ఏఏఏఐ అధ్యక్ష నియామకం | Prasanth Kumar re-elected as president of AAAI | Sakshi
Sakshi News home page

ఏఏఏఐ అధ్యక్ష నియామకం

Oct 8 2024 5:43 AM | Updated on Oct 8 2024 8:07 AM

Prasanth Kumar re-elected as president of AAAI

హైదరాబాద్‌: సౌత్‌ ఏషియా ఆఫ్‌ గ్రూప్‌ ఎం మీడియా (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ సీఈవో అయిన ప్రశాంత్‌ కుమార్, అడ్వరై్టజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్‌గా మరోసారి ఎన్నికయ్యారు. 

ముంబైలో సమావేశమైన ఏఏఏఐ వార్షిక జనరల్‌ బాడీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పాలకమండలిని ఎన్నుకుంది. హవాస్‌ ఇండియా గ్రూప్‌ సీఈవో అయిన రాణా బారువా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మోహిత్‌ జోషి, సంతోష్‌ కుమార్,  కె.శ్రీనివాస్‌ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని కొత్త ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ కుమార్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement