ఆమదాలవలస: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాదిగల చైతన్య రథా యాత్ర ఆమదాలవలస పట్టణానికి చేరుకుంది. ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు లోపింటి నారాయణరావు, అధ్యక్షుడు యందవ నారాయణరావు ఆధ్వర్యంలో మాదిగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 420 అని విమర్శించారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పించి, పెద్ద మాదిగనవుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని ధ్వజమెత్తారు. మాటతప్పిన చంద్రబాబును గద్దె దించడానికి జాతి నాయకులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 12న ఢిల్లీలో జరగనున్న మహా ధర్నాకు మాదిగ నాయకులంతా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి వైఎస్ రాజు మాదిగ, జిల్లా నాయకులు సవలాపురపు భాస్కరరావు, నవిరి గణేష్, లోపింటి తేజేశ్వరరావు, సిరిపురపు తవుడు, పెంకి రవి, సిరిపురపు రాంబాబు, నవిరి చిన్న, నవిరి గురుమూర్తి, కురమాన రాజు, కంటిపాక పార్వతి ఉంగటి రాజు తదితరులు పాల్గొన్నారు.
మాటతప్పిన బాబును గద్దెదించుతాం
Published Tue, Jun 21 2016 12:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement