
సాక్షి, అమరావతి : విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన సవాంగ్‌కు భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాంగ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
డీజీపీగా ఠాకూర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. శనివారం సాయంత్రం సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.