నిన్నటి దొంగ నేడు ముత్యమా? | YSRCP MLA Venkatarami Reddy Fire On Gummanur Jayaram | Sakshi
Sakshi News home page

నిన్నటి దొంగ నేడు ముత్యమా?

Published Thu, Mar 7 2024 11:21 AM | Last Updated on Thu, Mar 7 2024 3:34 PM

YSRCP MLA Venkatarami Reddy Fire On Gummanur Jayaram - Sakshi

గుమ్మనూరుకు సీటిస్తే గుంతకల్లును భ్రష్టు పట్టిస్తారు


రెడ్‌ బుక్‌లో రాసిన పేరు ఇప్పుడు లోకేశ్‌ తీసేస్తారా?


ఇప్పుడు అవినీతి గుమ్మంలోకి వచ్చిందని రామోజీ రాయగలరా?


 టీడీపీని నిలదీసిన ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి

గుంతకల్లు: ‘నిన్నటి వరకూ గుమ్మనూరు జయ­రాం­ను బాబు బండబూతులు తిట్టారు. ఇప్పు­డు టీడీపీలో చేరగానే అదే జయరాం ముత్య­మైపో­తాడా? అప్పుడు జయరాం దొంగ అని అన్నారు. ఇప్పుడు మంచి వాడయ్యాడా?’ అని అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్‌­సీపీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధ­వా­రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్ర­బాబు కర్నూ­లు వెళ్లిన­ప్పు­డల్లా పేకాట మంత్రి అని, బెంజ్‌ కారు మంత్రి అంటూ గుమ్మనూరును విమర్శించేవారని, అదే వ్యక్తికి బాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారని, పసుపు కండువా కప్పుకోగానే పునీతుడ­య్యారా అంటూ ప్రశ్నించారు. అప్పు­డా­­యన అవి­నీతి చేసి ఉంటే టీడీపీలోకి రాగానే ఆ పాపా­లన్నీ ప్రక్షా­ళన అయి­నట్టని బాబు భావి­స్తు­న్నా­రా అని నిల­దీశారు. 

రెడ్‌బుక్‌లో పేరు తొలగిస్తారా?
లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆలూరు వెళ్లిన­ప్పుడు ఇక్కడి పేకాట మంత్రి పేరు రెడ్‌బుక్‌లో రాసుకున్నా అని,  అధికారంలోకి వచ్చాక ఆయన పని చెబుతా అంటూ గుమ్మనూరును ఉద్దేశించి అన్నా­రని చెప్పారు. జయరాం ఇప్పుడు టీడీపీలోకి వచ్చి­నందున, ఆయన పేరు రెడ్‌ బుక్‌లో నుంచి తీసే­స్తారా అని ప్రశ్నించారు. ఈనాడులో గుమ్మనూరు పై కథనం రాశారని, ఇప్పుడు బెంజ్‌ కారులో గుమ్మంలోకి అవినీతిని తెచ్చుకున్నా­మని రాయగలరా అని నిలదీశారు. 

పేకాట జయరాం మాకొద్దంటూ టీడీపీ క్యాడర్‌ నిరసన
గుంతకల్లు: పేకాట మాజీ మంత్రి గుమ్మనూరు జయ­రామ్‌కు గుంతకల్లు టికెట్‌ కేటాయిస్తే డిపాజిట్లు కూడా దక్కనివ్వబోమని టీడీపీ అను­బంధ సంస్థ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు హెచ్చ­రించారు. అసలు జయ­రాంకు గుంతకల్లుతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో అనంతపు­రం జిల్లా గుంతకల్లులోని టీడీపీ కార్యా­లయం నుంచి ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ వరకు నిరసన ర్యాలీ చేశారు. పేకాట మాజీ మంత్రి మనకు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావర­ణాన్ని కోరుకుంటున్నారని, అరా­చకాలు చేసే జయరాంతో అది సాధ్యం కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పాలాభి­షే­కం చేసి, జయరాంకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినా­దాలు చేశారు. ఈ సం­దర్భంగా నాయకులు మాట్లా­డుతూ ఆలూ­రులో చెత్త (గుమ్మనూరు జయరాం) ఇక్కడ బంగారం అవుతుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. నారా లోకేశ్‌ను దూషించిన గుమ్మనూరు సోదరులను పార్టీ­లోకి చేర్చుకోవడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే ప్రశాంతతకు మారుపేరైన గుంతకల్లు సీటును ఈ అరాచక వ్యక్తికి ఇస్తే పేకాట క్లబ్బులు, నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. జితేంద్రగౌడ్‌ను కాదని జయ­రామ్‌కు టికెట్‌ ఇస్తే డిపాజిట్టు కూడా రాకుండా ఓడిస్తామని శపథం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement