
యువతులను కిరాయికి తీసుకొచ్చి ఏడాదిగా దందా
పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువు
హసన్‌పర్తి: నగరంలోని వంగపహాడ్‌లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
గది కిరాయి రోజుకు రూ.వెయ్యి
కాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment