విశాఖ : హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ డిపోలపై తూనికలు, కొలతల శాఖ సోమవారం ఉదయం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా విశాఖలో 9, శ్రీకాకుళంలో 4 దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారుల జరిపిన దాడుల్లో సరుకుల నిల్వలో తేడాలున్నట్లు గుర్తించారు. దాంతో కేసులు నమోదు చేసి, సరుకులను సీజ్ చేశారు.
మరోవైపు ఎవరైనా నిత్యావసర సరకులను ఎక్కువ ధరకు విక్రయిస్తే 0891-2550706కు ఫోన్ చేయాల్సిందిగా ప్రాంతీయ నిఘా, అమలు అధికారి సూచించారు. కాగా నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.
రేషన్ షాప్లపై తూనికల శాఖ దాడులు
Published Mon, Oct 20 2014 9:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement