
సాక్షి, తిరుపతి : శీకాళహస్తి టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపలేదంటూ పార్టీ సీనియర్ నేత మోహన్ ఆందోళన చేపట్టారు. అనుచరులతో కలిసి ప్రారంభోత్సవానికి వచ్చిన బొజ్జల వాహనాన్ని అడ్డుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆందోళన మధ్యే ఎమ్మెల్యే బొజ్జల అన్నా క్యాంటీన్ ప్రారంభించి వెళ్లిపోయారు.