బీజేపీలో బాహాబాహీ
-
హరిబాబు సమక్షంలో తోపులాట
-
విస్తరణపోయిన నాయకులు
బోట్‌క్లబ్ (కాకినాడ) :
బీజేపీ వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. గత జనవరి నెల్లో జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్నికల్లో రెండు వర్గాలుగా చీలిపోయిన క్యాడర్ తరచూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సమక్షంలో కాకినాడ నగరానికి చెందిన ఇద్దరు నేతలు తోపులాటకు దిగారు. నవంబర్ 4న కాకినాడ వస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభ జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సమావేశంలో వర్గపోరుకు వేదికయింది. పార్టీలో సస్పెండ్‌కు గురైన నేతలు స్టేజ్‌మీద ఉండకూడదని సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మచ్చా గంగాధర్ బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు ఎ¯ŒSవీ సాయిబాబాను ఉద్ధేశించి అనడంతో సాయిబాబా వర్గం గంగాధర్ వర్గం మధ్య తోపులాట జరిగింది. ఆర్‌అండ్‌బీ సమావేశ మందిరం నుంచి కారిడార్‌లోనికి వచ్చి ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. హరిబాబు, జిల్లా నాయకులు వారించి ఇద్దరినీ సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
వెంకయ్యనాయుడి సభకు భారీ జన సమీకరణ
నవంబర్ 4న కాకినాడలో జరిగే వెంకయ్య నాయు డు సభకు జన సమీకరణ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడుపాటి హరిబాబు తెలిపారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అధిక నిధులు కేటాయించిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షు డు మాలకొండయ్య మాట్లాడుతూ వెంకయ్యనాయుడు సభ విజయవంతానికి అందరూ సహకరిం చాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వర్‌ారవు, పైడా కృష్ణమోహ న్, అయ్యాజీ వేమా, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్ పాల్గొన్నారు.