సాక్షి, హన్మకొండ: పురపాలిక పోరు ముగిసినా... జిల్లాలోని ఆయూ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి బరిలో ఉండే చైర్‌పర్సన్ల అంశంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏ పార్టీ కూడా సదరు అభ్యర్థులను ప్రకటించ లేదు.
ఈ క్రమంలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్‌ను పరిశీలిస్తే... ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీకి ఓట్లు పడిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్ పదవి దక్కించుకోవాలని గంపెడాశతో ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీలకు ఇతరుల మద్దతు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు చైర్‌పర్సన్ ఎంపికలో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు కీలకం కానున్నారు.
మునిసిపాలిటీల్లో...
మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీల్లో 28 చొప్పున వార్డులు ఉన్నారుు. కనీసం 15 వార్డులను కైవసం చేసుకుంటేనే... చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. కానీ.. హోరాహోరీ పోరు నేపథ్యంలో అటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడడం లేదు.
మహబూబాబాద్ : ఈ మునిసిపాలిటీ చైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అరుుంది. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది. ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపగా... కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల సరళి, ఓటరు నాడీని పరిశీలిస్తే... ఏ పార్టీ సొంతంగా 15 వార్డులు గెలిచే పరిస్థితి లేదు. స్వతంత్రులు, సీపీఏం మద్దతు కూడగట్టగలిగే పక్షానికే... చైర్‌పర్సన్ పదవి దక్కే అవకాశం ఉంది.
జనగామ : ఈ మునిసిపాలిటీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటారుుంచారు. ఇక్కడ అన్ని రాజకీయ పక్షాల కంటే కాంగ్రె స్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఒక వార్డులో హస్తం అభ్యర్థి ఏకగ్రీవమయ్యూరు. పోలింగ్‌లో సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైం ది. ఈ ప్రతిఘటన కారణంగా ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుం డా కాంగ్రెస్ చైర్‌పర్సన్ స్థానం దక్కించుకోవడం అనుమానమేనని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
నగర పంచాయతీల్లో...
పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగరపంచాయతీల్లో 20 వార్డులు ఉన్నాయి. ఈ మూడు చోట్ల చైర్‌పర్సన్ స్థానం దక్కాలంటే 11 వార్డుల్లో గెలవాలి. ఏ ఒక్క పార్టీ అన్ని వార్డులు గెలిచే పరిస్థితులు లేవు.
భూపాలపల్లి : ఈ నగర పంచాయతీ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు, చైర్‌పర్సన్ స్థానం... సీపీఐకి 4 వార్డులు, వైస్ చైర్మన్ స్థానం ఖరారయ్యాయి. ఈ కూటమికి టీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్ ఎనిమిది వార్డులు... టీఆర్‌ఎస్ ఏడు వార్డుల్లో ఆధిక్యం కనబరిచినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ ఆఫీషియో ఓట్ల సాయంతో చైర్‌పర్సన్ స్థానం దక్కించుకునేందుకు ఇక్కడి నాయకులు పావులు కదుపుతున్నారు.
పరకాల : ఈ నగర పంచాయతీ చైర్‌పర్సన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొనడంతో వార్డు అభ్యర్థులు ఎవరి ప్రచార బాధ్యతలను వారే తీసుకున్నారు. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చారు. అంతేకాదు... బీజేపీకి పట్టణంలో స్థిరమైన ఓటుబ్యాంకు ఉండటంతో వారు సైతం ఒకటి రెండు వార్డుల్లో గెలిచే అవకాశముంది. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆ పార్టీదే పై చేయిగా ఉంది. టీఆర్‌ఎస్ పది నుంచి 13 వార్డుల్లో విజయం సాధించే అవకాశమున్నట్లు అంచనా.
నర్సంపేట : ఈ నగర పంచాయతీ చైర్‌పర్సన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య నువ్వా...నేనా అన్నట్లుగా పోరు సాగింది. పోలింగ్ సరళిని బట్టి ఈ రెండు పార్టీలు ఎనిమిది లేదా తొమ్మిది వార్డుల్లో విజయం సాధించే అవకాశముంది. రెండు నుంచి మూడు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు విజయం వరించే అవకాశం ఉంది. వీరి మద్దతు కూడగట్టగలిగే పార్టీదే చైర్‌పర్సన్ పీఠం.
స్వతంత్రులే కీలకం
Published Tue, Apr 1 2014 3:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement