శ్రీనివాస్ విమర్శించారు. ఆధునికీకరణ పనుల విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆధునికీరణ చేయాలన్నారు. తెలంగాణ వస్తే ఎలాగూ రబీ ఉండదు తెలంగాణ 15 రోజుల్లో ఇచ్చేస్తున్నట్లు చెబుతున్నారని, అదే జరిగితే వచ్చే దాళ్వా ఎలాగూ ఉండదని.. కాబట్టి ఈ సంవత్సరం దాళ్వా ఇవ్వాలని కాగుపాడు నీటి సంఘం నాయకులు అధికారులను కోరారు. కాలువ పైభాగం వారికి దాళ్వా ఇచ్చి కింది భాగంలో పనులు చేయాలని సూచించారు. పాత అక్విడెక్టును తొలగిస్తే నష్టం ఉండదు : ఈలి నాని నందమూరు పాత అక్విడెక్టును తొలగిస్తే ఎవరికీ నష్టం ఉండదని, రైతులు ఇబ్బంది పడకుండా ఈ సమస్యను పరిష్కరిం చాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని కోరారు. అమెరికాలో తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ తుపానులు వస్తున్నట్లు ఒక శాస్త్రవేత్త చెప్పారని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దాళ్వా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇన్పుట్ సబ్సిడీని కొన్ని బ్యాంకులు రైతుల అప్పులకు జమ చేస్తున్నాయని, అలా చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆధునికీకరణకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి : కలెక్టర్ దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే ఆధునికీకరణ పనులు సాగవని కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పష్టం చేశారు. ఏటా సార్వాలో రైతులు నష్టపోతున్నారని, పేరుకు రెండు పంటలున్నా రైతులకు ఒక పంట మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని నివారిం చాలంటే ఆధునికీకరణే మార్గమన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా వచ్చే సంవత్సరం ఏంచేయాలో కూడా నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈసారి కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు వారి బ్యాంక్ గ్యారంటీలను ఎన్‌క్యాష్ చేస్తామని హెచ్చరించారు. పంట విరామం లేకుంటే రూ.17 కోట్ల పనులే : ఇరిగేషన్ ఎస్ఈ పంటలకు ఎటువంటి విరామం ఇవ్వకపోతే రూ.17 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు మాత్రమే చేయగలుగుతా మని నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధాకర్ చెప్పారు. జిల్లాలో దాళ్వా సాగుకు 48 టీఎంసీల నీరు సరిపోతుందని, నీటి లభ్యత బాగానే ఉందని తెలిపారు. సమావేశంలో ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళి, జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ రుద్రరాజు పండురాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా కీలకమైన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్, డెల్టా ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, కారుమూరి నాగేశ్వరరావు, కలవపూడి శివ తదితరులు హాజరుకాలేదు. -
విభజన ప్రక్రియను ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్రం చేపట్టిన ప్రక్రియను వెంటనే ఆపాలని రాష్ట్ర మంత్రులు సాకె శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, అహ్మదుల్లా ప్రధాని మన్మోహన్సిం గ్‌కు విన్నవించారు. భారీవర్షాలు, వరద నష్టంపై వివరించి సాయం కోరడానికి సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ చీఫ్‌లతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లిన సందర్భంగా ఈ నలుగురు మంత్రులు ఆయనకు విభజన వద్దంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర శాసనభ తీర్మానానికి వ్యతిరేకంగా దేశంలో ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని, ప్రజాస్వామ్య భారతదేశంలో పద్ధతులు, సంప్రదాయాలకు రాజ్యాం గంలో లిఖితపూర్వకంగా ఉన్న అధికరణలు, నిబంధనలతో సమాన విలువనిచ్చి చూడాలని ఆ వినతిపత్రంలో మంత్రులు కోరారు. సీమాంధ్ర ప్రాంత ప్రజానీకం మనోభావాలను పట్టించుకోకుండా, వారినుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందని, కేంద్రం తీరుతో తామెంతో కలత చెందుతున్నామని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్రలో ప్రస్తుతం ఉధృతంగా ప్రజాందోళన సాగుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగ నిబంధనల మేరకు రాష్ట్ర విభజన బిల్లు, తీర్మానం రెండింటినీ రాష్ట్ర శాసనసభకు పంపించాలని, శాసనసభను పక్కనపెట్టి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లరాదని కోరారు. ప్రధానికి వినతిపత్రం ఇచ్చాక ఏపీ భవన్ వద్ద శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం తరఫున తాము ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని, దిగ్విజయ్ అనుమతితోనే అది సమర్పించామని, తాను జాగ్రత్తగా చదువుతానని మన్మోహన్ స్పందించారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము అన్ని అవకాశాలను, మార్గాలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. -
విభజన తీర్మానాన్ని ఓడించండి: ఎన్జీవోలు
ఎమ్మెల్యేలతో హామీ పత్రాలు తీసుకున్న ఎన్జీవోలు సాక్షినెట్‌వర్క్: శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తామంటూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించి వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా డిమాండ్ చేశారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలను కలిసి తెలంగాణ తీర్మానానికి విరుద్ధంగా ఓటేస్తామంటూ పేర్కొన్న ప్రమాణపత్రాలను తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని ఇళ్లను ఎన్జీవోలు ముట్టడించారు. విభజనను అడ్డుకుంటామని వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు నుంచి కూడా హామీ పత్రాలు తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డితో పాటు రాజమండ్రి రూరల్, కొత్తపేట, పి.గన్నవరం ఎమ్మెల్యేలు చందన రమేష్, బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరీదేవిలు విప్‌ను ధిక్కరించైనా తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ ఎన్జీఓలకు ప్రమాణపత్రాలు అందజేశారు. విశాఖలో ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, రామానాయుడు, విజయ్‌కుమార్, గొల్లబాబూరావుల ఇళ్లకి ఎన్జీవోలు వెళ్లగా, తెలంగాణకు వ్యతిరేకంగా తాము ఓటేస్తామని ఎమ్మెల్యేలు హామీపత్రాలిచ్చారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే తాను వ్యతిరేకంగా ఓటేస్తానని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నడిరోడ్డుపై ఉద్యోగులు, ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు. గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిని కలిసి తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా సమైక్యవాదులు కోరారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసే నిమిత్తం ఎమ్మెల్యేల నుంచి హామీ తీసుకునేందుకు శనివారం విజయవాడలో నిర్వహించిన సభలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సభకు మంత్రి సారథితోపాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి హాజరయ్యారు. వెల్లంపల్లి మాట్లాడుతూ రాజకీయపార్టీలపై విమర్శలు చేయడంతో ఓ జేఏసీ నాయకుడు జోక్యం చేసుకుని పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ సమావేశంలో ఎవరిపైనా విమర్శలొద్దని సూచించారు. దీంతో మరో ఎమ్మెల్యే యలమంచిలి రవి ఒక్కసారిగా ఊగిపోతూ 2009లో చిదంబరం ప్రకటన చేసినప్పుడు మేం వీధుల్లోకి వస్తే మీరంతా ఎక్కడున్నారు’ అని జేఏసీ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. సభలో పలువురు లేచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
‘ఫీజుకు’ ఆధార్’ తప్పదు మంత్రుల బృందం
సమావేశంలో నిర్ణయం నర్సింగ్, పారామెడికల్, ఫార్మా కోర్సులపైనా చర్చ వాటిపై ఏమీ తేల్చకుండానే ముగిసిన సమావేశం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్సమెంట్ పథకం కింద లబ్ధి పొందేందుకు విద్యార్థులకు ‘ఆధార్’ తప్పనిసరి అనే నిబంధన కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రుల బృందం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్పీటర్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చ జరిగింది. అయితే, సుప్రీం తీర్పుపై కేంద్రం అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నందున ప్రస్తుతానికి ఆ నిబంధనను కొనసాగించాలని నిర్ణయించారు. ఆధార్ నంబర్ ఉంటేనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని సమావేశంలో తీర్మానించారు. సీమాంధ్రలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో.. ఫీజుల పథకం కింద అక్కడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్న అంశంపై కూడా చర్చ జరిగింది. దరఖాస్తులకు ఎలాంటి తుది గడువు లేనందున ఆ ప్రాంత విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సమావేశం అభిప్రాయపడింది. దాంతోపాటు నర్సింగ్, పారామెడికల్, ఫార్మా కోర్సులకు ఫీజుల పథకం అమలుపై కూడా మంత్రుల బృందం చర్చించినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జీవో నెం. 66 ప్రకారం యాజమాన్య కోటాలో చేరిన దాదాపు 2,100 మంది ఏఎన్ఎం, జీఎన్ఎం విద్యార్థినులకు బకాయిల చెల్లింపు, జీఎన్ఎం విద్యార్థుల ఇంటర్నషిప్, డీఏహెచ్ల తరహాలో మెస్‌చార్జీల పెంపు అంశాలపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. ఫీజుల పథకం అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా, మంగళవారం జరిగిన సమావేశానికి కేవలం ముగ్గురు మాత్రమే వచ్చారు. మైనార్టీ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు కేంద్రం అందజేసే ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 వరకు గడువు పొడిగించామని, అర్హులైన విద్యార్థులు మైనార్టీ ఫైనాన్స కార్పొరేషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
అక్టోబర్ 3న తదుపరి నిర్ణయం: మంత్రి పితాని
హైదరాబాద్: అక్టోబర్ 3న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. ఆ వ్యాఖ్యలు మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. తన రాజకీయ జీవితంలో ప్రజల నుంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇదని మంత్రి పితాని అన్నారు. -
మళ్లీ చర్చలు జరిపాకే విభజన: పితాని సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పెద్దలతో మళ్లీ చర్చలు జరిపాకే రాష్ట్ర విభజన అంశంపై ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేశామన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు సీమాంధ్రలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. గురువారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ హడావుడిగా చేసిన ఏకగ్రీవ తీర్మానం సీమాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, అందుకే అక్కడ ఒక్కసారిగా ఉద్యమం ఎగసిందని తెలిపారు. ఈ పరిస్థితిని కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నాయన్నారు. ఉద్యమాల తీవ్రత తగ్గి, ఇబ్బందులను కూడా తొలగించాకే విభజనపై ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలా? వద్దా? అన్నది కేంద్రం ఆలోచనలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏపీఎన్జీవోల సభ వెనుక సీఎం కిరణ్ ప్రోత్సాహం ఉందనడం అవాస్తవమన్నారు. -
మంత్రి పితానికి సమైక్య సెగ
-
క్షేత్రస్థాయికెళ్లి పరిశీలిస్తా: ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై సీఎం కిరణ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమం అమలుపై శనివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయనీ విషయం తెలిపారు. సమావేశంలో మంత్రులు పితాని సత్యనారాయణ, పి.బాలరాజు, డి.మాణిక్యవరప్రసాద్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వి.భాస్కర్, రేమండ్‌పీటర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ఉదయలక్ష్మి, సోమేశ్‌కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసిన గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 కల్లా ఎస్సీ, ఎస్టీలకు 3.85 లక్షల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పితాని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.