internal fight
-
టీడీపీ సమర్పించు కేబుల్ వార్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్ వార్’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్సీవీ కేబుల్ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్ పేరిట కేబుల్ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారుఅగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...కే–ఛానల్లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్ దీనిపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్సీవీ కేబుల్ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్సీవీ కేబుల్ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు. -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్‌కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్‌తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్‌యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్‌లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
‘మీరు ఆ్రఫ్టాల్ జెండా కూలీలు మాత్రమే. మా పక్కన నిలబడే అర్హత మీకెక్కడిది. కిందకు దిగండి.. మీరు మా భ‘జనసేన’లా ఉండాలే తప్ప.. పక్కన ఉండాలని అనుకోవద్దు..’ ఇదీ భీమిలిలో జెండా మోస్తున్న గాజుగ్లాసు కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు బ్యాచ్ చేతుల్లో అడగడుగునా ఎదురవుతున్న పరాభవం. సాక్షి, విశాఖపట్నం : పొత్తుల్లో భాగంగా భీమిలి సీటును టీడీపీ చేతుల్లో పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు.. అసలు జనసేన తమ కూటమి కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలను పక్కన పెట్టేశారు. పొత్తు ఉందని ప్రచారానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలకు.. గంటా బ్యాచ్ చేతుల్లో ప్రతి రోజూ ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. గాజు గ్లాసుతో జెండా కనిపిస్తే చాలు.. గంటా బ్యాచ్ వారిపై విరుచుకుపడుతోంది. వారి తప్పు లేకపోయినా.. వారితో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి సమాధానం ఇస్తే చాలు టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల క్రితం మధురవాడలో టీడీపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జనసేన శ్రేణులకు దెబ్బలే మిగిలాయి. జీవీఎంసీ 6వ వార్డులో గంటా, భరత్ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. బైక్ ర్యాలీగా వచ్చిన వారిలో టీడీపీ, జనసేన కార్యకర్తల బైక్‌లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఇదే అదనుగా భావించిన గంటా బ్యాచ్.. అక్కడ గాజు గ్లాస్ జెండా పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరిపైనా చేయిచేసుకున్నారు. దొరికిన జనసేన కార్యకర్తను దొరికినట్లే చితక్కొట్టారు. చివరికి తమని జనసేన కార్యకర్తలు గాయపరిచారంటూ టీడీపీ శ్రేణులు పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్లాస్ బ్యాచ్ అవాక్కైంది. ప్రచారానికని పిలిచి.. కొట్టారంటూ పంచకర్ల సందీప్ వద్ద వాపోయినా.. తనకేం సంబంధం లేదన్నట్లుగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. రథం ఎక్కే అర్హత మీకెక్కడిదిరా..? తాజాగా మరో చేదు అనుభవం గ్లాసు కార్యకర్తలకు ఎదురైంది. భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో గంటా శ్రీనివాసరావు ప్రచారం సందర్భంగా యాతపేటలో మంగళవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. అప్పటికే ప్రచార రథంపై జనసేన మండల ఉపాధ్యక్షుడు ఎరుసు సూర్రెడ్డి తన అనుచరులతో కలిసి ఉన్నాడు. ఇది చూసిన టీడీపీ నేతలు డీఎఎన్ రాజు, కోరాడ రమణ తదితరులు సూర్రెడ్డితో పాటు మిగిలిన జనసేన శ్రేణుల్ని కిందకి దిగండి అని హుకుం జారీ చేశారు. మేం ప్రచారం చేస్తామని జెండాలు పైకెత్తడంతో.. అసహనానికి గురైన గంటా వర్గం.. గ్లాసు సేనని ప్రచార రథం నుంచి కిందకు లాగేశారు. అసలు మిమ్మల్ని ఎవడ్రా బండి ఎక్కించింది. ఎక్కించిన వాడికీ బుద్ధిలేదు.. ఎక్కిన మీకు బుద్ధి లేదు.. మీకంత అర్హతెక్కడిదిరా.. పొండిరా ఇక్కడి నుంచి.. కిందకెళ్లి.. మీ జెండాలు ఊపేసుకోండి.. అంటూ దూషించడంతో.. అందరి ముందు తీవ్ర అవమాన భారంతో వెనుదిరిగారు. ఈ వ్యవహారాన్ని సందీప్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గంటాకు సందీప్ అమ్ముడు పోయారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు తమకు జరిగిన అవమానం గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సందీప్ కూడా గంటా అనచరుడిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.అడుగడుగునా అవమానాలు భరించాలా..? పవన్ కల్యాణేమో పొత్తులో ఉన్నామంటారు.. వీళ్లేమో జెండా కూలీలని అవమానిస్తున్నారు.. ఒక పార్టీలో ఉండి కూడా ఎందుకీ బతుకులు అన్నట్లుగా గాజుగ్లాసు సేన కుమిలిపోతోంది. అడుగడుగునా అవమానాలు పడుతూ, వాళ్ల చేతిలో దెబ్బలు తింటూ.. తిట్లు తిడుతుంటే పడుతూ.. టీడీపీ జెండాలు మోయడం తమకు అవసరమా అంటూ శ్రేణులు.. తమ అధినాయకత్వాన్ని ప్రశి్నస్తున్నారు. ఇప్పుడే ఇలా అవమానిస్తూ.. తన్ని తరిమేస్తుంటే.. రేపు పొరపాటున గంటా గెలిస్తే.. తమ ఆస్తులన్నీ లాక్కొని.. ఊరి నుంచి తరిమేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వాపోతున్నారు. ఇరువర్గాల మధ్య కొట్లాట తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలసలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో అక్కరమాని ఎర్రయ్య, కొంగరాని సూరిబాబు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం గంటా ప్రచార ర్యాలీలో జనసేన నాయకులను టీడీపీ నాయకులు ప్రచార రథం నుంచి కిందకు లాగివేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని వైఎస్సార్సీపీ నాయకులే వైరల్ చేశారని ఆరోపిస్తూ ఎక్కువ సంఖ్యలో టీడీపీ నాయకులు అక్కరమాని ఎర్రయ్య కుమారుడు రమణ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఎర్రయ్య తీవ్రంగా గాయపడటంతో 108లో కేజీహెచ్‌కు తరలించారు. ఈ దాడులలో మరో వర్గానికి చెందిన కొంగరాని సూరిబాబు గాయపడ్డాడు -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్‌లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయనకు టికెట్ ఇస్తే నేనే ఓడిస్తా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది. బలంగా వైఎస్సార్సీపీ.. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు. అంతటా అయోమయం.. టీడీపీకి అలవాటైన డబుల్ గేమ్ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకుంటే.. టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్‌ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు. అయినప్పటికీ మామిడి.. లోకేష్ తదితరులకు టచ్‌లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు. కలవరం.. ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. -
తాడోపేడో.. కలమటను తప్పించాల్సిందే..తమ్ముళ్ల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం టీడీపీలో కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో అధిష్టానంతో తేల్చుకోవాలని ఒక వర్గం నాయకులు డిసైడ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న జరగనున్న చంద్రబాబు పర్యటనకు ముందే నిర్ణయం తీసుకోవాలని ఏకంగా అలి్టమేటం జారీ చేశారు. కలమట వెంకటరమణనే కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బాహాటంగానే హెచ్చరించారు. ఇప్పుడున్న ఇన్చార్జి కలమట వెంకటరమణను ఎట్టి పరిస్థితుల్లో సమరి్థంచబోమని మెజార్టీ టీడీపీ నాయకులు తేలి్చచెప్పేశారు. ఆయన్ని తీసేసి మామిడి గోవిందరావుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కలమటపై విశ్వాసం లేదని, ఆయనతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. బుధవారం మామిడి గోవిందరావు క్యాంపు కార్యాలయంలో సమావేశమై విలేకర్ల ఎదుట తమ ఆవేదన, డిమాండ్‌ను తెలియజేశారు. ఆసక్తికర పోరు.. పాతపట్నం టీడీపీలో ఆసక్తి పోరు నడుస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కలమట వెంకటరమణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ తదితరులంతా సమరి్ధస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది కలమటేనని బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభలో కూడా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యరి్థగా కలమట వెంకటరమణ పోటీ చేస్తారని సదరు నాయకులు ప్రకటించారు. దీంతో కలమటకు వ్యతిరేక గ్రూపుగా పనిచేస్తున్న మామిడి గోవిందరావు వర్గీయులకు మింగుడుపడలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమ మాట లెక్క చేయకుండా కలమటే అభ్యర్థి అని ఎలా ప్రకటిస్తారని అసమ్మతి నాయకులంతా రగిలిపోతున్నారు. ఇంకా మౌనంగా ఉంటే మంచిది కాదని భావించి పార్టీ అగ్రనేతలతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అగ్రనేతల ప్రకటన తర్వాత.. నియోజకవర్గ అభ్యర్థి కలమట వెంకటరమణే అని ప్రకటించిన తర్వాత బహిరంగ వేదికపైకి వచ్చి అగ్రనేతల ప్రకటనకు భిన్నంగా అసమ్మతి నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బుధవారమైతే విలేకర్లతో సమావేశమై కలమటపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఆయన్ని ఇన్చార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా ఉన్న పైల బాబ్జి, యాళ్ల నాగేశ్వరరావు, ఎద్దు దాసునాయుడు, వెలమల గోవిందరావు, కాగాన మన్మధరావు, నంబాల వెంకటరావు, కోవిలాపు కృష్ణమాచారి, దశరథ, యర్లంకి తిరుపతిరావు, సనపల తిరుపతిరావు, యారబాటి బాలరాజు, సవలాపురం యల్లమ్మనాయుడు, చాపల రామారావు, బాబారావు తదితర నాయకులంతా కలమటపై ఆరోపణలు గుప్పించారు. ‘కలమట నాయకత్వంపై విశ్వాసం, నమ్మకం లేదు. టీడీపీలో ఉన్న కలమట 2014లో వైఎస్సార్ సీపీలోకి వెళ్లారు. గెలిచిన తరువాత 2016లో టీడీపీలోకి మళ్లీ వచ్చారు. వచ్చాక ఏం చేశారో అందరికీ తెలుసు. కలమటతో పార్టీలు మారకుండా ముందు నుంచి ఉన్న టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేశారు’ అని గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్చార్జిగా ఎంజీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పునరాలోచన చేసుకుని, ఈ నెల 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
Hyderabad: కంటోన్మెంట్లో కారు చిచ్చు!
హైదరాబాద్: తామంతా ఒక్కటేనంటూ చెప్పుకుంటున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి. ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా నేతల మధ్య ఆధిపత్య పోరు తేటతెల్లం అవుతోంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్ని రోజులు బాహటంగానే విమర్శలు చేస్తున్న సాయన్న వారసులు ఏకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. ఆతీ్మయ సమ్మేళనాల ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్, నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తమ నివాసానికి కూతవేటు దూరంలోనే నిర్వహించిన ఐదో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి రాకుండా అదే సమయంలో నాలుగో వార్డులో పర్యటించడం ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. గత నెలలో బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ఒకటో వార్డు ఆతీ్మయ సమ్మేళనానికి సైతం సాయన్న వారసులు లాస్య నందిత, నివేదిత గైర్హాజరయ్యారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి పాల్గొన్న సమావేశానికి సైతం రాకపోవడంతో అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సాయన్న వారసులతో పాటు వారి వర్గానికి చెందిన మెజారిటీ నేతలు రాకపోవడం గమనార్హం. అలకకు కారణాలేంటో? దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించిన మరునాడే అంత్యక్రియల విషయంలో ఆయన వర్గీయులు అధిష్ఠానంపై సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక సాయన్న దశదిన కర్మ ముగిసిన మరునాటి నుంచే మంత్రి తలసాని, మర్రి రాజశేఖర్ రెడ్డిల నడుమ ఆధిపత్య పోరుతో సాయన్న వారసులకు ఆదరణ లేకుండా పోయింది. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో అసమ్మతి మరింత పెరుగుతూ వచి్చంది. అందరినీ కలుపుకోవడమే తన లక్ష్యమంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్ఎస్లో చేరిన శ్రీగణేశ్ తదితరులందరినీ ఒకే వేదిక మీద కూర్చునేలా చేస్తూ ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తమ తండ్రి సాయన్న పేరును తగ్గించే కుట్రకు తెరలేపారంటూ సాయన్న వారసులు అలక వహిస్తూ వచ్చారు. అదే సమయంలో తమకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ మర్రి రాజశేఖర్ రెడ్డిని నేరుగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సాయన్న హయాంలో నిరి్మంచిన మడ్‌ఫోర్ట్, మారేడుపల్లి డబుల్ ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అధిష్ఠానం పెద్దలు కొందరు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన సాయన్న అక్కడే తొలిసారిగా గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి రెండ్రోజుల చికిత్స అనంతరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆఖరి కోరికను నెరవేర్చే విషయంలోనూ తమకు సహకారం అందడం లేదని సాయన్న వారసులు ఆవేదనతో ఉన్నారని, ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే.. తాము వ్యక్తిగత పనుల వల్లే సమావేశానికి రాలేకపోయామంటూ లాస్య, నివేదిత పేర్కొనడం కొసమెరుపు ఎర్రోళ్ల సైతం.. ఇక నియోజకవర్గం పరిధిలోనే ఐదో వార్డులో నివాసముండే సమయంలోనే డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్ధి విభాగం నేతగా, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలోనూ స్థానం దక్కించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టీఎస్–ఎంఎస్ఐ డీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాను సొంతంగా భావించే ఐదో వార్డు ఆత్మీయ సమావేశానికి తనకే ఆ హ్వానం లేదంటూ ఆయన డుమ్మా కొట్టడం విశేషం. -
చంద్రబాబు లెగ్గు మహిమ.. సైకిల్ ముక్కలు
ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎనిమిది నియోజకవర్గాల్లో సైకిల్ ముక్కలు..ముక్కలుగా విడిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు పశ్చిమాన ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గం వరకూ అన్ని ప్రాంతాల్లో గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పైకి అందరూ కలసినట్టుగా బిల్డప్ ఇస్తున్నా అంతర్గతంగా ఒకరంటే ఒకరికి పడక రగిలిపోతున్నారు. ఆ పార్టీ అధినేత వచ్చి వెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరాలేదు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నూతనంగా ఏర్పాటైన జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీ పార్టీ ముక్కలు... ముక్కలుగా విడిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల తీరు ఎవరి దారి వారిదే అన్నట్లు తయారైంది. కొన్ని నియోజవర్గాల్లో పార్టీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అవగతమవుతుంది. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా జిల్లా పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దలేకపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నా వాటిని చంద్రబాబు సరిదిద్దకపోవడం విచారకరమని సొంత పార్టీ కేడరే నిరుత్సాహం వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలోని నేతలు విడిపోయినా, పార్టీ పరువు గంగలో కలిసిపోతున్నా, చంద్రబాబు పార్టీలో అంతా బాగుంది అన్నట్లు బిల్డప్ ఇస్తూ జిల్లాలో మూడు రోజులు గడిపారు. జిల్లా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కొందరు పెత్తందార్లు మిగతా వర్గాల నేతలను విస్మరించటం వల్ల ప్రతి నియోజకవర్గంలో వర్గాల వారీగా పార్టీ చీలిపోయింది. జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు తొలుత గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నేతల మధ్య విభేదాల ఫలితంగా తొలిరోజు సభ అట్టర్ ప్లాప్ అయింది. మూడు ముక్కలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు డబ్బు మూటలకు ఆశపడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ కండువా కప్పుకున్న ముత్తుముల అశోక్ రెడ్డిది ఒక గ్రూపు. రెండో గ్రూపు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి. ఇక ముచ్చటగా మూడో గ్రాపు పెట్టెల నారాయణ యాదవ్‌ది. చంద్రబాబు వచ్చినప్పుడు పిడతల సాయి కల్పనా రెడ్డి అసలు ఆయనను కలవనే లేదు. అధినేత వస్తుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారంటూ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దామచర్ల జనార్దన్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా నిరాకరించినట్టు తెలిసింది. యర్రగొండపాలెంలో అయితే సైకిల్ పార్టీ నాలుగు ముక్కలైంది. సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం ప్రధానంగా ఉండగా ఎరిక్షన్ బాబు, పాలపర్తి డేవిడ్ రాజు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన బూదాల అజితరావుది మరో గ్రూపుగా ఎవరిదారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ పోతున్నారు. పక్క నియోజకవర్గంలో పార్టీ అధినేత స్వయంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే ఇక్కడ ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పార్టీలో కుమ్ములాటలు పక్కనపెట్టిన చంద్రబాబు యర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న దళితులపై వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తల చేత రాళ్ల దాడి చేయించే పనికి పూనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పార్టీ కేడర్‌కు మార్గం చూపే నాయకుడే కరువయ్యాడు. దర్శి పార్టీ ఇన్చార్జ్గా ఉన్న పమిడి రమేష్ ఆ బాధ్యతలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరకు ఇన్చార్జ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి సైతం సోమవారం రాజీనామా చేయటంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తరువాత దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కదిరి బాబూరావు సైతం పచ్చ జెండాను కిందపడేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో దర్శిలో టీడీపీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడు. దీంతో ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఆ నియోజకవర్గంలో నాయకుడిగా పార్టీ కేడర్ గుర్తించటం లేదు. ఇక్కడ విజయకుమార్ సరిపోడు అని పార్టీ కేడర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుబాటులో లేకుండా బయటే ఉంటుండడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తీరు పట్ల పార్టీలో కేడర్ కొంత గుర్రుగా ఉంది. కొంతమందిని దగ్గరకు తీసి మరికొంతమందిని పూర్తిగా విస్మరిస్తున్నాడన్న నైరాశ్యం కార్యకర్తల్లో నెలకొని ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఉగ్రనరసింహారెడ్డి వన్ మ్యాన్ షో నిర్వహిస్తూ సెకండ్ కేడర్‌ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేని దెబ్బకు దామచర్ల విలవిల... జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దెబ్బకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విలవిల్లాడుతున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేని ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులు ఖర్చు చేసిమరీ ప్రజలకు, బాధితులకు సేవలందించారు. అదే సమయంలో దామచర్ల ఒంగోలు ముఖం కూడా చూడకుండా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తలదాచుకున్నారు. వరదల సమయంలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటికి తోడు దామచర్ల సోదరుడు సత్యతో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌కు టీడీపీ టిక్కెట్టు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీలోని నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. బాలినేనిని ఎదుర్కోవాలంటే కొత్త అభ్యర్థి అయితే తప్ప టీడీపీకి వేరే గత్యంతరం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీని దామచర్ల పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దామచర్ల నిర్వహించే సమావేశాలకు కనీసం నూకసానిని పిలవటం కూడా లేదు. దీంతో నూకసాని పాత గుంటూరు రోడ్డులో నుంచి పార్టీ కార్యాలయాన్ని భాగ్యనగర్ మూడో లైన్‌కు మార్చుకున్నారు. టీడీపీ నాయకులను దామచర్ల భాగ్యనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఎవరూ వెళ్లొవద్దని ఆంక్షలు విధించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నూకసాని బాలాజీ కార్యాలయం వెలవెలబోతోంది. -
‘యువగళం’ దెబ్బతో : ఎడమొహం.. పెడమొహం
ఉనికి కోల్పోతున్న టీడీపీకి జవసత్వాలు తెచ్చేందుకు ఆ పార్టీ నేత లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర అసలుకే మోసం తెస్తోంది. కదిరిలో ఉప్పునిప్పులా ఉన్న అత్తార్, కందికుంట మధ్య విభేదాలు ‘యువగళం’లో మరోసారి బయటపడ్డాయి. పాదయాత్రలో లోకేష్‌కు కుడి, ఎడమగా మెలుగుతున్న అత్తార్, కందికుంట బలనిరూపణకు సిద్ధమయ్యారు. పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండగా...ఎటువెళ్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: ‘యువగళం’ దెబ్బతో కదిరి నేతల తీరు మరోసారి బట్టబయలైంది. కదిరి టీడీపీ టికెట్ రేసులో ఉన్న అత్తార్, కందికుంట ‘చినబాబు’తో చేయికలిపి నడుస్తున్నా.. ఇద్దరి మధ్య స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోకేష్ యువగళం పాదయాత్రలో అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్ ఏకంగా బలనిరూపణకు సిద్ధమయ్యారు. నోరు విప్పని లోకేశ్.. ‘యువగళం’ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు సాగింది. ఆరంభం నుంచి అత్తార్, కందికుంట ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కదిరి పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉదయం కందికుంట ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అత్తార్ చాంద్ బాషా మధ్యాహ్నం మైనార్టీలతో మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే వేదికపై రెండు కార్యక్రమాలు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేసిన లోకేష్... ఏమీ చేయలేని పరిస్థితుల్లో రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. తమ్ముళ్లదీ తలోదారి.. అత్తార్, కందికుంట వర్గాలు కూడా ‘యువగళం’లో తమ నిరసన గళం వినిపించాయి. అత్తార్‌కు పేరురాకుండా ఉండేందుకు కందికుంట వర్గం ప్రయత్నిస్తుండగా...కందికుంటకు మైలేజీ రాకుండా అత్తార్ వర్గం చేయాల్సిందంతా చేసింది. అతుకులబొంత టీడీపీని ఇద్దరు నాయకులు చేరోవైపు లాగుతుంటే... తమ్ముళ్లు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన బీసీ, మైనార్టీ సభల్లో కనిపించేందుకు చాలా మంది జంకారు. కందికుంట ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మీయ సభలో కనిపిస్తే అత్తార్ అగ్గిమీద గుగ్గిలమవుతాడు. పోనీ అత్తార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ సభకు వెళ్దామంటే కందికుంటకు కోపమొస్తుంది. అందుకే తమ్ముళ్లంతా తలోదారి చూసుకున్నారు. లోలోన కత్తులు దూస్తూ పైకి మాత్రం కలిసి లోకేష్ వెంట నడుస్తున్న ఈ ఇద్దరు నేతల తీరుపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. -
టీడీపీకి అసమ్మతి సెగ: ఎన్నారై సంధ్య ఎంట్రీతో కళా వెంకట్రావు దెబ్బేనా?
గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల తేదేపా శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు తీరు మరోమారు స్థానిక నేతల ఆగ్రహానికి గురౌతోంది. ఇప్పటికే కళాను ఎరువు నేతగా భావించి దూరం పెడుతున్న సొంత పార్టీ నేతలు ఆయన తాజా చిన్నెలతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను కాదని గతంలో వివాదాస్పదమైన ఎన్నారై మహిళను పార్టీ అధినేత వద్దకు స్వయంగా తీసుకెళ్లి విజయనగరం జిల్లా కమిటీలో స్థానం కలి్పంచడం ఎచ్చెర్ల టీడీపీలో అసమ్మతి జ్వాలను ఎగదోసింది. కళాను వచ్చే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతీసి సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో మరో రచ్చ మొదలైంది. కొత్తగా పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ సంధ్య గజపతిరావు చౌదరి వ్యవహారం చిచ్చురేపింది. ఇంతవరకు నియోజకవర్గ టీడీపీ నేతలను నేరుగా చంద్రబాబును కలిపించే అవకాశం ఇవ్వని కిమిడి కళా వెంకటరావు ఇప్పుడుఏకంగా నిన్నగాక మొన్న పారీ్టలోకి వచ్చిన ఎన్ఆర్ఐతో మాట్లాడించడం ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. వివాదాస్పదమైన ఎన్ఆర్ఐను పార్టీలోకి తీసుకోవడమే తప్పని వ్యతిరేకించగా, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆమెను మరింత ప్రొత్సహించడం సుదీర్ఘకాలంగా టీడీపీలో పనిచేస్తున్న శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దూరమవుతున్న కేడర్.. 2019 ఎన్నికల తర్వాత కిమిడి కళా వెంకటరావు పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కళాను ఇప్పుడు గ్రామాల్లో పట్టించుకునే నాయకులే లేరు. పెద్దగా ప్రాధాన్యం లేని వ్యక్తులను వెంటబెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనికంతటికీ కళా అనుసరిస్తున్న తీరే కారణం. అధికారంలో ఉన్నంతసేపూ కేడర్‌ను పట్టించుకోలేదని, అధికారం పోయాక తన కొడుకు రామ్ మల్లిక్నాయుడిని తమపై రుద్దుతున్నారని నాయకులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కీలక నాయకులు కళాకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో తనే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూ, అధిష్టానం వద్ద తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరుతూ.. తనదైన రాజకీయం చేస్తున్నాడని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. ఎన్నాళ్లీ కళా పెత్తనమని గుర్రుగా ఉన్నారు. రణస్థలం మండలంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు, జి.సిగడాం మాజీ ఎంపీపీ బాల బొమ్మన వెంకటేశ్వరరావు, ఎచ్చెర్లలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్షి్మ, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, లావేరు మండలంలో అలపాన సూర్యనారాయణ, దామోదరావు తదితర కీలకనేతలంతా కళా వెంకటరావును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కళా పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. కొత్త గ్రూపుతో వివాదం.. ఎచ్చెర్ల మండలం టీడీపీ పెద్ద దిక్కు చౌదరి బాబ్జీ అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ఇప్పుడు ఆయనకే చెక్ పెట్టేలా ఆ గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ సంధ్య గజపతిరావు చౌదరిని పార్టీలోకి తీసుకొచ్చి మరో గ్రూపును తయారు చేశారు. ఇదే ఎన్ఆర్ఐ.. గతంలో చౌదరి బాబ్జీ కొడుకు ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారకురాలని అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. గ్రామంలో తాము నిర్మించిన ఆలయాన్ని ప్రారంభోత్సవం కానివ్వకుండా సంధ్య గజపతిరావు చౌదరి అడ్డుకుంటున్నారని, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చౌదరీ బాబ్జీ కొడుకు చౌదరి అవినాష్ పోలీసు స్టేషన్‌పై నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో సంధ్య గజపతిరావు చౌదరిపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ఇప్పుడు ఆమెను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా విజయనగరం జిల్లా తెలుగు మహిళ కమిటీలో చోటు కలి్పంచారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులను నేరుగా కలిసే అవకాశమివ్వని కళా వెంకటరావును ఈమెను నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలోకి వదిలారు. దీంతో పుండుపై కారం జల్లినట్టు... ఎన్ఆర్ఐ సంధ్య చంద్రబాబును కలవడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలేసి గ్రామంలో ఏ మాత్రం పట్టులేని సంధ్యను ప్రోత్సహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. చౌదరి బాబ్జీకి పోటీగా గ్రామంలో రాజకీయం చేయించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. దీనంతటికీ కారణమైన కళాను 2019 కన్నా దారుణంగా ఓడించేందుకు ఆ పార్టీ శ్రేణులు కంకణం కట్టుకుంటున్నారు. -
టీడీపీలో వర్గవిభేదాలు: ఆయనకు టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు అంటూ..
అనంతపురం (ఓడీ చెరువు): టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఓడీచెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో జేసీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని బలపర్చుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘టిక్కెట్టు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తాడిపత్రిలో నీకు టిక్కెట్టు వస్తుందో, లేదో చూసుకో. ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదం. నేను ఇప్పటికి ఆరు సార్లు బీ ఫారం తీసుకున్నా. ఏడోసారి కూడా తీసుకుంటా’నని అన్నారు. -
నన్నే టార్గెట్ చేస్తారా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నియోజకవర్గంలో గ్రూప్ మీటింగ్‌లు ఏంటి.. దీని వెనుక ఎవరున్నారు.. ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారో అన్నీ తెలుసు.. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసు.. కావాలని నన్నే టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఉరుకోను.. నేరుగా సీఎం చంద్రబాబునాయుడు వద్దే పంచాయితీ పెట్టి వీళ్లందరి వ్యవహారం చూస్తా’నంటూ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫోన్ చేసి సీరియస్ అయినట్లు సమాచారం. ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం పేరుతో అసమ్మతి గళం తారాస్థాయిలో వినిపించిన విషయం తెలిసిందే. సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు నామినేట్ పదవుల్లో ఉన్న పలువురు నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డిని టార్గెట్ చేస్తూ సమావేశం జరగడంపై రాజకీయంగా జిల్లాలో చర్చ జరిగింది. దీనిపై ఆదాల శిబిరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో పార్టీ ముఖ్యనేతల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. మంత్రి సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే కిలారి సమావేశం నిర్వహించారని రగిలిపోతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఆయనకు గుర్తురాని పార్టీ ఇప్పుడే ఎందుకు గుర్తువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కిలారి బంధువులకు కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వకపోవడంతోనే ఇదంతా చేశాడని ఆదాల శిబిరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే 2000లో పార్టీలోకి వచ్చిన వాళ్లకి పార్టీ బాగా ఉపయోగపడుతోందని, పదవులన్నీ వారికే ఇస్తున్నారని, వారు పార్టీ కోసం చేసింది తక్కువేనని విమర్శిస్తున్నారు. మంత్రులు సైతం ఇలాంటి వారినే ప్రోత్సహిస్తున్నారని, వారి సహకారంతోనే కులరాజకీయాలను సైతం సాగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అన్నింటికీ ఆయన్నే అడగాలంటే ఎలా? కనీసం వీఆర్ఓ బదిలీ కూడా చేయించుకోలేని పరిస్థితి.. అన్నింటికీ పట్టాభి చెప్పాలంటే ఇక మనం ఏం చేయాలి.. కానీ మమ్మల్నే టార్గెట్ చేసి పనులు, బదిలీలు, ఇళ్ల స్థలాలు అన్నీ చేసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. దీనిపై సీఎంతో మాట్లాడి ఎవరెవరు ఏంచేశారో అన్నీ ఆధారాలతో సహా అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సమావేశం నిర్వహించిన కిలారి వెంకటస్వామినాయుడుతోపాటు అందరిపై చర్యలు తీసుకోవాలని, రెండు మూడు రోజుల్లోనే దీనిపై తేల్చుకుంటామని అనుచరులకు ఆదాల చెప్పినట్లు తెలిసింది. -
నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వరకు ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. మా పరిస్థితేంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీలో అంతర్గత పోరు
తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ సీటు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు విభేదాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కాళ్ల జెడ్పీటీసీ పార్టీకి రాజీనామా చేశారు. నెల క్రితం పెరవలి జెడ్పీటీసీ కూడా పార్టీని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మధ్య వివాదం నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలోని ఆగర్రులో శనివారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ అంగరతోపాటు జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అన్న క్యాంటిన్ వద్ద జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే రామానాయుడు చేస్తున్న అవినీతి అక్రమాలపై అంగర రామమోహన్ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వలేదని వారిపై కేసులు నమోదు చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించిన వైనంపై కూడా ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ ఏ కాంట్రాక్టర్ వద్ద ఎంతెంత వసూలు చేశారన్న విషయాన్ని కూడా అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పెట్టినట్లు సమాచారం. కాళ్ల జెడ్పీటీసీ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారతారనే అనుమానంతో పాత కేసులు బయటకు తీసి జెడ్పీటీసీ భర్తను నల్లజర్ల పోలీసులు అరెస్టు చేయడం, జెడ్పీటీసీ అక్కడ ధర్నా చేయడం తెలిసిందే. తన భర్త అక్రమ అరెస్టు వెనుక జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు ఉన్నారని ఆరోపిస్తు కాళ్ల జెడ్పీటీసీ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్ పర్యటన సమయంలో పెరవలి జెడ్పీటీసీ తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. నియోజకవర్గాల్లో కూడా గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలనే విషయంపై దృష్టి పెట్టి పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వాల నమోదును కూడా పక్కన పెట్టేశారు. జిల్లాలో ఎనిమిది లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 2లక్షలు మాత్రమే అయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతుంది. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, భీమవరం ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు. చింతలపూడి ఏఎంసీ వ్యవహారంలో తమను పక్కన పెట్టి ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడంపై ఎమ్మెల్యే పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి చింతమనేని దూరంగా ఉన్నట్లు తెలిసింది. అక్రమార్కులకు అండగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి చోటా ఎమ్మెల్యేలు, వారి అనుచరులే ఈ ఇసుక దందాలో ప్రత్యక్షంగా ఉంటున్నారు. వీటిపై అడపాదడపా విజిలెన్స్ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు మళ్లీ వెనక్కి ఇచ్చేయాలని సమన్వయ కమిటీలో నిర్ణయించారు. పోలీసులు సీజ్ చేసిన ట్రాక్టర్లన్నీ అధికార పక్షానికి చెందిన వారివే కావడంతో ట్రాక్టర్లు యజమానుల్లో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ వారు ఉన్నారన్న సాకు చూపించి వాటిని యజమానులకు అప్పగించడానికి తీర్మానించారు. -
పిలిచి అవమానిస్తారా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హర్ట్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి రమ్మని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వచ్చేశారు. వెంట నే మంత్రి నారాయణ ఆదాల ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. ఈ ఘటన అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం నగరంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇరుగాళమ్మ గుడి వద్ద నిర్వహించారు. నుడా నిధులతో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నాథ్రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణతోపాటు పార్టీ నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, పార్టీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకంలో ఇన్చార్జి హోదాలో ఉన్న ఆదాల పేరు లేకపోవడం.. ఆనంతరం నిర్వహించిన సభలో వేదిక పైకి ఆదాలను ఆలస్యంగా పిలవడంపై ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఆదాల వేదికపైకి వెళ్లకుండానే తిరిగి ఇంటికి వచ్చేశారు. పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో మంత్రి నారాయణ సమావేశం పూర్తికాగానే నేరుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. ఇద్దరు ఏకాంతంగా గంటకు పైగా సమావేశమయ్యారు. కాసేపటికి కురుగొండ్ల రామకృష్ణ వచ్చి ఆదాలతో మంతనాలు నిర్వహించారు. మొత్తం మీద ఆదాల ఆగ్రహించిన వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి తీరుపై ఆదాల మంత్రి నారాయణ వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు మంత్రి ఎదుట వాపోయారు. నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం నెల్లూరు రూరల్ వావిలేటిపాడు, మాధరాజుగూడురు వద్ద నేలూటూరు పునరావసా కాలనీ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 12న జరిగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాజీ మంత్రి ఆదాల నివాసానికి వచ్చి ఇరువురు మాట్లాడుకొని మరీ వెళ్లి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నేలటూరు పునరావాస కాలనీ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వేయలేదు. అది నెల్లూరు రూరల్ పరిధిలో జరగటం మాజీ మంత్రి ఆదాల తన పేరు వేయించలేదనే భావనతో నుడా చైర్మన్ ఆదాల పేరును శిలాఫలకంలో వేయకుండా, వేదికపైకి ఆలస్యం పిలిచేలా చేశారని ఇదంతా నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం అని ప్రచారం సాగుతోంది. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయనగరం : టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ బంజ్దేవ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సాలూరులో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని సంధ్యారాణి అలకబూనారు. బంజ్‌దేవ్ కావాలనే తన వర్గం వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. కాగా సంద్యారాణిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. బంజ్‌దేవ్‌తో పాటు సంధ్యారాణి ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంధ్యారాణి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం గమనార్హం. -
మీరు చెబితే సీఎం మాట వింటారు..
ఆత్మకూరు అధికార పార్టీలో మరోసారి చిచ్చురేగింది. అసంతృప్తి నేత కన్నబాబు మరోసారి పార్టీ నేతల తీరుపై ఓ ప్రైవేట్ పంక్షన్ వేదికగా విమర్శలు గుప్పించారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో మరోసారి ఆత్మకూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ సీఎంఓకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం మరింత ముదిరింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నబాబు అవకాశం దొరికినప్పుడుల్లా పార్టీ వేదికలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో టీడీపీ నేత కుమార్తె వివాహ వేడుకలకు కన్నబాబు హాజరయ్యారు. అదే వివాçహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య హాజరయ్యారు. వీరిరువురు ఎదురుపడిన క్రమంలో కన్నబాబు కృష్ణయ్య ఎదుట తన ఆక్రోశం వెళ్లగక్కారు. తనకు సహకరించాలని బొల్లినేని కృష్ణయ్య కన్నబాబును కోరగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వ్యవహర శైలిపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తాత్కాలిక ఇన్చార్జిగా ఉండి ఆయన పెత్తనం కొనసాగితే చివరికి నా మాదిరిగానే మీరు అవుతారు’ అని బొల్లినేని ఎదుట కన్నబాబు పేర్కొన్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గ నేతలు పెత్తనం చేస్తే క్యాడర్ ఇబ్బంది పడుతుందని కన్నబాబు మాట్లాడగా రెడ్డి సామాజికవర్గ నేతను సీఎం ఇక్కడ ఇన్చార్జిగా నియమిస్తే ఆయన్ను తొలగించాలని చెప్పడానికి నేను ఎవర్ని.. ఇది కరెక్ట్ కాదు.. అందరం కలసి సీఎం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలే తప్ప తీసివేయమని చెప్పే అధికారం తనకు లేదన్నారు. మీరు చెబితే సీఎం మాట వింటారు మీరే మాట్లాడాలని మీరే దీనికి సరైన వ్యక్తి అని కన్నబాబు పేర్కొన్నారు. నేను ఎలా చెబుతానని, నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు నేను ఏం చేస్తాను ఇది కరెక్ట్ కాదని బొల్లినేని కృష్ణయ్య బుదలిచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తొలుత ప్రత్యేకంగా గదిలో సమావేశమై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కన్నబాబు వ్యవహారంపై ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్టీ సీఎంఓకు కన్నబాబు వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్చార్జి నుంచి తప్పించిన తర్వాత కన్నబాబు 2014 ఎన్నికల్లో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో తర్వాత ఇన్చార్జిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీలోకి మాజీ మంత్రి ఆనం చేరిన క్రమంలో ఆయన్ను ఇన్చార్జిగా నియమించి కన్నబాబును తప్పించారు. తదనంతరం మారిన సమీకరణాలలో కన్నబాబు ఇన్చార్జి పదవిని ఆశించారు. అయితే టీడీపీ అధిష్టానం తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. దీంతో కన్నబాబు పార్టీని కాపాడండి అంటూ నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు దిగారు. తదనంతరం పార్టీ నేతలు దీక్ష విరమింపజేశారు. తర్వాత కన్నబాబును పట్టించుకోలేదు. దీనికి అనుగుణంగా మాజీ మంత్రి ఆదాల బొల్లినేని కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. రెండు పర్యాయాలు సీఎంను కలిసిన తర్వాత ఆయన పార్టీలో అధికారికంగా చేరకుండా పార్టీ సభ్యత్వం తీసుకోకుండా కార్యక్రమాల్లో పాల్గొనటం, అన్ని మండలాల్లో శ్రేణుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలో సహజంగానే అసంతృప్తి నేతగా ఉన్న కన్నబాబు వెళ్లగక్కిన ఆక్రోశం వెలుగులోకి రావటంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర దీనిపై దృష్టి సారించి జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆదాలతో బీద సమావేశమయ్యారు. -
పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ముఠా పోరు తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమ ప్రకాశంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇప్పుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టార్గెట్‌గా మారారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ ప్రకాశంలోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను మారిస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేస్తానని ఎమ్మెల్సీ మాగుంట ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, కొండపి తదితర నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని మాగుంట సూచించినట్లు సమాచారం. అలా అయితేనే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వగలమని మాగుంట అధినేతకు వివరించినట్లు తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా ఇప్పటికిప్పుడు అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టాలని కూడా మాగుంట ఒత్తిడి పెంచినట్లు ప్రచారం సాగింది. ఇందుకు ముఖ్యమంత్రి సైతం అంగీకరించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీని ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు సైతం అధికార పార్టీ నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి మాగుంట మినహా అభ్యర్థి కనిపించలేదు. మాగుంటను ఒప్పించి ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలనేది సీఎం నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే అదునుగా ఎమ్మెల్సీ మాగుంట తన సొంత ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం మాగుంట ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసే అవకాశం అధికంగా ఉంది. మాగుంటపై సిట్టింగ్‌ల గరం..గరం మాగుంట ప్రతిపాదన పశ్చిమ ప్రకాశం పరిధిలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మింగుడు పడడం లేదు. వారంతా ఆయనపై గరం..గరంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాగుంటతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మాగుంట ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పే పక్షంలో అందుకు వ్యతిరేకంగా పనిచేయాలని సిట్టింగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాగుంట ప్రతిపాదనలు అధిష్టానం వద్ద తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మరి కొందరు నేతలు మాగుంట ప్రతిపాదనలపై మండిపడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన టీడీపీ అభివృద్ధి కోసం పనిచేయాలేదన్నది పలువురు అధికార పార్టీ ముఖ్యనేతల వాదన. మాగుంట ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుందని ఓ ఎమ్మెల్యే మాగుంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మాగుంట సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వాన్ని వాడుకున్నారని, తద్వారా వేల కోట్లలో లబ్ధి పొందారని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన వ్యక్తి లేకపోవడంతో ముఖ్యమంత్రి మాగుంటను బుజ్జగిస్తున్నారని, అదే అవకాశంగా మాగుంట సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే మాగుంటకు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు చేపట్టిందని, దీని వల్ల మాగుంటకు వందల కోట్లలో లాభం చేకూరిందని వారు పేర్కొంటున్నారు. దీంతో పాటు మాగుంట సంస్థలకు సంబంధించిన విలువైన భూములను ప్రభుత్వం ద్వారా పొందినట్లు కూడా అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఎమ్మెల్సీ ప్రొటోకాల్ ఇచ్చినా మాగుంట క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను ముందుకు నడిపించలేదని, పాత క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లే టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి వెళ్లి పోయారని, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అనంతరం మౌనం దాల్చకుండా మాగుంట మొదటి నుంచి క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచి ఉంటే పశ్చిమ ప్రకాశంలోనూ టీడీపీ కొంతమేర నిలదొక్కుకుని ఉండేదని సదరు నేత విశ్లేషించారు. క్యాడర్‌ను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాగుంట సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతను ఇచ్చారన్నది పలువురు అధికార పార్టీ నేతల వాదన. ఈనెల 15న సీఎం రివ్యూ : ఈనెల 15న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే రోజు సాయంత్రం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల పై స్థానిక ఏ1 కన్వెన్షన్ సెంటర్లో రివ్యూ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మాగుంట ప్రతిపాదనలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే మాగుంట ప్రతిపాదనలకు అధికార పార్టీ సిట్టింగ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. -
కళా దూకుడుకు కళ్లెం!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఒక దెబ్బకు రెండు పిట్టలు... అన్నట్లు ఒకేసారి రెండు ప్రయోజనాలు ఆశించి టీడీపీలో ఒక వర్గం చేసిన ‘పోస్టర్లు’ యుద్ధం కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళావెంకటరావు దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఒక ఎత్తు అయితే, ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీ నాయకులపై నెట్టేసి టీడీపీ పట్ల సానుకూల వైఖరి కలిగించాలనేదీ మరో ఎత్తు! ఈ పోస్టర్లు అంటించినవారెవ్వరైనా సరే చర్యలు తీసుకోవాలంటూ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులిచ్చి హడావుడి చేసిందీ టీడీపీ నాయకులే! సీసీ కెమెరాల ఫుటేజీ పుణ్యమాని అసలు విషయం బట్టబయలైంది! అనుమానితులను అదుపులోకి తీసుకున్నా కేసు నమోదుకు తర్జనభర్జన పడటం ఇప్పుడు పోలీసుల వంతు అయ్యింది! ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలను ప్రోత్సహిస్తూ ఇటీవల కాలంలో మంత్రి కిమిడి కళావెంకటరావు కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. తద్వారా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ, తన సొంతూరున్న రాజాం నియోజకవర్గంలోనూ పట్టు సాధించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది సహజంగానే సొంతపార్టీలోని ప్రత్యర్థులకు గుబులురేపింది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ను పార్టీలోకి తీసుకురావడమే గాక ఏకంగా రాజాం నియోజకవర్గ ఇన్చార్జిగా చేయడంలో కళా పాత్ర ఉందని ప్రతిభాభారతి లోలోన రగిలిపోతున్నారు. అమరావతిలో అధినేత చంద్రబాబు ముందు మాత్రం ‘తమ్ముడు (కొండ్రు)తో కలిసి పనిచేసుకుంటాం’ అని ఆమె చెప్పినప్పటికీ నియోజకవర్గంలో ఆమె పట్టు పూర్తిగా తగ్గిపోతోంది. ఇప్పటికే రాజాంలో కళా వర్గం ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న ఆమె మంత్రి అచ్చెన్న గ్రూపులోకి చేరిపోయారు. కింజరాపు కుటుంబంతో కళా వైరం సుదీర్ఘకాలంగా ఉన్నదే. జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఆమె భర్త టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వర్గం ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళాకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయంలో గతంలో పలుమార్లు రుజువైంది. ఇటీవల పొన్నాడ పంచాయతీ పరిధిలోని ముద్దాడపేట ఇసుక ర్యాంపు రద్దు అవడానికీ కళాయే కారణమని బాబ్జీ వర్గం గట్టిగా నమ్ముతోంది. మంత్రి అచ్చెన్న మద్దతుతో ర్యాంపు అనుమతులు తెచ్చుకుంటే జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రద్దు చేయించారనే మిసతో అప్పటి నుంచీ కళాపై కారాలుమిరియాలు నూరుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే పోరు... కళావెంకటరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నూ ఉన్నారు. ఆయనే లక్ష్యంగా పోస్టర్లు వెలవడం, వాటి వెనుక సొంత పార్టీలోనే కొంతమంది ప్రోత్సాహం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘స్థానిక నాయకత్వం ముద్దు... వలస నాయకత్వం వద్దు’ అనే నినాదాలతో ముద్రించిన పోస్టర్లు ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గంలో వెలిశాయి. ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి రణస్థలం మండలంలోని కోష్ట, పతివాడిపాలెం, పైడిభీమవరంతో పాటు లావేరు మండలంలోనూ ఇవి గోడలపై కనిపించాయి. వాటితో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. దీంతో ఆ పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎచ్చెర్ల, రణస్థలం పోలీసు స్టేషన్లలో ఎచ్చెర్ల ఎంపీపీ బీవీ రమణారెడ్డి, రణస్థలం ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవ్వరో తెలుసుకోవడానికి కళా వర్గం కూడా క్షేత్రస్థాయిలో ఆరాతీసింది. ఈ వ్యవహారంలో చౌదరి బాబ్జీ అనుచరుల పాత్ర ఉండే ఉంటుందనే సందేహాలు వచ్చాయి. అయితే ఈ నెపాన్ని ప్రత్యర్థి పార్టీలోని నాయకులపై నెట్టేసేందుకు టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాన్నీ ప్రారంభించారు. కానీ ఆ పప్పులు ఉడకలేదు. తమ్మినేని సంతోష్ పాత్ర... ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు బంధువునంటూ తమ్మినేని సంతోష్ అనే వ్యక్తి జిల్లాలోని పలు ఇసుక ర్యాంపులను కొల్లగొడుతున్న సంగతి బహిరంగ రహస్యమే. గుంటూరు మాఫియాతో కలిసి దూసి ర్యాంపులో సుదీర్ఘకాలం ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఇతనిదే కీలక పాత్ర! ఇటీవల వంశధార నదిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన 25 లారీలు, నాలుగు జేసీబీలు అడ్డంగా దొరికిపోయిన వ్యవహారంలోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. నిఘా వర్గాల విచారణలోనూ ఇది రుజువైనట్లు తెలిసింది. అయితే 6వ తేదీన పోస్టర్లు అంటింపు బాధ్యతను సంతోషే తన భుజాలపై వేసుకున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిలకపాలెం టోల్గేట్తో పాటు జాతీయ రహదారిపైనున్న సీసీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దాని ఆధారంగా శ్రీకాకుళానికి చెందిన కొంతమంది యువకులను ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని విచారిస్తే సంతోష్ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అవినాష్‌తో స్నేహసంబంధాలు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్, తోటపాలెం ఎంపీటీసీ సభ్యుడు గురు జగపతిబాబులకు తమ్మినేని సంతోష్ స్నేహితుడు. ఈ స్నేహంతోనే అవినాష్, సంతోష్ ఇద్దరూ కలిసి గతంలో దూసి ఆర్ఎస్ వద్ద ర్యాంపు నిర్వహణకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ‘సాక్షి’ కథనాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం నిరసనలతో అధికారులు ఆఖరి నిమిషంలో ఆ ర్యాంపును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్నేహంతోనే సంతోష్ ఈ పోస్టర్ల అంటింపు బాధ్యత అప్పగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సంతోష్ పరారీలోనే ఉన్నాడు. కేవలం పోస్టర్లు అతికించిన కుర్రాళ్లను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అవినాష్, సంతోష్ పేర్లను ఏవిధంగా ఇరికిస్తారంటూ బాబ్జీ వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై జేఆర్ పురం (రణస్థలం) సీఐ వి.రామకృష్ణను సంప్రదించగా... ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇంతవరకూ నిందితులు ఎవ్వరనేదీ నిర్ధారించలేదన్నారు. ఏదిఏమైనా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నున్న కళావెంకటరావుకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించడం, దీనివెనుక సొంత పార్టీ వారి హస్తం ఉండటం చర్చనీయాంశమైంది. -
నేతల మధ్య టీ'ఢీ'పీ
టీడీపీలో వర్గ పోరు రాజుకుంటోంది. పరస్పరం ప్రతికూల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రచారాలతో స్వపక్షంలోని ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆశావహులు ఇందులో కీలక భూమిక పోషిస్తూ ఒకరికొకరు పొగబెట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎవరికి వారు లైన్ క్లియర్ కోసం ప్రయత్నిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, పీలేరు నియోజకవర్గంలోని అ«ధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి..మదనపల్లె..పీలేరు నియోజక వర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అడ్డురాకుండా పన్నాగాలు వేసుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఈ వాదనను ఖండించారు. తిరుపతిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమెను వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ రాకుండా నగరానికి చెందిన కొందరు ముఖ్యులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్య కార్యక్రమాలకు తనకు ఆహ్వానం పంపటం లేదని సుగుణమ్మ ఇప్పటికే పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు. ఇలా పంపకపోవడం వెనుక ఆమె ప్రత్యర్థుల హస్తముం దని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. మహా సంప్రోక్షణ సమయంలోనూ, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈమెకు ఆహ్వానం రాలేదు. ప్రొటోకాల్ పాటించకపోవటంపై ఎమ్మెల్యే అసంతప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలోను ఎమ్మెల్యే హాజరుకాలేదు. ఆహ్వానం కూడా లేదని తెలి సింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వర్గీయులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సర్దుకుపోవాలని సుగుణమ్మకు సీఎం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. తిరుపతిలోనూ తుడా చైర్మన్ నరసింహయాదవ్ ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా ఆహ్వానం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని భోగట్టా. ఈ విషయాలు ముఖ్యమంత్రికి తెలిసినా పెద్దగా స్పందించలేదని సుగుణమ్మ శిబిరం భావిస్తోంది. అధికారులు, నేతలను పిలిచి మందలించాల్సింది పోయి ‘సర్దుకోపోండి’ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో సుగుణమ్మను దూరం పెట్టాలని కొందరు టీడీపీ నేతలు ఈ రకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. కిషోర్ వర్సెస్ ఇక్బాల్ పీలేరులో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక్బాల్ అహ్మద్ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలోనే ఇక్బాల్‌కు చంద్రబాబు మాట ఇచ్చారు. గెలిస్తే మంత్రి పదవి... ఓడితే నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్బాల్ ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తారని ఆయన ఆశగా ఎదురుచూశారు. పదవి రాకపోగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచా రం జరుగుతోంది. కిషోర్ కూడా తానే అభ్యర్థినని పలుమార్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో ఇక్బాల్ మంచిపేరు సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అవుతారని ఇక్బాల్‌ను కిషోర్ దూరం పెడుతున్నారని తెలిసింది. ∙పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. పైగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు ఇక్బాల్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. నరేష్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే కుట్ర మదనపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డికి పార్టీలో అడుగడుగునా భంగపాటు తప్పటం లేదు. వాల్మీకిపురం మండలం గండబోయనపల్లెకు చెందిన ఆయన కాంగ్రెస్ సానుభూతిపరుడిగా పనిచేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధం నరేష్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించింది. వైఎస్సార్ హయాం లో మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు సీటీఎం స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. తరువాత కోర్టుకెక్కి అనూహ్యరీతిలో ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. అధికారంలో ఉన్న టీడీపీలో చేరితే నియోజకవర్గ అభివృద్ధి, తన ఉన్నతికి బాటలేసుకోవచ్చునని టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో నరేష్‌కుమార్‌రెడ్డి చేరడం సహించలేని టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. కలెక్టర్ ప్రద్యుమ్న, నరేష్‌కుమార్‌రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలను తెరపైకి తెచ్చారు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆయనను దెబ్బతీసేందుకు సిద్ధపడ్డారు. సొంత పార్టీకే చెందిన కొందరు కుట్ర పన్నుతుండటంపై నరేష్ అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా పార్టీలో చేరిన నరేష్‌కుమార్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇన్చార్జ్గా ప్రకటించకపోవడంపై ఆయన అనుచరవర్గం పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మాచర్ల టీడీపీలో బయటపడ్డ వర్గపోరు
మాచర్ల: స్థానిక పురపాలక సంఘం చైర్ పర్సన్‌గా 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ ఎంపికయ్యారు. గత రెండు నెలల కిందట అప్పటి పురపాలక సంఘ చైర్‌పర్సన్‌గా నెల్లూరు మంగమ్మ ఒప్పందం ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక చైర్ పర్సన్‌గా షాకీరూన్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి గురజాల ఆర్డీఓ పురపాలక సంఘ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన 13 మంది, ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హాజరై కోరమయ్యే విధంగా చూశారు. ఎన్నికల అధికారి పుల్లయ్య చైర్పర్సన్ ఎంపికకు సంబంధించి ప్రకటన విడుదల చేయగానే 10వ వార్డుకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ వేముల వెంకట కల్యాణి, 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ పేరును ప్రతిపాదించారు. 18వ వార్డుకు చెందిన మాచర్ల రాజ్యలక్ష్మి, 6వ వార్డుకు చెందిన కొమ్ము సంతోష్‌కుమార్‌లు బలపరిచారు. రెండు వర్గాలుగా చీలిక మొత్తం 29 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా 15 మంది హాజరై షాకీరూన్ను ఎంపిక చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ ఎన్నికల అధికారి ఆర్డీఓ పుల్లయ్య చైర్‌పర్సన్‌కు పత్రాలను అందజేశారు. నూతనంగా ఎంపికైన చైర్పర్సన్ షేక్ షాకీరూన్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీకి 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, వారి మద్దతుతో ఒక సీపీఐ కౌన్సిలర్ గెలవగా మొత్తం 21 మంది బలం ఉంది. అయితే కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గత నాలుగు రోజులుగా రెండు వర్గాలు పోటా పోటీగా మంతనాలు జరిపాయి. కౌన్సిలర్లను ఆకట్టుకోగా దాదాపుగా చైర్పర్సన్ ఎంపికకు కోరం ఉండదని ప్రచారం జరిగింది. అయినా ఏడుగురు టీడీపీ కౌన్సిలర్లు ఎంపికకు దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతు పలుకుతుండటంతో 4, 13వ వార్డుకు చెందిన ప్రతి పక్ష కౌన్సిలర్ల మద్దతుతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచే పురపాలక సంఘ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో రెండు రోజులుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందుబాటులో ఉన్న నాయకులను సాగర్‌కు తరలించి క్యాంపు నిర్వహించారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్లను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి ఎన్నికలు జరిగే వరకు పర్యవేక్షిస్తారని టెన్షన్ పడ్డారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు
సాక్షి, తిరుపతి : శీకాళహస్తి టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపలేదంటూ పార్టీ సీనియర్ నేత మోహన్ ఆందోళన చేపట్టారు. అనుచరులతో కలిసి ప్రారంభోత్సవానికి వచ్చిన బొజ్జల వాహనాన్ని అడ్డుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆందోళన మధ్యే ఎమ్మెల్యే బొజ్జల అన్నా క్యాంటీన్ ప్రారంభించి వెళ్లిపోయారు. -
ఎంపీ రమేష్ వర్సెస్ వరద
ప్రొద్దుటూరు టౌన్ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. శనివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ రమేష్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాన్ని అడ్డుకుని తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి, ఆయన వరీ ్గయులు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. మున్సిపల్ కార్యాలయానికి వస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని పసిగట్టిన పోలీసులు జమ్మలమడుగు, మైదుకూరు డీఎస్పీలతో పాటు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు పట్ట ణంలో పలు ప్రాంతాల్లో పోలీసులను ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి లేకుం డా ఆయన చాంబర్లో కూర్చొని ఎంపీ రమేష్ అధికారులతో ఏవిధంగా సమీక్ష నిర్వహిస్తారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే పోలీసులు తమను అడ్డుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి సహకరించడంపై వరద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఎంపీ రమేష్ పోటుగాడా అంటూ వరద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. నడిరోడ్డుపై తోపులాట పోలీసులను తోసివేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులను పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించి ఆపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డిని టూటౌ న్ ఎస్ఐ, పోలీసు సిబ్బంది లాక్కెళ్లి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వరదరాజులరెడ్డిని రూరల్ సీఐ ఓబులేసు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లినా ఆయన అక్కడ ఉండకుండా బయటికి వచ్చారు. రోడ్డుపై ధర్నాతో స్తంభించిన ట్రాఫిక్ వరదరాజులరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘురామి రెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా రోడ్డుపై కూర్చొని దాదాపు గంటన్నరకుపైగా ధర్నా చేశారు. ఎంపీ రమేష్‌తోపాటు పోలీçసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగసారాయి అమ్ముకుంటున్న రమేష్‌నాయుడు రూ.కోట్లు వెదజల్లి మున్సిపల్ కౌన్సిలర్లను తన వైపునకు తిప్పుకున్నారని ఆరోపించారు. ఇక అతని ఆటలు సాగనివ్వమని తేల్చి చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ రమేష్, ఆయన వర్గీయులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేందుకు బయల్దేరారు. గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, డీఎస్పీ, పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనివ్వమన్నారు. నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయానికి వరదరాజులరెడ్డిని పంపించారు. ఇక్కడ అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వరద వర్గీయులకు తోపులాట జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద నాలుగు రోడ్లను పోలీ సులు దిగ్బంధనం చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా పాత బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీ సులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కొర్రపాడు రోడ్డు మీదుగా వచ్చే బస్సులు వాహనాలను దారి మళ్లిం చారు. రాజీవ్ సర్కిల్లో ఆర్అండ్బీ కార్యాలయం రోడ్డును దిగ్బంధనం చేశారు. రోడ్డుకు అడ్డుగా తోపుడు బండ్లను పెట్టి ఎవరిని అనుమతించలేదు. కళాశాలలు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్రఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
తాడికొండ: స్థానిక తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అవినీతి భారీగా చేసి జేబులు నింపుకున్నారంటూ మహిళా ఎంపీపీ విలేఖరుల సాక్షిగా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు ఔరా అనిపిస్తున్నాయి. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఎంపీపీ రిజ్వానా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తాడికొండ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, అవినీతి దందాలో గ్రామ నాయకుడు యెడ్డూరి హనుమంతరావుకు భారీగా ముడుపులు అందుతున్నాయని, సర్పంచ్‌ను అడ్డు పెట్టి దోచుకుంటున్నారని గ్రామ పార్టీ అధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు వ్యాఖ్యానించాడని, ఆ వ్యాఖ్యలకు ప్రత్యక్ష సాక్షిని తానేనని గ్రామ ఉప సర్పంచ్ ఉమ్మనేని రామ్మెహనరావు అన్నారు. ఎంపీపీ రిజ్వానా మాట్లాడుతూ దోపిడీదారులే అవినీతి గురించి మాట్లాడడం డ్రామా కంపెనీ నడిపినట్లు ఉందన్నారు. ముస్లిం శ్మశాన వాటిక వివాదంలో తన పాత్ర ఉందని తప్పుడు వ్యాఖ్యలు చేశారని, నిరూపిస్తే ఏ సవాల్‌కైనా సిద్ధమేనని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బండ్ల కోటేశ్వరరావు అన్నారు. అవినీతికి అడ్డుపడుతున్నామనే ఈ వ్యాఖ్యలకు దిగారన్నారు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో అక్రమంగా రూ.6 లక్షలు వసూలు చేశారని, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఉన్నతాధికారులు బిల్లులు నిలిపేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో అక్రమంగా మట్టిని తవ్వి సర్పంచ్‌తోపాటు షాడో సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న యెడ్డూరి హనుమంతరావు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీసీ సెల్ నాయకుడిని ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేయకుండా అడ్డుకొని ఆవేదనకు గురి చేశారని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బండ్ల కోటేశ్వరరావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పందేటి వెంకటేశ్వర్లు, భూస్మాన్ గోపి, ఉండవల్లి రాజేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆమంచి వర్సెస్ దామచర్ల
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల చీరాల టీడీపీ నేతలు పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలకు మద్దతు పలుకుతూ ఆమంచికి సెగ పెడుతున్నారని, దీంతో జనార్దన్‌పై ఆమంచి అక్కసుతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మంగళవారం మంత్రి లోకేష్ చీరాల పర్యటన సందర్భంగా వేసిన ప్రకటనలు, ప్లెక్సీల్లో ఆమంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం లోకేష్ పర్యటన కార్యక్రమంలో వీరిద్దరి తీరు చూసిన అధికార పార్టీ నేతల నుంచి సైతం వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం నిజమేననే సమాధానం వస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళవారం చీరాలలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆమంచి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. పైపెచ్చు చీరాలలో వేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫొటోలు ఒకటి, రెంటిల్లో మినహా 95 శాతం వాటిలో లేవు. టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ ఫొటోలు వేసిన ఆమంచి జనార్దన్‌ను మాత్రం విస్మరించడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి విబేధాలు ఎన్ని ఉన్నా మంత్రి పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయడం ఆనవాయితీ. కానీ జనార్దన్‌పై అక్కసుతో ఉన్న ఆమంచి నిర్మొహమాటంగా ఆయన ఫొటో వేయలేదు. అధికార పార్టీ నేతల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమంచి చర్యతో దామచర్ల వ్యతిరేక వర్గం సంబర పడగా.. అనుకూల వర్గంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. జనార్దన్ మాత్రం యథావిధి చీరాలలో మంత్రి లోకేష్ పర్యటనకు హాజరయ్యారు. దామచర్ల తీరుపై ఆమంచి ఫిర్యాదు.. ఆమంచి, దామచర్ల మధ్య చాలా కాలంగా విబేధాలున్నట్లు ప్రచారం ఉంది. ఆది నుంచి దామచర్ల చీరాల టీడీపీ నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీతలను ప్రోత్సహించేవారు. ఆమంచి అధికార పార్టీలో చేరిన తరువాత కూడా దామచర్ల అటు పాలేటిని ఇటు పోతుల సునీతను ప్రోత్సహిస్తూనే ఉన్నారని, జనార్దన్ మద్దతుతోనే వారు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ఆమంచి ఆరోపణ. ప్రతి సమావేశానికి పోతుల సునీత, పాలేటిలను పిలిచి వేదికలపై మాట్లడించడాన్ని ఆమంచి జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. జనార్దన్ వ్యవహార శైలిపై ఆమంచి పలుమార్లు సీఎంతో పాటు ఇటు లోకేష్, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్, మంత్రి పరిటాల సునీతకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో పార్టీకి దూరమౌతానని కూడా ఆమంచి హెచ్చరించినట్లు సమాచారం. పరస్పర ఫిర్యాదులతో ఇద్దరి మధ్య విబేధాలు పెరిగినట్లు సమాచారం. జిల్లా మహానాడులోనూ ఇదే తీరు.. ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లా మహానాడులోనూ జనార్దన్ ఆమంచిని సరిగా రిసీవ్ చేసుకోలేదు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆమంచితో పాటు సభకు వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మాత్రమే వేదిక మీదకు పిలిచి ఆమంచిని పట్టించుకోలేదు. ఆ తరువాత వేదిక మీదకు వచ్చిన ఆమంచికి మొదటి వరుసలో సీటు కూడా ఇవ్వక పోవడంతో ఆయన వెనుక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని భరించలేని ఆమంచి ఆ కొద్దిసేపు ముళ్లమీద కూర్చున్నట్లైంది. ఆ తరువాత కొందరు విషయం జనార్దన్ దృష్టికి తీసుకెల్లగా ఆతరువాత ఆయనవచ్చి ఆమంచిని మొదటి వనుసలో కూర్చోబెట్టారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా అటు ఆమంచి ఇటు దామచర్ల గొడవలు అధికార పార్టీలో పతాక స్థాయికి చేరాయి. పర్యవసానంగా సాక్షాత్తూ మంత్రి లోకేష్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనార్దన్‌కు ప్రాధాన్యత ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది.