
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కుమార్తె ఇషాకు కూడా ప్రమోషన్ రానుంది. రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా ఇషా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుందని అంచనా .
ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింతలో ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ రీటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.
కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్ కాగా చిన్న కుమారుడు అనంత్. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకున్న విషయం విదితమే. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment