హైటెక్ వ్యభిచారం | Hitech prostitution in chirala | Sakshi
Sakshi News home page

హైటెక్ వ్యభిచారం

Published Sun, Oct 19 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

చీరాలలో హైటెక్ వ్యభిచారం

చీరాలలో హైటెక్ వ్యభిచారం

చీరాల : చిన్న ముంబైగా పేరొందిన చీరాల ఇప్పుడు హైటెక్ వ్యభిచారానికి కేంద్ర బిందువైంది. కొందరు యువతులు, మహిళలు బ్రోకర్ల ఉచ్చులో చిక్కుకుని పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎటువంటి అమ్మాయి కావాలి.. ఎంత వయసుండాలి... ఎక్కడకు పంపాలి.. ఈ వివరాలు రాసివ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు.. అనుకున్న సమయానికి ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. చీరాల కేంద్రంగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. మెట్రో నగరాల్లో సాగే ఈ హైటెక్ వ్యభిచారం చివరకు చీరాలకు కూడా పాకింది. కొందరు బ్రోకర్లు స్థానికంగా మకాంలు ఏర్పాటు చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

కొత్తపేట పంచాయతీలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. కాలేజీ విద్యార్థినులతో పాటు మహిళలకు డబ్బు ఆశపెట్టి లోబర్చుకుని వారిని ఈ వృత్తిలోకి దించుతున్నారు. కొత్తపేట పంచాయతీలోని దీనమ్మదిబ్బ, మూడురోడ్ల సెంటర్, పట్టణంలోని ఓ లాడ్జి, రైల్వేస్టేషన్ ఎదురు ఉన్న రెసిడెన్సీతో పాటు తీర ప్రాంతంలో ఉన్న పలు భవనాల్లో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. మహిళలను బేరం పెడుతున్నారు. విటుల వద్ద నిర్వహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. మరికొందరైతే అమ్మాయిల బలహీనతలను అడ్డం పెట్టుకుని వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

బ్రోకర్లు వారికి డబ్బు ఆశ చూపి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన చీరాల ప్రాంతం ప్రస్తుతం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు వేదికైంది. గతంలో కొత్తపేట పంచాయతీలో ఓ లేడీస్ హాస్టల్ నిర్వాహకురాలు తనతో పాటు కాలేజీ అమ్మాయితో స్వలింగ సంపర్కాన్ని నగ్నంగా వీడియో తీయించిన విషయం తెలిసిందే. ఆప్పట్లో ఆ వీడియో నెట్‌కేఫ్‌ల్లో హల్‌చల్ చేయడంతో పాటు మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలాగే మండలంలోని తోటవారిపాలెంలోనూ ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది.  
 
గుట్టుచప్పుడు కాకుండా..
ఇటీవల కాలంలో బ్రోకర్లు కూడా తెలివిమీరారు. నివాసాల మధ్య ఇళ్లు అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. అక్కడ విషయం బయటకు తెలియడంతో మకాం మార్చేసి మరోచోట దుకాణం తెరుస్తున్నారు. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని అక్కడ అమ్మాయిలను ఉంచి నిర్వాహకులు మాత్రం ఇంటి వద్ద ఉంటూ కేవలం ఫోన్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తూ కొత్త తరహా వ్యభిచారానికి తెరలేపారు. టీనేజీ అమ్మాయిలు, మహిళలు..అంటూ కేటగిరీలుగా విభజించి మహిళలను ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా విటులు చెప్పిన గదులకు మహిళలను పంపుతున్నారు. విటులు కోరుకున్న విధంగా మహిళలను తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తూ వారి జేబులు గుల్ల చేస్తున్నారు.
 
కుటుంబ పరిస్థితులే కారణమా?
కుటుంబ పరిస్థితుల కారణంగా కొందరు, డబ్బు కోసం ఆశపడి మరికొందరు ఈ మురికి కూపంలోకి దిగుతున్నారు. చేసేది తప్పయినా కుటుంబ భారాన్ని మోసేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వ్యభిచార వృత్తిలోకి వస్తున్నారు. కొందరు పోలీసుల దాడుల్లో దొరికిపోయి అందరి ముందు నేరస్తుల్లా నిలబడుతున్నారు. పడుపు వృత్తిని వదిలేసి కొంతమంది మహిళలు ఇతర వృత్తులను చేస్తున్నా మరికొందరు ఇదే వృత్తినే కొనసాగిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement