kalamata venkata ramana
-
తాడోపేడో.. కలమటను తప్పించాల్సిందే..తమ్ముళ్ల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం టీడీపీలో కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో అధిష్టానంతో తేల్చుకోవాలని ఒక వర్గం నాయకులు డిసైడ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న జరగనున్న చంద్రబాబు పర్యటనకు ముందే నిర్ణయం తీసుకోవాలని ఏకంగా అలి్టమేటం జారీ చేశారు. కలమట వెంకటరమణనే కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బాహాటంగానే హెచ్చరించారు. ఇప్పుడున్న ఇన్చార్జి కలమట వెంకటరమణను ఎట్టి పరిస్థితుల్లో సమరి్థంచబోమని మెజార్టీ టీడీపీ నాయకులు తేలి్చచెప్పేశారు. ఆయన్ని తీసేసి మామిడి గోవిందరావుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కలమటపై విశ్వాసం లేదని, ఆయనతో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. బుధవారం మామిడి గోవిందరావు క్యాంపు కార్యాలయంలో సమావేశమై విలేకర్ల ఎదుట తమ ఆవేదన, డిమాండ్‌ను తెలియజేశారు. ఆసక్తికర పోరు.. పాతపట్నం టీడీపీలో ఆసక్తి పోరు నడుస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కలమట వెంకటరమణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ తదితరులంతా సమరి్ధస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేది కలమటేనని బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభలో కూడా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యరి్థగా కలమట వెంకటరమణ పోటీ చేస్తారని సదరు నాయకులు ప్రకటించారు. దీంతో కలమటకు వ్యతిరేక గ్రూపుగా పనిచేస్తున్న మామిడి గోవిందరావు వర్గీయులకు మింగుడుపడలేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమ మాట లెక్క చేయకుండా కలమటే అభ్యర్థి అని ఎలా ప్రకటిస్తారని అసమ్మతి నాయకులంతా రగిలిపోతున్నారు. ఇంకా మౌనంగా ఉంటే మంచిది కాదని భావించి పార్టీ అగ్రనేతలతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అగ్రనేతల ప్రకటన తర్వాత.. నియోజకవర్గ అభ్యర్థి కలమట వెంకటరమణే అని ప్రకటించిన తర్వాత బహిరంగ వేదికపైకి వచ్చి అగ్రనేతల ప్రకటనకు భిన్నంగా అసమ్మతి నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బుధవారమైతే విలేకర్లతో సమావేశమై కలమటపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఆయన్ని ఇన్చార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా ఉన్న పైల బాబ్జి, యాళ్ల నాగేశ్వరరావు, ఎద్దు దాసునాయుడు, వెలమల గోవిందరావు, కాగాన మన్మధరావు, నంబాల వెంకటరావు, కోవిలాపు కృష్ణమాచారి, దశరథ, యర్లంకి తిరుపతిరావు, సనపల తిరుపతిరావు, యారబాటి బాలరాజు, సవలాపురం యల్లమ్మనాయుడు, చాపల రామారావు, బాబారావు తదితర నాయకులంతా కలమటపై ఆరోపణలు గుప్పించారు. ‘కలమట నాయకత్వంపై విశ్వాసం, నమ్మకం లేదు. టీడీపీలో ఉన్న కలమట 2014లో వైఎస్సార్ సీపీలోకి వెళ్లారు. గెలిచిన తరువాత 2016లో టీడీపీలోకి మళ్లీ వచ్చారు. వచ్చాక ఏం చేశారో అందరికీ తెలుసు. కలమటతో పార్టీలు మారకుండా ముందు నుంచి ఉన్న టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేశారు’ అని గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్చార్జిగా ఎంజీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు పునరాలోచన చేసుకుని, ఈ నెల 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మావోయిస్టుల పేరుతో వసూళ్లకు యత్నం
శ్రీకాకుళం,కొత్తూరు: మావోయిస్టుల పేరుతో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు పాలకొండ డీఎస్పీ స్వరూపరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 పునరావాస కాలనీకి చెందిన ఇరపాడు నిర్వాసితుడు వి.వెంకటరమణ మావోయిస్టుల పేరుతో ఎమ్మెల్యే నుంచి సొమ్ము వసూలు చేయాలని పథకం పన్నాడు. దీనిలో భాగంగా ఈ నెల 23న లబ్బ నుంచి బైక్‌పై ఇంటికి వస్తున్న తనను మార్గమధ్యంలో మావోయిస్టులు ఆపారని, ఎమ్మెల్యే సన్నిహితుడు ఎం.సీతారాం ద్వారా రూ.40 లక్షలు తీసుకురావాలని చెప్పినట్లు కట్టుకథ అల్లాడు. ఈ విషయాన్ని సీతారాంకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఈ నెల 24న మాతల గ్రామంలో ఉంటున్న ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మెట్టూరు వద్ద ఈ నెల 24న వెంకటరమణను అదుపులోకి తీసుకొని విచారించారు. తనకు మావోయిస్టులు ఎవరూ వసూలు చేయమని చెప్పలేదని, తానే అప్పులు బాధతో ఇలా చేశానని పోలీసుల ఎదుట వెంకటరమణ అంగీకరించాడు. కాంట్రాక్టు పనులు చేసి సుమారు రూ.10 లక్షలు అప్పుల పాలయ్యాయని చెప్పాడు. అనంతరం వెంకటరమణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు లేవు.. సీతంపేట, భామిని, కొత్తూరుతో పాటు జిల్లాలో మావోయిస్టులు కదలికలు లేవని డీఎస్పీ స్వరూపరాణి స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా బెదిరింపులు చేస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెదిరింపులు చేసినట్లు రుజువైతే నాన్ బెయిల్ కేసు నమోదు చేయడంతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సింది పోయి.. వాళ్లకు పెద్దపీట వేస్తూ మైకు ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజి వ్యవహారంపై చర్చకు పట్టుబట్టి వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా వారిని అడ్డుకునేందుకు పలువురు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో పార్టీ ఫిరాయించిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మైకు ఇచ్చారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత పచ్చకండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాన్ని విమర్శించేందుకు ఆయనకు మైకు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెంకటరమణ వెనకాలకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దాంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేచి.. తమ బెంచీల వద్దకు వచ్చి నినాదాలు చేయొద్దంటూ ప్రతిపక్షాన్ని కోరారు. అయితే సాధారణ సభ్యుల వద్దకు వెళ్లకుండా కేవలం పార్టీ ఫిరాయించిన వారి వద్దకు మాత్రమే వెళ్తున్న విషయాన్ని ఆయన గమనించలేదు. -
విజయరామరాజుకు చెక్ పడినట్టేనా?
►టీడీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కలమట ►జిల్లా పార్టీలో అప్పుడే లుకలుకలు ►మమేకం కాలేమంటున్న క్యాడర్ ►ఆగ్రహం చెందుతున్న నేతలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించనున్నట్టు మంగళవారం ప్రకటించడంపై టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ ప్రజల కోరడంతోనే చంద్రబాబుకు మద్ధతు ప్రకటిస్తున్నట్టు కలమట చెప్పిన మరుక్షణం నుంచే జిల్లా టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తొలినుంచీ పార్టీని నమ్ముకున్న వారిని కాదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కలమటను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించడం మొదలెట్టారు. 10యేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండడం, వంశధార నిర్వాసితుల ఇబ్బందులు, కరకట్టల నిర్మాణం, తాగు, సాగు నీటిసమస్యలపై తనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానని, పార్టీ వీడుతున్నట్టు సంకేతాలు ఇచ్చిన కలమట భవిష్యత్తులో తమకు ఏ విధంగా సహకరించగలరని మెళియాపుట్టి వాసులు అటు టీడీపీ ఇటు కలమట వర్గీయుల్నీ ప్రశ్నించినట్టు తెలిసింది. నమ్మి ఓటేసిన ప్రజలు ఇప్పుడు పార్టీని వీడితే అంగీకరిస్తారా అని కూడా అడుగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీకి మద్ధతిస్తున్నట్టు చెబుతున్న కలమట..ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ధి చేసిందని, రైల్వే, కేంద్ర బడ్జెట్లో ఏం కేటాయింపులు తెప్పించారని, రాష్ట్రాభివృద్ధి కాంక్షతో ప్రత్యేక హోదా కూడా తెప్పించలేని చంద్రబాబుతో భవిష్యత్తులో ఎలా అంటకాగుతారని కలమటను ప్రశ్నించేందుకు ఆ ప్రాంత ప్రజలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు చెక్ చెప్పినట్టేనా? టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజుకు చెక్ పెట్టేందుకే కలమటను పార్టీలోకి ఆహ్వానించినట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాజు రాకను తొలినుంచీ అడ్డుకుంటున్న జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల అక్కడి పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సైతం రాజుకు ఆహ్వానం పంపించకపోవడం, ఎంపీ, మంత్రి కూడా అంతా తామై వ్యవహరించడం తెలిసిందే. ఇప్పుడు కలమటను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ ఇన్చార్జిగా ఉన్న విజయరామరాజుకు పూర్తిస్థాయిలో చెక్ పడిందనే టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. చాన్నాళ్ల నుంచి తాము పార్టీలో ఉంటే..పార్టీని వీడి వెళ్లిన వ్యక్తిని ఎలా దగ్గరకు చేర్చుకుంటారని జిల్లా మంత్రికి కార్యకర్తలు అప్పుడే ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. పాతపట్నం నియోజకవర్గంలో తాము కొత్తవ్యక్తితో మమేకం కాలేమని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే మెళియాపుట్టి మండల నేతలు పూర్తిస్థాయిలో కలమటను వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు లేదని చెప్పేస్తున్నారు. ఒత్తిడి తెచ్చారా? ఒప్పుకున్నారా? తమ ప్రాంతం కొన్నాళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని, 10గ్రామాల్లో భూములన్నీ ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని చెబుతున్న కలమటకు ఆ విషయం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు లోనై పార్టీకి దగ్గరవుతున్నారంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిల్ని కూడా పరిగణలోకి తీసుకుని టీడీపీ అధిష్టానం నిధులు మంజూరు చేస్తుండడంతో భవిష్యత్తులో ఏదో ఆశించే పార్టీలోకి వస్తున్నట్టు కలమట సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. భూములు, నగదు, అభివృద్ధి పనుల్లో వాటాలు, రానున్న కాలంలో హోదా ఆశించే ఆయన వస్తున్నారన్న విషయాన్ని అంగీకరించకుండా పార్టీ బలోపేతం అవుతుందని జిల్లా మంత్రి చెబుతుండడాన్ని తప్పుబడుతున్నారు. టీడీపీకి సహకరిస్తానని కలమట చెబుతుండడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో అందరికీ తెలుసునని, కలమట స్వయంగా పార్టీకి ఆకర్షితులు కానట్టేనని చెబుతున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం, నిలువనీడ లేనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కలమట చెప్పడం వెనుక ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురై పార్టీకి మద్ధతివ్వాల్సి వచ్చిందో చెప్పాలని ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం'
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అమానుషమని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఎయిర్పోర్ట్ అధికారిపై చేయి చేసుకున్నారంటూ ఎంపీ మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణ ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన ఖండించారు. -
'పత్తి రైతులను ఆదుకోవాలి'
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పాడైన పత్తి పంటను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ బుధవారం పరిశీలించారు. నష్ట పోయిన పత్తి రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినందున ప్రతి సెంటు పంటకు నష్టపరిహారం ఇవ్వాలని, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.