సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment