
ప్రేమ.. పెళ్లి.. అరెస్టు!
మైనర్ బాలికతో యువకుడి ప్రేమవివాహం
కేసు నమోదు.. యువకుడి అరెస్టు
ఆమదాలవలస : మైనర్‌బాలికను పెళ్లి చేసుకున్న ఓ యువకుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ డి.నవీన్‌కుమార్ శనివారం స్థానిక విలేకరులకు తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణంలో 23వ వార్డు వెంకయ్యపేటకు చెందిన కింజరాపు వెంకటేష్, అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి తమ భీమిలిలో గల అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కల్పించాలని అక్కడి మహిళా మండలిని ఆశ్రయించారు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు
అయితే మైనార్టీ తీరని తమ కుమార్తెను తమ గ్రామానికి చెందిన వ్యక్తి వెంకటేష్ అపహరించి పెళ్లి చేసుకున్నాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈనెల 6న స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మండలి సంరక్షణలో ప్రేమికులకు రక్షణ కల్పించిన మహిళా చేతన ఉత్తరాంధ్ర కార్యదర్శి కత్తి పద్మకు పోలీసులు ఫోన్ చేసి ప్రేమికులను తీసుకురావాలని సూచించారు. దీంతో కొత్తజంటను శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌కు పద్మ తీసుకువచ్చారు. పోలీసులు వెంటనే వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలికను శ్రీకాకుళం చైల్డ్ హామ్‌కు తరలించినట్లు సీఐ డి.నవీన్‌కుమార్ తెలిపారు. రాజకీయ కుట్ర!
ప్రేమించి పెళ్లిచేసుకున్న తమను విడదీసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని బాలిక బోరుమంతి. వెంకటేష్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానే తప్ప తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పింది. గుడిలో పెళ్లి చేసుకున్న ఫొటోలను మీడియాకు చూపించింది. మరోవైపు మహిళా చేతన మండలి కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ బాలిక రమ్యకు మరో రెండు నెలల్లో 18 ఏళ్లు నిండుతాయని, అప్పటివరకు చైల్డ్ హోమ్‌లోనే బాలికకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. అక్కడ ఆ బాలికకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసులదే బాధ్యతని ఆమె హెచ్చరించారు. బాలిక మేజర్ అయిన వెంటనే, ఆమె ఇష్టప్రకారం జంటను ఒకటి చేస్తామని పేర్కొన్నారు.