balaiah
-
ఈ నెలలో ప్రతి శనివారం పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో డిసెంబర్ నెలలోని అన్ని శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పీఎస్కేలు, 14 పీవోపీఎస్కేల్లో ఈ డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తుదారులకు 3200 అపాయింట్మెంట్లు అందించినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినందుకు విదేశాంగ శాఖ అధికారులు, పోలీస్, పోస్టల్ శాఖలకు దరఖాస్తుదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
Passport Drive: డిసెంబర్ 3న ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్
రాంగోపాల్‌పేట్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుండటంతో డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేక పాస్‌పోర్టు డ్రైవ్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకిలోని పీఎస్కేలు, నిజామాబాద్, కరీంనగర్ పీఎస్కేలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో డిసెంబర్ 3వ తేదీన తత్కాల్, సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు, కొత్తగా చేసుకునేవారికి కూడా స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ ఒక్క రోజు 3,500 దరఖాస్తులను ఆయా కేంద్రాల ద్వారా సమర్పించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందులో 70 శాతం తత్కాల్, 30 శాతం సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులుంటాయని వివరించారు. బుధవారం ఉదయం నుంచి పాస్‌పోర్టు సేవా పోర్టల్, ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా, దరఖాస్తు చేసుకున్న వారు 3వ తేదీకి ప్రీపోన్ చేసుకోవచ్చని సూచించారు. డిసెంబర్ 3న ఒక రీ షెడ్యూలింగ్, ఒక ప్రీపోన్కు మాత్రమే అవకాశం ఉంటుందని.. మరో తేదీ మార్చుకునే వెసులుబాటు ఉండదని గుర్తుంచుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు. -
సాలభంజికల సింహాసనం
గిడుతూరి సూర్యం దర్శకత్వంలో రామకృష్ణ, యస్వీరంగారావు, బాలయ్య... ప్రధాన పాత్రలు పోషించిన సినిమా (1971)లోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘విక్రమార్క మహారాజా! ఊర్వశీ రంభల నాట్యాన్ని తిలకించిననాడు మీరు ఇచ్చిన తీర్పుకి మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకం నాడు పరమేశ్వరుడు మహేంద్రునికి ఇచ్చిన ఈ సింహాసనపీఠం మీకు ఇవ్వబడింది. మా అందరికీ నేత్రోత్సవంగా ఈ భద్రపీఠాన్ని అనుష్ఠించండి మహారాజా!’’ అంటూ మహారాజును ఆహ్వానించాడు భట్టి. ‘జయీభవ! విజయీభవ!’ అంటూ నినాదాలు మిన్ను ముట్టాయి. మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న సమయంలో.. ‘‘ఆగండి’’ అనే అరుపు వినిపించింది. ఎవరో విప్రుడు. ‘‘ఎవరు నువ్వు?’’ అని గట్టిగా అడిగాడు భట్టి. ‘‘నేనొక పేద విప్రుడిని. మీ నగరంలోనే ఆకలి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా’’ అన్నాడు ఆవేదనగా ఆ విప్రుడు. ‘‘ఏమిటి! మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్య్ర బాధా? మహామంత్రి! తక్షణమే వీరికి వెయ్యి సువర్ణములు ఇప్పించండి’’ అని ఆదేశించారు మహారాజు. సంచిలో సువర్ణములు వచ్చాయి. కానీ పేద బ్రహ్మణుడి ముఖంలో వెలుగు లేదు. ‘‘మహారాజా! నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను’’ అన్నాడు నిర్మొహమాటంగా. ‘‘తమ శౌర్యప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలిస్తున్న మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది’’ ఆశ్చర్యపోయాడు భట్టి. విక్రమార్క మహారాజులు మాత్రం విప్రుడి మాటలకు కోపం తెచ్చుకోకపోగా ఏదో బోధపడినట్లు శాంత స్వరంతో ఇలా అన్నాడు: ‘‘నిజమే ఇది మా కష్టార్జిత ధనం కాదు. ఇది ప్రజాధనం. మా విజయ పరంపరకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించినవారు చెమటోడ్చినవారు కష్టజీవులు. రెండు ఘడియల గడువు ఇవ్వండి. సామన్యపౌరుడిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి మీకు ఇస్తాను’’ ‘‘ఆ రెండు ఘడియలూ సింహసనంపై కూర్చొనే అవకాశం నాకు ఇవ్వండి’’ అడిగాడు ఆస్థాన విదూషకుడు. ‘‘విదూషకా! అలాగే. నీ పరిపాలన చూసి వినోదిస్తాను’’ అన్నారు మహారాజు. ‘‘కాదు విచారిస్తారు. నా పరిపాలనలో కష్టపడి డబ్బు సంపాదించాలనుకునే మీలాంటి వారికి ఎలాంటి ఉద్యోగం లభించకూడదని శాసనం జారీ చేస్తాను. అప్పుడు ఎలా సంపాదిస్తారో నేనూ చూస్తాను’’ అన్నాడు విదూషకుడు. ‘‘నీ పరిపాలన ప్రారంభించు’’ అని విదూషకునికి సింహాసనం చూపించాడు మహారాజు. ఈలోపు ‘మహారాజా!’ అంటూ గట్టి పిలుపు వినబడింది. విప్రుడు మాయమై దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు! ‘‘దేవేంద్రా మీరా!’’ ఆశ్చర్యంగా అన్నాడు మహారాజు. ‘‘ఇంతటి ధర్మమూర్తివై నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంత కాలం ఈ పవిత్రపీఠం అలంకరించే అర్హత నీకు తప్ప ఎవరికీ లేదు. నీ పాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. వెయ్యి సంవత్సరాలు ఈ భద్రపీఠంపై వెలుగొందు దీవెన ఇస్తున్నాను’’ అని విక్రమార్కుడికి వరం ఇచ్చాడు దేవేంద్రుడు. .... ఒంటరిగా కూర్చొని తనలో తాను బాధపడుతున్నాడు విక్రమార్కుడు. ‘‘అన్నగారూ... ఇంతటి మహదానంద తరుణంలో ఆలోచన నిమగ్నులై ఉన్నారు!’’ అడిగాడు భట్టి. ‘‘భట్టీ! నువ్వు లేని వెయ్యేండ్ల నిస్సారమైన జీవితం ఎలా గడపగలను!’’ తన మనసులో బాధను చెప్పాడు విక్రమార్కుడు. ఆ మాటకు భట్టి కదిలిపోయాడు. కళ్లలో కన్నీటి పొర. ‘‘మరణంతో మీ సేవాభాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా! భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తా’’ అని బయలుదేరాడు భట్టి. ∙∙ భుజం మీద శవంతో విక్రమార్కుడు కాళీ దగ్గరకు వెళుతున్నాడు. ఎక్కడి నుంచో గొంతు వినిపించింది. ‘‘విక్రమార్కా! నేను భేతాళుడిని. ఈ దొంగసన్యాసిని వధించు. నేను నీకు వశం అవుతాను’’ ‘‘మహారాజా! దేవికి సాష్టాంగ ప్రమాణం చెయ్’’ అన్నాడు దొంగ సన్యాసి. ‘‘అదెలాగో నాకు తెలియదు. చేసి చూపించండి’’ అని తెలివిగా అడిగాడు విక్రమార్కుడు. దొంగ సన్యాసి వంగగానే మెడపై వేటు వేశాడు విక్రమార్కుడు. అప్పుడు భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘క్లీం అలా క్లీం...విక్రమార్క మహారాజా! నేనే మీకు వశం అయ్యాను’’ అన్నాడు. ‘‘మంచిది భేతాళా. ప్రపంచంలోని వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు’’ అని భేతాళుడిని ఆదేశించాడు విక్రమార్కుడు. కొద్దిరోజుల తరువాత భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశా. దురంహకారంతో శపథం చేశాడు. సాలభంజికల పీఠాన్ని తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడట. ఎంతటి దురహంకారం’’ అన్నాడు కోపంగా భేతాళుడు. ∙∙ వీరసేనుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. కాళీమాత ఎంతకీ కనికరించడం లేదు. ఇక ఆగలేక కత్తితో కడుపులో పొడుచుకొని పేగుల్ని బయటకు తీసుకున్నాడు... అప్పుడు కాళీమాత ప్రత్యక్షమైంది. ‘‘ఏమి కోరి ఈ తపస్సు?’’ అని అడిగింది. ‘‘ఇంద్రజాల, మహేంద్రజాల, అంజన, ఆకర్షణ, ఉచ్ఛాటన, పరకాయప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతం కావాలి. నన్ను అనుగ్రహించి పాలించు మాతా’’ అని వేడుకున్నాడు వీరసేనుడు. ‘‘కుమరా! నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందు ఉన్న ఈ అఖండజ్యోతి ఆరనంత వరకు నీవు ఈ శక్తులు కలిగి ఉంటావు’’ అని వరం ఇచ్చింది మాత. వీరసేనుడిలోని గర్వం పదింతలు పెరిగింది. పట్టలేనంత ఆహంకారంతో... ‘‘ఓరీ విక్రమార్క! ఇక నీ మృత్యురూపమును ధరింతునురా’’ అని అరిచాడు. జవాబు: విక్రమార్క విజయం -
ఆటో-బైక్ ఢీ... వ్యక్తి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మల్లాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న బాలయ్య(35) మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి పై పైశాచికత్వం చూపించాడో కామాంధుడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన బాలయ్య(66) ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఉరేసుకుని అన్నదాత ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు బాలయ్య (56) రెండెకరాల పొలాన్ని సాగులోకి తెచ్చేందుకు బోరు వేశాడు. అనుకున్నంతగా నీళ్లు పడకపోవడంతో వేసిన పంటలు చేతికందలేదు. దీంతో రూ.1.6 లక్షల అప్పులు మాత్రం మిగిలాయి. ఈ క్రమంలో కూలి పనులకు వెళ్తున్నాడు. మరోపక్క గతంలో చేసిన అప్పులు తీర్చకపోవడంతో.. రెండో కుమారుడి పెళ్లి ఖర్చులకు సైతం ఎవరూ అప్పు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాలయ్య మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రకు ఉపక్రమించిన బాలయ్య... కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్న తర్వాత పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం వెలుగు చూసింది. -
నాగార్జున యూనివర్సిటీలో కలకలం!
-
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ విద్యార్థి బాలయ్య ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. గత వారం రోజులుగా తనను ప్రేమించాలంటూ బాలయ్య వేధిస్తున్నాడని రత్నమంజరి గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
విడుదలకి సిద్దమైన బాలయ్య ’ లయన్’
-
ఆరుగురుఎంఈవోలు సస్పెన్షన్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)లో తవ్విన కొద్దీ అక్ర మాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా ఆ శాఖలోని అధికారుల తీరు మారడం లేదు. పేద పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆరుగురు మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈవో)ను, రాజీవ్ విద్యామిషన్ ప్రత్యాన్మయ(అలెస్కో) పాఠశాల కో-ఆర్టినేటర్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. నిధుల దుర్వినియోగ ఫలితం 2011-12, 2012-13 విద్యాసంవత్సరంలో ఆర్‌ఎస్‌టీసీ(బాల కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల) నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు గతేడాది విచారణ చేపట్టారు. ఇందులో నిధుల దుర్వియోగం అయినట్లు తేలింది. విచారణ రిపోర్టులు ప్రభుత్వానికి అందజేశారు. రిపోర్టును ఆర్వీఎం అధికారులకు ప్రభుత్వం పంపింది. దీంతో ఆర్వీఎం అధికారులు కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. ఎంఈవోలుగా పనిచేసిన వారిపైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్జేడీకి నివేదించారు. ఆర్జేడీ స్పందిస్తూ ఆరుగురు ఎంఈవోలను, ఒక అలస్కోను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆర్‌ఎస్‌టీసీలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అక్రమాలకు పాల్పడటంతో అధికారులపై చర్యలు చేపట్టారు. -
ప్రచారానికి పిలవాలా... వారే రావాలి !!
-
పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే...
-
బావను భయపెడుతున్న బాలయ్య!
బావ హరికృష్ణ, బాబు జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే సంబంధాలు బెడిసి కొట్టిన చంద్రబాబు నాయుడును ఇప్పుడు పిల్లనిచ్చిన బావమరిది బాలయ్య వ్యవహారం భయపెడుతోంది. కొన్నాళ్ళుగా బాలకృష్ణ మౌనం పాటిస్తున్నారు. ఎలా సముదాయించాలో తెలియని బాబు టెన్షన్ పడుతుంటే.. తెలుగు తమ్ముళ్ళు పెట్టిన డిమాండ్ మరింత ఇరకాటంలో పడేసింది.. అదును చూసి దెబ్బ కొట్టాలి. సినిమాల్లో హీరోలు చేసే పని ఇది. సరిగ్గా ఇదే చేస్తున్నారు హీరో బాలకృష్ణ.. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి.. ఎన్నికల సెగలో పార్టీలు రగులుతున్న వేళ.. హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. సరాసరి ఎన్నికల బరిలో దిగాలని ఉన్నా.. ఆ మాట చెప్పకుండా నిశ్శబ్దం అయిపోయారు. ఇప్పటికే పెద్దబావ హరికృష్ణ, బాబు జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధాలు బెడిసి కొట్టిన చంద్రబాబుకు...ఇప్పుడు బాలయ్య వ్యవహారం ఊపిరి సలపనీయ లేదు. అసలే ఎన్నికలు, ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీని దూరం చేసుకుంటే.. ఎంతో కొంత నష్టం తప్పదన్నది బాబు భయం. అందుకే బాలయ్య మనసులో మాట తెలిసినా.. ఎలా నరుక్కు రావాలో అర్ధం కాక తల పట్టుక్కూర్చున్నారంట. ఇదే సమయంలో బాలయ్య అభిమానులైన తెలుగు తమ్ముళ్ళు పెట్టిన డిమాండ్ బాబును మరింత ఇరకాటంలో పడేసింది. సీమాంధ్రలో ఏదో ఓ రకంగా తెలుగుదేశం నెగ్గుకొస్తే బాలయ్యను ముఖ్యమంత్రిని చేయాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ పెట్టారు. పార్టీ వర్గాలను సముదాయించి బాలకృష్ణను ఎక్కణ్ణుంచి పోటీ చేయించాలని ఇప్పటికే సతమవుతున్న బాబుకు.. ఈ డిమాండ్ ముందు కాళ్ళకు బంధం వేసింది. ఎందుకంటే హరికృష్ణతో బాబుకు సంబంధాలు బెడిసి కొట్టినా.. ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఏకమైతే.. చేతులెత్తేయడం తప్ప మరో మార్గం లేదని బాబుకు బాగా తెలుసు. పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారడంతో మెట్టు దిగిన బాబు.. బాలయ్యకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా బాలకృష్ణ పోటీ చేయవచ్చంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. వాడుకొని వదిలి పెట్టడం.. స్వ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయాలకు పాల్పడడం.. బాబు నైజమని బాగా తెలిసిన బాలకృష్ణ వ్యూహాత్మకంగానే ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారని టిడిపి వర్గాలు గుసగులలాడుతున్నాయి. తన అభిమానులైన తెలుగుతమ్ముళ్ళతో డిమాండ్ పెట్టించి తన పని కానిచ్చుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. -
రుణాల మంజూరులో ఇంత నిర్లక్ష్యమా..
మంబాపూర్(పెద్దేముల్), న్యూస్‌లైన్: మెగా వాటర్ షెడ్ పథకం కింద మంజూరైన రుణం డబ్బులు చెల్లించడంలో అధికారుల జాప్యంపై గొర్రెలకాపరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాటా డబ్బులు చెల్లించి పది నెలలవుతున్నా రుణం మొత్తం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మెగా వాటర్‌షెడ్ అసిస్టెంట్‌ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పెద్దేముల్ మండల పరిధి మంబాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు... మంబాపూర్ గ్రామ పంచాయతీని 2009 సంవత్సరంలో మెగా వాటర్‌షెడ్ పథకం కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 24మంది గొర్రెలకాపరులకు రుణాలు మంజూరయ్యాయి. ఇందుకోసం వాటర్‌షెడ్ అధికారులు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.3,250చొప్పున కాంట్రిబ్యూషన్ కింద వసూలు చేశారు. దీనికి రెట్టింపు రూ.6,250లు ఒక్కో లబ్ధిదారుకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ డబ్బుల జాడ లేదు. అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ తిప్పుకుంటుండటంతో గొర్రెల కాపరుల్లో ఓపిక నశించింది. గురువారం ఉదయం వాటర్‌షెడ్ అసిస్టెంట్ బాలయ్యను పట్టుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో రెండు గంటలపాటు నిలదీశారు. పది నెలలవుతున్నా రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము కట్టిన డబ్బులైనా తిరిగి చెల్లించాలని పట్టుపట్టారు. అయితే తన వద్ద డబ్బులు లేవని వాటర్‌షెడ్ అసిస్టెంట్ చెప్పడంతో మండిపడ్డారు. దీంతో ఆయన విషయాన్ని పైఅధికారులకు ఫోన్లో చెప్పారు. అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో లబ్ధిదారులు వెంకటయ్య, ధనరాజ్, అంజిలప్ప మండిపడ్డారు. కోడ్‌కు ముందే డబ్బులు వచ్చినా, పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించడానికే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. చివరకు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డబ్బులు ఇస్తామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు వాటర్‌షెడ్ అసిస్టెంట్‌ను వదిలేశారు. -
మూఢవిశ్వాసంతోనే హత్య
మొయినాబాద్, న్యూస్‌లైన్: మూఢ విశ్వాసమే వృద్ధుడి హత్యకు దారితీసింది. వృద్ధుడు బాలయ్య తన కుటుంబానికి బాణామతి చేసి భార్య, తల్లి మృతికి కారణమయ్యాడని అనుమానించి ఆయనను చంపేసినట్లు నిందితుడు యాదయ్య అంగీకరించాడని సీఐ రవిచంద్ర తెలి పారు. మండల పరిధిలోని బాకారంలో ఈనెల 15న జరిగిన బాలయ్య హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. సీఐ రవిచంద్ర విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఎలా చిక్కాడు..? బాకారం గ్రామానికి చెందిన మాల బాలయ్య(70)ను అదే గ్రామానికి చెందిన కాశ యాదయ్య(42) ఈనెల 15న సాయంత్రం దారుణంగా కొట్టిచంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పారిపోయాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం యాదయ్య శంషాబాద్ బస్టాండు సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మొయినాబాద్ ఠాణాకు తరలించి విచారించారు. ఎందుకు చంపేశాడు..? బాలయ్య బాణామతి చేస్తాడని గ్రామస్తులు విశ్వసించేవారు. యాదయ్య 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు వారి పూరి గుడిసె తగులబడిపోయింది. దానికి బాలయ్యే కారణమని యాదయ్య బలం గా విశ్వసించాడు. పదిహేడేళ్ల క్రితం యాదయ్య చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన అరుణను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆమె గర్భవతిగా ఉండగా మృతిచెందింది. బాలయ్య బాణామతి చేయడంతోనే తన భార్య మృతిచెందిందని యాదయ్య నమ్మి పగ పెంచుకున్నాడు. అనంతరం ఆయన మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం యాదయ్య తల్లి ముత్తమ్మ మరణించింది. ఆమెను సైతం బాలయ్యే బలిగొన్నాడని విశ్వసించాడు. తన కుటుంబాన్ని బాలయ్య పొట్టనబెట్టుకున్నాడని భావించాడు. ఈక్రమంలో బాలయ్య హత్యకు గురయ్యేకంటే వారం రోజుల ముందు యాదయ్య అతడిపై దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకుని అతణ్ని పోలీసులకు అప్పగించా రు. యాదయ్యను పోలీసులు నగరంలో ని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. సంక్రాం తి పండుగ నేపథ్యం లో ఆయనను కుటుంబీకులు ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆయన ఈనెల 15న సాయంత్రం బాలయ్య మేకలు మేపుతుండగా అతడి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశావ’ని గొడవపడ్డాడు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో వృద్ధుడి తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కటాకటాల్లోకి యాదయ్య.. యాదయ్యను శనివారం మొయినాబాద్ పోలీసులు రిమాండుకు తరలిం చారు. మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు రమేష్, కృష్ణ, చంద్రయ్య, రాజమల్లేష్, పండరి, నర్సింలును ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో ఏఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
హెచ్ఎంలు అంకితభావంతో పనిచేయాలి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ప్రధానోపాధ్యాయులు అంకితభావం తో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య కోరారు. జిల్లా విద్యాశాఖ, వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు స్ఫూర్తి పేరిట సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవ న్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహచర ఉపాధ్యాయులతో మెరుగైన విద్యాబోధన చేయిం చాలని హెచ్ఎంలకు సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్ఎం అటెండర్, జిల్లా విద్యాశాఖకు డీఈఓ అటెండర్, జోనల్‌కు పాఠశాల ఆర్జేడీ అటెండర్ లాంటివాడని అభివర్ణించారు. అటెండర్లు ఒక గంట ముందు పాఠశాల కు వస్తారని, అందరు వెళ్లిన తర్వాతే వెళ్తారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇలా గే విధులు నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలుచేయాలని, టెన్త్ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా మెరుగుపర్చుకోవాలన్నారు. మొదటి దశలో పాఠశాలలను సందర్శించి సూచనలు, సల హాలు ఇస్తానని, రెండో దశలోను ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తానని, మూడో దశలో మారకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఈఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంల పాత్ర కీలకమన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు వేణుభగవాన్ అనేక అంశాలను ఉదాహరణలతో వివరించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన విద్యార్థులు గీసుకొండ మండలంలోని గొర్రెకుంట, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, ఊకల్, కొమ్మాల, ధర్మారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తున్నారు. వారిని హెచ్ఎంల స్ఫూర్తి కార్యక్రమానికి తీసుకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్, ఆత్మకూరు పాఠశాలల విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో శిక్షణ ఇప్పిస్తున్నామని డీఈఓ తెలి పారు. ‘ఎల్టా’ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా విస్తరిస్తామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు డి.వాసంతి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, అశోక్‌దాస్, వందేమాతరం ఫౌండేషన్ బాధ్యులు రవీందర్, రవీందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ బత్తిని కొమురయ్య, రిసోర్స్పర్సన్లు దేవేందర్‌రెడ్డి, వి.లక్ష్మణ్, ఎల్.వంశీమోహన్, ఎస్.సత్యం, పి.శ్రీనివాస్, కె.రవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, గీసుకొండ ఎంఈఓ ఎస్. జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఉపాధ్యాయుడు వల్స పైడి ఆధ్వర్యంలో నరేంద్రనగర్ పాఠశాల విద్యార్థుల నృత్యరూపకం ఆకట్టుకుంది. హెచ్ఎంలకు స్ఫూర్తి కార్యక్రమాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి.