తెలంగాణ బిల్లును అడ్డుకోవాల్సిందే..
Published Sun, Dec 15 2013 3:07 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
ఆమదాలవలస,న్యూస్‌లైన్: శాసనసభ, శాసన మం డలిలో ప్రవేశ పెట్టనున్న తెలంగాణ బిల్లును సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యులు సభలలో అడ్డుకోవాలని, లేకుంటే సీమాంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహన్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ పట్టణంలోని విద్యార్థులతో కలిసి శనివారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. రైల్వేస్టేషన్ కూడలి వద్ద మాన వహారం నిర్వహించి సోనియూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కోరారు. తెలుగుజాతికి, తెలుగు తల్లికి మోసం చేయూలనుకునే వారికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధిచెప్పక తప్పదన్నారు. ప్రజా సమస్యలపైన, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డేనని పేర్కొన్నారు. విభజన బిల్లును వెనుకకు తీసుకునేవరకు పోరా టాన్ని ఆపేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల యూత్ కన్వీనర్‌లు ధవళ అప్పలనాయుడు, సింగూరు రాజు, కిల్లి తాతన్నాయుడు, పైడి లోకేష్, పైడి వరహాల నాయుడు, స్వామి నాయుడు, మురళీ పాల్గొన్నారు.
విభజన బిల్లును ఓడించాల్సిందే
శ్రీకాకుళం అర్బన్: తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తే సీమాంధ్ర ప్రాం తానికి చెందిన శాసన సభ్యులంతా కలిసి బిల్లును ఓడించాలని సమై క్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతి నిధులు డిమాండ్ చేశారు. శ్రీకా కుళం లోని వైఎస్సార్ కూడలి వద్ద చేపట్టిన సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జామి బీమశంకర్ మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చీము, నెత్తురు లేవన్నారు. కనీసం తెలంగాణ ప్రజాప్రతినిధులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సమైక్యాంధ్ర జెడ్పీ జేఏసీ కన్వీనర్ కిలారి నారాయణరావు మాట్లాడుతూ మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసేందుకు పాల్పడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూడా వీరికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సమైక్యాంధ్ర పరి రక్షణ వేదిక కో-కన్వీనర్ కొంక్యాణ వేణుగో పాలరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు పి.జయరాం, గొలివి నర్సునా యుడు, రత్నకిషోర్, విద్యార్థులు ఎ.రాజబాబు, ఎస్.ప్రశాంత్, ఎస్.మోహ నరావు, ఎల్.నరేంద్రకు మార్, జి.ప్రశాంత్‌కుమార్, పి.రమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement