టీడీపీలో చేరిన సంతనూతలపాడు ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థిగా గుబ్బల తమ్మయ్యను చంద్రబాబు ఖరారు చేశారు. పితాని పార్టీలో చే రితే తమ్మయ్యను తప్పించి పితానిని బరిలోకి దింపుతారు.సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకరరె డ్డి కూడా టీడీపీలో చేరారు.