ఆరుగురుఎంఈవోలు సస్పెన్షన్ | six members of MEO's suspend | Sakshi
Sakshi News home page

ఆరుగురుఎంఈవోలు సస్పెన్షన్

Published Fri, May 30 2014 2:19 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

six members of MEO's suspend

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)లో తవ్విన కొద్దీ అక్ర మాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా ఆ శాఖలోని అధికారుల తీరు మారడం లేదు. పేద పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆరుగురు మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈవో)ను, రాజీవ్ విద్యామిషన్ ప్రత్యాన్మయ(అలెస్కో) పాఠశాల కో-ఆర్టినేటర్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
 
 నిధుల దుర్వినియోగ ఫలితం
 2011-12, 2012-13 విద్యాసంవత్సరంలో ఆర్‌ఎస్‌టీసీ(బాల కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల) నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు గతేడాది విచారణ చేపట్టారు. ఇందులో నిధుల దుర్వియోగం అయినట్లు తేలింది. విచారణ రిపోర్టులు ప్రభుత్వానికి అందజేశారు. రిపోర్టును ఆర్వీఎం అధికారులకు ప్రభుత్వం పంపింది. దీంతో ఆర్వీఎం అధికారులు కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. ఎంఈవోలుగా పనిచేసిన వారిపైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్జేడీకి నివేదించారు. ఆర్జేడీ స్పందిస్తూ ఆరుగురు ఎంఈవోలను, ఒక అలస్కోను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆర్‌ఎస్‌టీసీలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అక్రమాలకు పాల్పడటంతో అధికారులపై చర్యలు చేపట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement