
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది.
తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment