High-tech prostitution
-
Warangal: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
హసన్‌పర్తి: నగరంలోని వంగపహాడ్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని సమాచారం. గ్రామంలోని ఓ ప్రాంతంలో నిర్వాహకుడు ఐదు గదులు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా కొనసాగిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆ ఇళ్లల్లో 24/7 నిరంతరం వ్యభిచారం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడాదికాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలిసింది. వ్యభిచార దందా నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. యువతులను రోజువారీగా కిరాయికి తీసుకొస్తున్నారని తెలిసింది. రెండు మూడు రోజులు వ్యాపారం చేయించిన అనంతరం వారిని పంపి.. మరికొంత మంది యువతులను తీసుకొస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.గది కిరాయి రోజుకు రూ.వెయ్యికాగా, వ్యభిచార నిర్వాహకులు రోజూ ఒక్కో గదికి రూ. వెయ్యి అద్దె చెల్లిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. గది యజమానులు రోజూ వచ్చి కిరాయి తీసుకెళ్తున్నారని తెలిసింది. అద్దె గదుల్లో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. -
ఆమదాలవలసలో హైటెక్ వ్యభిచారం
* పోలీసుల దాడులు * పట్టుపడ్డ నిర్వాహకురాలు ఆమదాలవలస : పట్టణ శివార్లలో కృష్ణాపురం జంక్షన్ వద్ద ఒక గృహంలో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారానికి ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవరావునాయుడు ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్ఐ ఎం.లక్ష్మయ్య, సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించి చెక్ పెట్టారు. నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలిని, విటుడును అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. దీనికి సంబంధించి ఎస్.ఐ. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణాపురం గ్రామంలో వ్యభిచార గృహం నడిపిస్తున్నారన్న సమాచారంతో వారం రోజులుగా నిఘా పెట్టామని ఎస్ఐ తెలిపారు. ఈ గృహానికి విజయవాడ, హైదరాబాద్, ముంబయ్, అనకాపల్లి, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రవాణా చేస్తున్నారని వెల్లడైనట్లు తెలిపారు. వ్యభిచార నిర్వాహకురాలు ఫోన్లపైనే తన పని అంతా నడుపుతున్నారని, పోలీసు సిబ్బంది ఉన్న సమయంలోనే వచ్చిన ఫోన్ కాల్స్ చెబుతున్నాయని చెప్పారు. ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని తెలిపారు. వ్యభిచారానికి వచ్చిన వారిని కూడా ఒక్కొక్కరినే తన ఇంట్లోకి రప్పిస్తూ మిగతా వారిని మార్గ మధ్యలో ఉంచుతున్నారని తెలిపారు. ఇది చాలాకాలంగా జరుగుతుందని చెప్పారు. నిర్వాహ కురాలు, విటుడుపై ఐ.టి.పి. 3, 4, 6, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఇటీవల శ్రీకాకుళంలో రెండు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలను పట్టుకున్నట్లు వెల్లడించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలను తన భర్త విడిచి పెట్టాడని, జీవనోపాధి లేక తన కుమార్తెను పెంచడానికి ఏ దిక్కు తోచక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డానని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ, ఐ.సీ.డీ.ఎస్. పీవో ఎన్.నళినీదేవి, ఆమదాలవలస సీఐ నవీన్‌కుమార్, ఏఎస్ఐ మెట్ట సుధాకర్, మానవ అక్రమ రవాణ నిరోధక విభాగం ఏఎస్ఐ పి.వి.రమణ, హెచ్.సి. బి.జగదీశ్వరరావు, సిబ్బంది ఆర్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ వ్యభిచారం
చీరాల : చిన్న ముంబైగా పేరొందిన చీరాల ఇప్పుడు హైటెక్ వ్యభిచారానికి కేంద్ర బిందువైంది. కొందరు యువతులు, మహిళలు బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుని పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎటువంటి అమ్మాయి కావాలి.. ఎంత వయసుండాలి... ఎక్కడకు పంపాలి.. ఈ వివరాలు రాసివ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు.. అనుకున్న సమయానికి ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. చీరాల కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మెట్రో నగరాల్లో సాగే ఈ హైటెక్ వ్యభిచారం చివరకు చీరాలకు కూడా పాకింది. కొందరు బ్రోకర్లు స్థానికంగా మకాంలు ఏర్పాటు చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కొత్తపేట పంచాయతీలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. కాలేజీ విద్యార్థినులతో పాటు మహిళలకు డబ్బు ఆశపెట్టి లోబర్చుకుని వారిని ఈ వృత్తిలోకి దించుతున్నారు. కొత్తపేట పంచాయతీలోని దీనమ్మదిబ్బ, మూడురోడ్ల సెంటర్, పట్టణంలోని ఓ లాడ్జి, రైల్వేస్టేషన్ ఎదురు ఉన్న రెసిడెన్సీతో పాటు తీర ప్రాంతంలో ఉన్న పలు భవనాల్లో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. మహిళలను బేరం పెడుతున్నారు. విటుల వద్ద నిర్వహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. మరికొందరైతే అమ్మాయిల బలహీనతలను అడ్డం పెట్టుకుని వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. బ్రోకర్లు వారికి డబ్బు ఆశ చూపి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన చీరాల ప్రాంతం ప్రస్తుతం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వేదికైంది. గతంలో కొత్తపేట పంచాయతీలో ఓ లేడీస్ హాస్టల్ నిర్వాహకురాలు తనతో పాటు కాలేజీ అమ్మాయితో స్వలింగ సంపర్కాన్ని నగ్నంగా వీడియో తీయించిన విషయం తెలిసిందే. ఆప్పట్లో ఆ వీడియో నెట్కేఫ్ల్లో హల్చల్ చేయడంతో పాటు మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలాగే మండలంలోని తోటవారిపాలెంలోనూ ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఇటీవల కాలంలో బ్రోకర్లు కూడా తెలివిమీరారు. నివాసాల మధ్య ఇళ్లు అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. అక్కడ విషయం బయటకు తెలియడంతో మకాం మార్చేసి మరోచోట దుకాణం తెరుస్తున్నారు. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని అక్కడ అమ్మాయిలను ఉంచి నిర్వాహకులు మాత్రం ఇంటి వద్ద ఉంటూ కేవలం ఫోన్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తూ కొత్త తరహా వ్యభిచారానికి తెరలేపారు. టీనేజీ అమ్మాయిలు, మహిళలు..అంటూ కేటగిరీలుగా విభజించి మహిళలను ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా విటులు చెప్పిన గదులకు మహిళలను పంపుతున్నారు. విటులు కోరుకున్న విధంగా మహిళలను తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తూ వారి జేబులు గుల్ల చేస్తున్నారు. కుటుంబ పరిస్థితులే కారణమా? కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు, డబ్బు కోసం ఆశపడి మరికొందరు ఈ మురికి కూపంలోకి దిగుతున్నారు. చేసేది తప్పయినా కుటుంబ భారాన్ని మోసేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వ్యభిచార వృత్తిలోకి వస్తున్నారు. కొందరు పోలీసుల దాడుల్లో దొరికిపోయి అందరి ముందు నేరస్తుల్లా నిలబడుతున్నారు. పడుపు వృత్తిని వదిలేసి కొంతమంది మహిళలు ఇతర వృత్తులను చేస్తున్నా మరికొందరు ఇదే వృత్తినే కొనసాగిస్తుండటం గమనార్హం.