డీఆర్‌ఎంను కోరిన ఎంపీ, విప్
ఆమదాలవలస రూరల్: జిల్లాలో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీని కోరారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన కుర్చీలను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ను మోడల్‌ై రెల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దేందు కేంద్ర రైల్వేశాఖ కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా ఎంపీ నిధులు రూ. 13 లక్షలు రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి కోసం కేటాయించగా ఇక్కడ కుర్చీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
రైళ్లు నిలుపుదల చేయాలి
అనంతరం డీఆర్‌ఎం, ఎంపీ, విప్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి నోచుకోక ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డీఆర్‌ఎంను ఎంపీ కోరారు. జిల్లా మీదుగా ఎన్నో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా 20 రైళ్లు ఆమదాలవలస స్టేషన్‌లో ఆగడం లేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీసం 10 రైళ్లు నిలుపుదల చేయడానికైనా రైల్వే బోర్డుకు తెలియజేయాలని కోరారు.
తిరుమల, గరీబ్థ్ ్రరైళ్లు విశాఖపట్నం నుంచి కాకుండా ఆమదాలవలస రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దూసి రైల్వేస్టేషన్‌లో గుణుపూర్ పాసింజర్, పొందూరు స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని విప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, తహశీల్దార్ కె.శ్రీరాములు, మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి భాస్కరారావు, వైస్‌చైర్మన్ అన్నెపు భాస్కరరావు, కౌన్సిలర్స్, సర్పంచ్‌లు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి చేయండి
Published Thu, Jan 14 2016 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement