రీయింబర్స్మెంట్ పై యాజమాన్యాలదే నిర్లక్ష్యం: పితాని
హైదరాబాద్: విద్యార్థుల కొరకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యాజమాన్యాలే నిర్లక్ష్యం చేస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆ పథకం పేరుతో రూ.2100 కోట్ల విడుదల చేస్తే.. విద్యార్థులకు చేరింది మాత్రం రూ.82 కోట్లేనని తెలిపారు. ఫీజు రియింబర్స్ మెంట్ పై నిర్లక్ష్యం తగదని ఆయన సూచించారు. రీయింబర్స్మెంట్ పథకం 2లక్షల మంది విద్యార్థులకు మాత్రమే చేరిందన్నారు. ఈ ఏడాది బయో మెట్రిక్ విధానం నుంచి ఇంటర్మిడియట్ విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్లు పితాని తెలిపారు.