క్షేత్రస్థాయికెళ్లి పరిశీలిస్తా: ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై సీఎం కిరణ్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమం అమలుపై శనివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయనీ విషయం తెలిపారు.
సమావేశంలో మంత్రులు పితాని సత్యనారాయణ, పి.బాలరాజు, డి.మాణిక్యవరప్రసాద్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వి.భాస్కర్, రేమండ్‌పీటర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, విద్యాసాగర్, ఉదయలక్ష్మి, సోమేశ్‌కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసిన గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 కల్లా ఎస్సీ, ఎస్టీలకు 3.85 లక్షల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పితాని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.