prashanth kumar
-
ఏఏఏఐ అధ్యక్ష నియామకం
హైదరాబాద్: సౌత్ ఏషియా ఆఫ్ గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సీఈవో అయిన ప్రశాంత్ కుమార్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్‌గా మరోసారి ఎన్నికయ్యారు. ముంబైలో సమావేశమైన ఏఏఏఐ వార్షిక జనరల్ బాడీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి కొత్త పాలకమండలిని ఎన్నుకుంది. హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో అయిన రాణా బారువా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మోహిత్ జోషి, సంతోష్ కుమార్, కె.శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, నూతన అవకాశాలను సొంతం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని కొత్త ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. -
దక్షిణాదిపై యస్ బ్యాంక్ మరింత దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ దక్షిణాదిలో కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోను శాఖలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 25గా ఉన్న బ్రాంచీల సంఖ్యను మార్చి ఆఖరు నాటికి 29కి పెంచుకోనున్నట్లు, తదుపరి మరో రెండు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 1,200 పైచిలుకు శాఖలు ఉండగా.. దక్షిణాదిలో 216 ఉన్నాయన్నారు. మైక్రోఫైనాన్స్ విభాగంలోకి ప్రవేశించడంపైనా కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరితే ఏదైనా సూక్ష్మ రుణాల సంస్థను కొనుగోలు చేస్తామని లేదా సొంతంగానైనా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేటీఎం పరిణామాలపై స్పందిస్తూ దానికి సంబంధించి నాలుగు బ్యాంకులకు వచ్చే వ్యాపారంలో తమకు పాతిక శాతం వాటా రాగలదని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంపైనా (ఎంఎస్ఎంఈ) దృష్టి పెడుతున్నామన్నారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో దీని వాటా 30 శాతంగా ఉండగా వచ్చే రెండు, మూడేళ్లలో 35 శాతం వరకు పెంచుకోనున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 18 శాతం, రుణాల్లో 15 శాతం వరకు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ మార్కెట్‌పై స్పందిస్తూ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 16.6 శాతం వృద్ధి చెంది రూ. 8,887 కోట్లకు చేరాయని, స్థూల రుణాలు 24 శాతం వృద్ధితో రూ. 11,157 కోట్లకు పెరిగాయని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొత్త కాసా (కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) అకౌంట్లు 14 శాతం వృద్ధి చెందాయన్నారు. దక్షిణాదిలో తమ కాసా డిపాజిట్లలో నగరానికి 14 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. -
నిర్వాసితులకు వారున్న కాలనీల్లోనే ఓటుహక్కు
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే.. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్‌కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు. ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీ ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు.. కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్అండ్ ఆర్ కాలనీ -
నాణ్యమైన తీర్పులతో ప్రజల హక్కులకు రక్షణ
గుంటూరు లీగల్ : నాణ్యమైన తీర్పులతో ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా న్యాయాధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలోని ఏపీ జ్యుడీషియల్ అకాడమిలో శనివారం న్యాయాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొని.. న్యాయాధికారులకు వృత్తిలో మెలకువలను వివరించారు. జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ వై.సోమయాజులు, జస్టిస్ సి.మానవేంద్రనాథ్‌రాయ్ తదితరులు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ హరిహరనాధశర్మ, అధ్యాపక బృందం పాల్గొన్నారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ కృషి అభినందనీయం రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో హైకోర్టు అభివృద్ధికి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఎంతో కృషి చేశారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రశంసించారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జ్యుడీషియల్ అకాడమీలో ప్రవీణ్‌కుమార్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సేవలను కొనియాడారు. -
కోర్టుల్లో కేసు ఫైళ్లు మాయం అవడమా?
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లోనే కేసుల ఫైళ్లు మాయం అవుతుండటంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టుల్లోనే ఫైళ్లు మాయం అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు, తప్పు చేసే ప్రభుత్వాధికారులను తామెలా ప్రశ్నించగలమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. నర్సరావుపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు జిల్లా కోర్టులో ఓ కేసుకు సంబంధించిన ఫైల్ మాయం కావడంపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చూడాలంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కోర్టుల్లోనూ లేని కేసు ఫైల్ నర్సరావుపేటలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 1998 ఏప్రిల్ 6న ఓ కేసులో ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలంటూ వినుకొండకు చెందిన షేక్ లతీఫ్ సాహెబ్ దరఖాస్తు చేశారు. అయితే ఆ కేసు ఫైల్ తమ వద్ద లేదంటూ ఆ దరఖాస్తును కోర్టు సిబ్బంది తిరస్కరించారు. గుంటూరు జిల్లా కోర్టులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో లతీఫ్ సాహెబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.వెంకట రామారావు వాదనలు వినిపిస్తూ, నర్సరావుపేట కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తాము అడుగుతున్న సర్టిఫైడ్ కాపీ అవసరం చాలా ఉందన్నారు. ఎక్కడా ఆ ఫైల్ లేకపోవడంతో సర్టిఫైడ్ కాపీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆ కాపీ లేకపోవడం వల్ల పిటిషనర్‌కు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది. -
అది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం
సాక్షి, అమరావతి: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలమని హైకోర్టు తేల్చి చెప్పింది. అధికరణ 226 కింద తాము ప్రభుత్వాన్ని నడపడంలేదని స్పష్టం చేసింది. తామున్నది ప్రభుత్వాలను నడిపేందుకు కాదని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవోలను సవాలు చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ డి.రమేశ్చంద్ర సింహగిరి పట్నాయక్ తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు మంగళవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కొందరు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది (పాఠశాల విద్య) ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ, తాజా వ్యాజ్యంలో కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. ఏ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయలేదో వాటన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
విజయవాడ కోర్టుల భవన సముదాయం ప్రారంభం
-
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు. ఇక విజయవాడ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో పాటు యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు. ఇదీ చదవండి: పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు సోమవారం (9వ తేదీ) నుంచి జూన్ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచి చూడలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ చీమలపాటి రవి ఉంటారు. ఇందులో జస్టిస్ మన్మథరావు, జస్టిస్ రాజశేఖర్ ధర్మాసనంలో, జస్టిస్ చీమలపాటి రవి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉంటారు. ఇందులో జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో, జస్టిస్ వెంకటేశ్వర్లు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు నోటిఫికేషన్ జారీ చేశారు. -
ప్రభుత్వోద్యోగులు అంకితభావం చూపాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావం చూపి తీరాల్సిందేనని, అలా చూపకపోవడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగులు తప్పుడు నివేదికలు ఇవ్వడమంటే తమ విధులపట్ల అంకితభావం చూపకపోడమే అవుతుందని పేర్కొంది. ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చి ఖజానాకు రూ.215.06 కోట్ల మేర నష్టం కలిగించినందుకు గనుల శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు వారి సస్పెన్షన్‌ను మరికొంత కాలం పాటు కొనసాగించడాన్ని సమర్థించింది. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులు విచారణకు సహకరించనప్పుడు వారి సస్పెన్షన్‌ను పొడిగించడంలో ఎలాంటి దోషంలేదని పేర్కొంది. ఆ ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదీ వివాదం.. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో ఎంఎస్పీ గ్రానైట్స్ సంస్థ 4.517 హెక్టార్లలో మైనింగ్ లీజు తీసుకుంది. ఈ కంపెనీ తవ్వితీసిన ఖనిజం ఎంతో తేల్చేందుకు గనుల శాఖ అధికారులు 2020లో సర్వే నిర్వహించారు. ఈ కంపెనీ 1.45 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వితీసిందని గనుల శాఖలో అసిస్టెంట్ మైన్స్ అధికారులుగా పనిచేస్తున్న ఆనందరావు, వెంకటేషు, సర్వేయర్ కుసుమ శ్రీధర్‌లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.విజిలెన్స్ అధికారులు సర్వేచేసి 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సదరు సంస్థ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. ఈ నివేదికలను పరిశీలించిన గనుల శాఖ ఉన్నతాధికారులు.. ఆనందరావు తదితరులు ఎంఎస్పీ గ్రానైట్స్‌తో కుమ్మక్కై తప్పుడు నివేదిక ఇచ్చారని తేల్చారు. తాము 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వినట్లు ఎంఎస్పీ గ్రానైట్స్ అంగీకరించింది. దీంతో ఆనందరావు తదితరుల తప్పుడు నివేదికవల్ల ఖజానాకు రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చి ఆనందరావు తదితరులను సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. సింగిల్ జడ్జి వీరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు ఇచ్చిన తప్పుడు నివేదికవల్ల లీజుదారు నుంచి రూ.215.06 కోట్ల మేర పెనాల్టీ రాకుండా పోయిందన్నారు. తద్వారా వారు ఖజానాకు నష్టం కలిగించారని వివరించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు వెలువరించింది. -
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడం వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంది. పరిశ్రమలు, కాలేజీల నిర్మాణం వంటివి ఇలానే ఆగిపోతున్నాయని పేర్కొంది. వైద్య కళాశాలల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖపట్నం జిల్లా అనకాపల్లిల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన భూమిని వైద్య కళాశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ బొజ్జా దశరాథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిల్ దాఖలు చేసిన ఆది రామకృష్ణుడు పార్టీ ఇన్‌పర్సన్‌గా వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. స్టే ఉత్తర్వుల వల్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎలాంటి పనులు జరగడం లేదని తెలిపారు. మరో పిటిషనర్ న్యాయవాది బొజ్జా అర్జునరెడ్డి.. ఈ వ్యాజ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పిటిషనర్ పలు వాయిదాలు తీసుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారికి అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఇలా పదేపదే వాయిదాలు కోరుతున్నారని తెలిపారు. వాయిదాల వల్ల మెడికల్ కాలేజీల నిర్మాణం ముందుకెళ్లడం లేదని చెప్పారు. ప్రభుత్వం సైతం ప్రజల కోసమే మెడికల్ కాలేజీలు కడుతోందన్నారు. ఈ సమయంలో అటు అదనపు ఏజీ సుధాకర్, ఇటు పిటిషనర్ న్యాయవాది అర్జున్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదనలతో తమకు దీపావళి వేడుకలను ముందుగానే జరుపుకొన్నట్లు ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించింది. దీపావళి తరువాత కూడా కాల్చుకోవడానికి టపాసులను (వాదనలు) దాచుకోవాలని ఇరుపక్షాలకు సూచించింది. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతోసహా అందరూ నవ్వుకున్నారు. ఇలాంటి వ్యాజ్యాల వల్ల రాష్ట్రంలో పనులేవీ జరగడం లేదంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 22కి వాయిదా వేసింది. -
డొంక కదులుతోంది
అమలాపురం టౌన్: లేని భూములకు నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంక్ నుంచి రూ.1.50 కోట్ల రుణాన్ని కాజేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఈ భూ మాయజాలంపై డొంక కదులుతోంది. ప్రాథమికంగా ఈ తప్పిదానికి బాధ్యులని భావిస్తున్న సూత్రధారి అమలాపురం రూరల్ మండలం కామనగరువు వీఆర్వో ప్రశాంత్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ టోకరా వెలుగు చూసినప్పటి నుంచి ఆ వీఆర్వో అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. లేని 53 ఎకరాలకు అధికారికంగా ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసిన అప్పటి అమలాపురం తహసీల్దార్, ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న బేబీ జ్ఞానాంబకు వారం రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో భూమి రికార్డులను కంప్యూటర్లో నకిలీ పత్రాలను తయారు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ వంశీపై క్రిమినల్ కేసు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ నుంచి గురువారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఒక పథకం ప్రకారం జరిగిన ఈ భూ మాయలో భారీ రుణం ఇచ్చిన అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారుల పాత్రపైనా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తొలుత ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడ జరిగిన పరిణామాలపై లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ అమలాపురం ఆర్డీవోను ఆదేశించారు. బ్యాంక్‌కు నకిలీ పత్రాలు సమర్పించిన అసలు సూత్రధారి ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి బలరామమూర్తికి ఒకేసారి రూ.1.50 కోట్ల రుణం ఇలా ఇచ్చారనే కోణంలో కూడా బ్యాంక్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే నకిలీ పత్రాలతో అడ్డగోలుగా అంతటి రుణాన్ని ఇచ్చిన హెచ్డీఎఫ్సీ అమలాపురం శాఖపై విచారణ జరపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ షణ్ముఖరావును జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. దీనిపై షణ్ముఖరావు ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. నకిలీ పత్రాలతో రుణం ఇచ్చిన డాక్యుమెంట్లను తమకు చూపించాలని కోరారు. అయితే ఆ డాక్యుమెంట్లు తమ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉన్నాయని బ్యాంక్ అధికారులు బదులిచ్చారు. తక్షణమే వాటిని ఇక్కడికి రప్పించాలని ఆయన చెప్పడంతో ముంబై నుంచి వాటిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లేని భూములకు కళ్లు మూసుకుని ఈసీ, తనఖా రిజిస్ట్రేషన్ చేసిన అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపైనా జిల్లా రెవెన్యూ అధికారులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఉన్నతాధికారులు కూడా ఈ భూ మాయపై చాపకింద నీరులా విచారణ చేస్తున్నారు. ఇలా పలు కోణాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నకిలీ భూమి రికార్డుల మోసాలపై ఉచ్చు బిగిస్తూ బాధ్యులపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
నేనున్నానని...
అతనొక ఉద్యోగి. భావితరాల చిన్నారులకు విద్యను అందించాలనే తపనతోఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిశాడు. ‘మీ పిల్లలను నేను చదివిస్తాను. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే వరకు నాదే బాధ్యత..’ అంటూ భరోసా ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే ఎంత ప్రయోజకులు అవుతారనే విషయాల్ని ల్యాప్‌టాప్ ద్వారా చూపించాడు. వారిని ఒప్పించాడు. అందుకోసం తల్లిదండ్రుల వద్ద తెల్లపేపర్‌పై ‘మీ పిల్లల భవిష్యత్‌కు నేనే బాధ్యడ్నంటూ’ రాసి నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రశాంత్ కుమార్ బోనగిరి. సాక్షి, సిటీబ్యూరో:రామంతపూర్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ బోనగిరి ‘శ్రీ వాసవి చారిటబుల్’ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా అనాథలకు, చదువుకోలేని వారికి విద్యను అందిస్తున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్. అదే విధంగా ‘మ్యాన్ పవర్ సొల్యూషన్’ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వచ్చే తన ఆదాయంలో కొంత భాగాన్ని పక్కనపెట్టి స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఆదాయంలో 40 శాతం ట్రస్ట్‌కే... పెయింటింగ్‌లో ప్రశాంత్ మంచి ప్రతిభావంతుడు. నెలకు మూడే మూడు పెయింటింగ్స్ వేస్తాడు. ఒక్కో పెయింటింగ్‌ని రూ.10 వేలకు అమ్ముతాడు. ఈ పదివేల నుంచి 40 శాతం పక్కకు తీసి ట్రస్ట్‌కు వాడతాడు. అదేవిధంగా సొంతంగా ‘మ్యాన్‌పవర్ సొల్యూషన్’ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారా సెక్యూరిటీ గార్డులను కార్పొరేట్ కంపెనీలకు రిక్రూట్ చేస్తాడు. ఈ కంపెనీ ద్వారా దాదాపు నెలకు రూ.2 లక్షల ఆదాయం వస్తే..దానిలో 40 శాతం ట్రస్ట్‌కు వినియోగిస్తున్నాడు. ఇలా ఈ డబ్బుతో ఇప్పటివరకు ప్రత్యక్షంగా 40 మందిని చదివిస్తుండగా..50 మందికి పైగా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల్ని కల్పిస్తున్నాడు ప్రశాంత్. నేనే బాధ్యుడ్ని అంటూ అగ్రిమెంట్ నగరంతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలకు చెందిన అనాథలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులను స్వయంగా చదివిస్తున్నాడు. చదువు మానేసి ఇంటిపట్టున ఉంటూ..కుటుంబానికి ఆసరాగా ఉంటున్న వారిని గుర్తించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్లాడు. వాళ్ల తల్లిదండ్రులను బతిమిలాడాడు. వారు ఒప్పుకోకపోవడంతో..‘మీ పిల్లల చదువులు అయ్యే వరకు నేనే చూసుకుంటా. చదువుకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ నేనే తీరుస్తా. ఉద్యోగం వచ్చే వరకూ నాదే బాధ్యత’ అంటూ అగ్రిమెంట్ కూడా రాసి వారికి ఇవ్వడం జరిగింది. ఇలా 15 మంది చిన్నారుల తల్లిదండ్రులకు అగ్రిమెంట్ రాసినట్లు ప్రశాంత్ తెలిపారు. సేవల్లోభేష్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా బుక్స్, పెన్నులు, బట్టలు, బూట్లు ఇవ్వడం చేస్తుంటాడు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేస్తాడు. టాయ్‌లెట్స్‌ని క్లీన్ చేయించడం, మంచి తాగునీరు అందించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇటీవల రామంతపూర్‌కి చెందిన లక్ష్మమ్మ అనే ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి పింఛన్ రావట్లేదు. విషయం తెలుసుకున్న ప్రశాంత్ ఆ వృద్ధురాలికి సొంత ఖర్చులతో టీ స్టాల్‌ని ఏర్పాటు చేశాడు. యోగిత అనే విద్యార్థినికి తండ్రి లేడు. చదువు భారం కావడంతో ఆమెను ఉచితంగా చదివిస్తున్నాడు. పీజీ పూర్తయ్యే వరకు తనదే బాధ్యతంటూ ఆమె తల్లికి భరోసా ఇచ్చాడు. వర్షకాలంలో రాజేంద్రనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో 50 మంది విద్యార్థులకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేశాడు. మరికొద్దిరోజుల్లోఉచితంగా వాటర్‌ట్యాంకులు ప్రస్తుతానికి నాకు వచ్చే ఆదాయంలో 40 శాతం ట్రస్ట్‌కు ఖర్చు పెడుతున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరినీ ఒక్క రూపాయి అడగలేదు. కొద్దిరోజుల్లో నా వ్యాపారంలో మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ఆదాయంతో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా వాటర్‌ట్యాంక్స్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నా. నా శక్తిమేరకు ఎంతమందిని చదివించగలిగితే అంతమందిని చదివించేందుకు నేను సిద్ధం. – ప్రశాంత్‌కుమార్, ట్రస్టు వ్యవస్థాపకులు -
అంగుళం భూమినీ ఆక్రమించనివ్వం
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఒక్క అంగుళం అటవీభూమిని కూడా ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్‌కుమార్ ఝా స్పష్టంచేశారు. ప్రభుత్వపరంగా తమకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు, మద్దతు అందుతున్న నేపథ్యంలో తమకు అప్పగించిన విధులను అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. విధుల నిర్వహణ, అటవీ ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో ఇటీవల కొన్నిచోట్ల చోటుచేసుకున్న ఘటనలతో అధికారులు, సిబ్బంది ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేసులు పెట్టడంతోపాటు దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుందని, అలాగే తమ విధుల నిర్వహణకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయడంతో పాటు అడవుల సంరక్షణ, తదితర చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. సాగుకాలం మొదలు కావడంతో ఆక్రమణలు సాగుకాలం జూలైలో మొదలుకానుండటంతో అడవుల్లో కొత్త ఆక్రమణలకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఝా వెల్లడించారు. గతంలోనే గుర్తించిన అటవీభూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది వెళుతుండడంతో కొన్నిచోట్ల ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతోందన్నారు. గిరిజనులు, ఇతర రైతులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు బలవంతంగా చెట్లు నాటుతున్నారనే ఆరోపణలున్నాయి కదా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేస్తున్నా అటవీశాఖను అడవులు సంరక్షించే విభాగంగా, చట్టాలను కాపాడే శాఖగా చూడకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. సార్సాలో జరిగిన ఘటన చూస్తే పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడి జరిగిన తీరు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చట్ట పరిరక్షణకు వెళ్లినవారిపై ఇలాంటి దాడులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సిబ్బందికి ఆయుధాలిస్తే ఇలాంటి దాడులు జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. అటవీ అధికారులకు కూడా ఆయుధాలు సమకూర్చాలని వస్తున్న డిమాండ్‌పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మగ్లర్లు, అటవీ నేరస్తులపై తప్ప ప్రజలపై అటవీ అధికారులు ఆయుధాలను ప్రయోగించే పరిస్థితి రాదని స్పష్టంచేశారు. 1980లలో అటవీశాఖ వద్ద కూడా ఆయుధాలుండేవని.. అయితే, మారుమూల ప్రాంతాల్లో అటవీ సిబ్బంది నుంచి నక్సలైట్లు ఆయుధాలు ఎత్తుకెళ్తుండటంతో వాటన్నింటినీ పోలీస్‌శాఖ వద్ద డిపాజిట్ చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆయుధాలు లేకుండానే అన్నిస్థాయిల్లోని అధికారులు అడవుల్లో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. గిరిజనుల భూములను అటవీశాఖ బలవంతంగా లాక్కుంటోందని, కొన్నేళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న చోట కూడా హరితహారం కింద మొక్కలు నాటుతోందని, దాడులకు కూడా పాల్పడుతోందని వస్తున్న ఆరోపణలను ఝా తోసిపుచ్చారు. అడవుల్లోని భూమిని అప్పగిస్తామని, చెట్లను కొట్టి వ్యవసాయం చేసుకుంటే పట్టాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను కొంతమంది రెచ్చగొట్టడం వల్లే అడవుల్లో ఘర్షణాత్మక పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. -
చైనా మాంజాతో చిక్కులే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా చైనా నైలాన్ మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ళు జైలు శిక్ష, రూ.లక్ష దాకా జరిమానా విధిస్తామని పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా హెచ్చరించారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే కారకులకు 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందని తెలిపారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఆనందంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి వేడుకల్లో గాలిపటాల కోసం చైనా మాంజా వాడకం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయన్నారు. గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ దారం వాడటం వల్ల పండుగ తర్వాత ఎక్కడికక్కడ వ్యర్థాలు మిగిలిపోయి పర్యావరణం, పక్షులతో పాటు మనుషులకు హాని జరుగుతోందన్నారు. ఈ దారం కారణంగా గాయాలై హైదరాబాద్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు చనిపోయారని.. అలాగే పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారని తెలిపారు. 2017 జూలై నుంచే నిషేధం.. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 2017 జూలై 11 నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించినట్టు పీకే ఝా చెప్పారు. రాష్ట్రంలో పోలీస్, ఇతర శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో మాంజా వాడకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్జీవో సంస్థలతో కూడా సమావేశమైనట్టు చెప్పారు. గత మూడేళ్లలో 900 కిలోల దాకా నైలాన్ మాంజా సీజ్ చేసి, 123 కేసులు నమోదు చేశామన్నారు. చైనా దారం దిగుమతితో స్థానికంగా కొందరు ఉపాధి కోల్పోతున్నారన్నారు. చైనా దారం అమ్మకాల గురించి వివరాలు తెలిస్తే.. అటవీశాఖకు 040–23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం అందించవచ్చునని అటవీ శాఖ ఓఎస్డీ శంకరన్ వెల్లడించారు. సమావేశంలో అధికారులు పృథ్వీరాజ్, మునీంద్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎదురులేని ఆంధ్ర
న్యూఢిల్లీ: మరోసారి సమష్టి ప్రదర్శన చేసిన ఆంధ్ర జట్టు విజయ్ హజారే దేశవాళీ వన్డే టోర్నమెంట్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సౌరాష్ట్రతో ఆదివారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచి 18 పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగులు సాధించింది. అర్పిత్ (55; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, మనీశ్, షోయబ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 48.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 73; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బోడపాటి సుమంత్ (49 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రవితేజ (26 బంతుల్లో 29 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు. -
అనంత ఆణిముత్యం
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘అనంత’ క్రికెట్ చరిత్రలో డీబీ ప్రశాంత్‌కుమార్ సరికొత్త అధ్యాయానికి తెరతీశాడు. చిన్న వయసు(21)లోనే ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ దక్కించుకుని..సంచలనం సృష్టించాడు. షాబుద్దీన్, ప్రసాద్‌రెడ్డి, ఫయాజ్ అహ్మద్, నూర్ మహ్మద్ ఖాన్, కృష్ణమోహన్, సురేష్ వంటి వారు ఆంధ్ర రంజీ జట్టుకు ఆడినా...వీరెవరికీ సాధ్యంకాని రీతిలో ప్రశాంత్ కేవలం 15 మ్యాచ్‌ల అనుభవంతోనే ‘నాయకుడి’గా ఎదిగాడు. అసమాన ప్రతిభా పాటవాలతోనే ఈ ఘనత సాధించగలిగాడు. ప్రశాంత్ కెప్టెన్ కావడం జిల్లాకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గతంలో షాబుద్దీన్ కూడా ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అతనికి చాలా మ్యాచ్‌ల తర్వాత అవకాశం వచ్చింది. ఇటీవల జట్టు కెప్టెన్ కమ్ మెంటర్ బాధ్యతల నుంచి అమోల్ మజుందార్ తప్పుకోవడంతో ప్రశాంత్‌కు కెప్టెన్సీ అప్పగిస్తూ ఆంధ్ర క్రికెట్ సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో విశాఖపట్నంలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరగనున్న మ్యాచ్ నుంచి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రశాంత్ 2010లో తొలిసారి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ త్రిపురతో ఆడాడు. రెండో మ్యాచ్‌లోనే విదర్భపై సెంచరీ చేశాడు. ఇప్పటివరకు 15 రంజీ మ్యాచ్‌లాడి... మొత్తం 730 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లలో 282 పరుగులు చేశాడు. అండర్ -19, 25 రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లలోనూ సెంచరీల మోత మోగించాడు. ఇతని స్వస్థలం అనంతపురం. నగరంలోని విన్సెంట్ ఫై కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి డి.రాజన్న రేడియోస్టేషన్ రిటైర్డ్ ఇంజనీర్. ప్రశాంత్‌కు నలుగురు సోదరులు, సోదరి ఉన్నారు. వీరందరూ క్రికెటర్లే. సోదరి అనిత జాతీయ స్థాయిలో రాణించి, రైల్వేలో టీటీఈగా ఉద్యోగం సంపాదించారు. సోదరులు వినోద్, డేవిడ్ రాష్ట్ర స్థాయిలోను, అనిల్‌కుమార్, రాజ్‌కుమార్ జోనల్ స్థాయిలోనూ క్రికెట్ ఆడారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న ప్రశాంత్ నాన్న ప్రోత్సాహంతో బ్యాట్ పట్టుకున్నాడు. 2000 సంవత్సరంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు టీవీ చంద్రమోహన్‌రెడ్డి వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు. అండర్-13 క్రికెట్ మొదలుపెట్టినప్పుడు కాస్త తడబడినా ... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అండర్ -14, 16, 19 విభాగాల్లో చెలరేగిపోయాడు. అండర్ -19లో రెండు, అండర్ -22లో మూడు సెంచరీలు సాధించి రంజీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2011-12 సీజన్లో రంజీ అవకాశం దక్కింది. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. 2012లో అండర్ -25 విభాగంలో చత్తీస్ఘడ్పైనా సెంచరీ (105)చేశాడు. ఈ ఏడాది సౌత్‌జోన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సెంట్రల్‌జోన్‌పై 298 పరుగులు చేసి..సత్తా చాటాడు. ప్రశాంత్ ఎదుగుదలలో ఆర్డీటీ సహకారం కూడా ఉంది.