new members elected
-
ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. -
కాఫీ బోర్డులోకి శ్రీశాంత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎండీ చల్లా శ్రీశాంత్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్స్టాంట్ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా అయిదుగురికి బోర్డులో స్థానం దక్కడ విశేషం. ‘ఏపీలో కాఫీ సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు దీనినిబట్టి అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్‌లో కాఫీ ఉత్పత్తి రెండింతలు అవుతుంది’ అని శ్రీశాంత్ ఈ సందర్భంగా తెలిపారు. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానందరాజు నగరంపాలెం: ఉద్యోగుల సమస్యలు పరిష్కారించటానికి ఆం ధ్రప్రదేశ్ నాన్‌గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగరశాఖ కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిఉందని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద రాజు సూచించారు. శనివారం ఎన్జీవో కల్యాణమండపంలో నగరశాఖ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గతం సంఘంపై ఉద్యోగుల స్పందించిన తీరుకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలున్నారు. ఎన్జీవో జిల్లా కార్యదర్శి నాగవర్దన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. అత్యధిక మేజారిటీతో గెలిపించినందుకు నగరశాఖ నూతన అధ్యక్షుడు సుకుమార్, కార్యదర్శి మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం .. శుక్రవారం ఉదయం జరిగిన ఏపీఎన్జీవో నగరశాఖ ఎన్నికల కౌంటింగ్ శనివారం తెల్లవారుఝామున ముగిసింది. నగరశాఖలో మొత్తం 1,536 ఓటర్లు ఉండగా 1,356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుకుమార్ ప్యానల్‌కు 1,004 ఓట్లు లభించగా శివశంకర్ ప్యానెల్‌కు 274 ఓట్లు లభించాయి. దీనితో సుకుమార్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.భూషణం ప్రకటించారు. అధ్యక్షుడిగా సుకుమార్, కార్యదర్శిగా యం.యస్.మూర్తి, ట్రెజరర్ పి.హరికిషన్, అసోసియేట్ ప్రెసిడెంట్ యస్‌డి.జానీబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైవి.సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులుగా కె.సాంబయ్య, డి.శ్రీనివాసరావు, ఎల్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా బి.కొండారెడ్డి, పి.కోటేశ్వరరావు, వై.పద్మజ, పి.రవిబాబు, కె.శివజ్యోతి, డీఈసీ మెంబర్లుగా యం.కోటేశ్వరరావు, బి.సునీల్‌కుమార్, సిహెచ్.వీరబ్రహ్మేశ్వరరావులతో ప్రమాణం చేయించారు.