చోరీలపై ప్రత్యేక దృష్టి
ఆమదాలవలస: జిల్లాలో చోరీలను అరి కట్టే విషయమై ప్రత్యేక దృస్టి సారిస్తున్నామని ఎస్పీ నవీన్ గులాఠీ చెప్పారు. శనివారం ఆయన ఆమదాలవలసలో మరమ్మతులు చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లను ప్రైవేటు భవనాలుగా తీర్చిదిద్ది న్యాయం కోసం వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పించి ఆదర్శ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి స్టేషన్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందన్నా రు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికి ప్రజ లంతా సహకరించాలని కోరారు. రాత్రి పూట దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇల్లకు తాళం వేసి క్యాంపులకు వెళ్లే వారు ఇళ్లలో ఉన్న బంగారం, డబ్బును లాకర్లలో భద్రపర్చుకుని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు, ఆమదాలవలస సీఐ విజయానంద్, ఆమదాలవలస, సరుబుజ్జలి, బూర్జ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.