చేసేది లేక ‘గుమ్ము’నైపోతున్నాడు
ఏటికి ఎదురీదుతున్న టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం
పతాకస్థాయికి తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు
సర్దిచెబుతున్నా దారికి రాని వైనం
మరోవైపు బీజేపీ,జనసేన నాయకులతో తలనొప్పి
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.
పుండుపై కారం..
👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు.
👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.
👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్‌తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు.
👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్‌యాదవ్‌ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు.
జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..
👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.
👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్‌లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment