సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం టీడీపీలో కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి విషయంలో అధిష్టానంతో తేల్చుకోవాలని ఒక వర్గం నాయకులు డిసైడ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న జరగనున్న చంద్రబాబు పర్యటనకు ముందే నిర్ణయం తీసుకోవాలని ఏకంగా అలి్టమేటం జారీ చేశారు. కలమట వెంకటరమణనే కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బాహాటంగానే హెచ్చరించారు.
ఇప్పుడున్న ఇన్‌చార్జి కలమట వెంకటరమణను ఎట్టి పరిస్థితుల్లో సమరి్థంచబోమని మెజార్టీ టీడీపీ నాయకులు తేలి్చచెప్పేశారు. ఆయన్ని తీసేసి మామిడి గోవిందరావుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కలమటపై విశ్వాసం లేదని, ఆయనతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. బుధవారం మామిడి గోవిందరావు క్యాంపు కార్యాలయంలో సమావేశమై విలేకర్ల ఎదుట తమ ఆవేదన, డిమాండ్‌ను తెలియజేశారు.
ఆసక్తికర పోరు..
పాతపట్నం టీడీపీలో ఆసక్తి పోరు నడుస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కలమట వెంకటరమణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ తదితరులంతా సమరి్ధస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది కలమటేనని బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభలో కూడా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యరి్థగా కలమట వెంకటరమణ పోటీ చేస్తారని సదరు నాయకులు ప్రకటించారు.
దీంతో కలమటకు వ్యతిరేక గ్రూపుగా పనిచేస్తున్న మామిడి గోవిందరావు వర్గీయులకు మింగుడుపడలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమ మాట లెక్క చేయకుండా కలమటే అభ్యర్థి అని ఎలా ప్రకటిస్తారని అసమ్మతి నాయకులంతా రగిలిపోతున్నారు. ఇంకా మౌనంగా ఉంటే మంచిది కాదని భావించి పార్టీ అగ్రనేతలతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
అగ్రనేతల ప్రకటన తర్వాత..
నియోజకవర్గ అభ్యర్థి కలమట వెంకటరమణే అని ప్రకటించిన తర్వాత బహిరంగ వేదికపైకి వచ్చి అగ్రనేతల ప్రకటనకు భిన్నంగా అసమ్మతి నాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. బుధవారమైతే విలేకర్లతో సమావేశమై కలమటపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఆయన్ని ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా ఉన్న పైల బాబ్జి, యాళ్ల నాగేశ్వరరావు, ఎద్దు దాసునాయుడు, వెలమల గోవిందరావు, కాగాన మన్మధరావు, నంబాల వెంకటరావు, కోవిలాపు కృష్ణమాచారి, దశరథ, యర్లంకి తిరుపతిరావు, సనపల తిరుపతిరావు, యారబాటి బాలరాజు, సవలాపురం యల్లమ్మనాయుడు, చాపల రామారావు, బాబారావు తదితర నాయకులంతా కలమటపై ఆరోపణలు గుప్పించారు. ‘కలమట నాయకత్వంపై విశ్వాసం, నమ్మకం లేదు.
టీడీపీలో ఉన్న కలమట 2014లో వైఎస్సార్ సీపీలోకి వెళ్లారు. గెలిచిన తరువాత 2016లో టీడీపీలోకి మళ్లీ వచ్చారు. వచ్చాక ఏం చేశారో అందరికీ తెలుసు. కలమటతో పార్టీలు మారకుండా ముందు నుంచి ఉన్న టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేశారు’ అని గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్‌చార్జిగా ఎంజీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పునరాలోచన చేసుకుని, ఈ నెల 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment