సమస్యల పరిష్కారానికి కృషి | NGOs new association elected | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Published Sun, Jul 31 2016 6:30 PM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

NGOs new association elected

ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దయానందరాజు
 
నగరంపాలెం: ఉద్యోగుల సమస్యలు పరిష్కారించటానికి  ఆం ధ్రప్రదేశ్‌ నాన్‌గజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నగరశాఖ కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిఉందని ఏపీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద రాజు సూచించారు. శనివారం ఎన్‌జీవో కల్యాణమండపంలో  నగరశాఖ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గతం సంఘంపై ఉద్యోగుల స్పందించిన తీరుకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలున్నారు.  ఎన్‌జీవో జిల్లా కార్యదర్శి నాగవర్దన్‌ మాట్లాడుతూ ఉద్యోగుల ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. అత్యధిక మేజారిటీతో  గెలిపించినందుకు నగరశాఖ నూతన అధ్యక్షుడు సుకుమార్, కార్యదర్శి మూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం ..
శుక్రవారం ఉదయం జరిగిన ఏపీఎన్‌జీవో నగరశాఖ ఎన్నికల కౌంటింగ్‌ శనివారం తెల్లవారుఝామున ముగిసింది. నగరశాఖలో మొత్తం 1,536 ఓటర్లు ఉండగా 1,356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుకుమార్‌ ప్యానల్‌కు 1,004 ఓట్లు లభించగా శివశంకర్‌ ప్యానెల్‌కు 274 ఓట్లు లభించాయి. దీనితో సుకుమార్‌ ప్యానెల్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.భూషణం ప్రకటించారు.  అధ్యక్షుడిగా సుకుమార్, కార్యదర్శిగా యం.యస్‌.మూర్తి, ట్రెజరర్‌ పి.హరికిషన్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ యస్‌డి.జానీబాషా, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వైవి.సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులుగా కె.సాంబయ్య, డి.శ్రీనివాసరావు, ఎల్‌.శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రటరీలుగా బి.కొండారెడ్డి, పి.కోటేశ్వరరావు, వై.పద్మజ, పి.రవిబాబు, కె.శివజ్యోతి, డీఈసీ మెంబర్లుగా యం.కోటేశ్వరరావు, బి.సునీల్‌కుమార్, సిహెచ్‌.వీరబ్రహ్మేశ్వరరావులతో ప్రమాణం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement