
జమ్మలమడుగు ‘పురం’.. వైఎస్‌ఆర్‌సీపీ పరం
లాటరీలో చైర్‌పర్సన్‌గా తులసి ఎన్నిక
జమ్మలమడుగు: గత పదిరోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ వశమైంది. ఆదివారం నిర్వహించిన ఎన్నికలో చైర్‌పర్సన్‌గా తాతిరెడ్డి తులసి ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న తులసి, టీడీపీ అభ్యర్థి లక్ష్మీ మహేశ్వరిలకు సమానంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి లాటరీ నిర్వహించగా అదృష్టం తులసిని వరించింది