APPSC chairman
-
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
నిస్తేజంలో ఏపీపీఎస్సీ.. నైరాశ్యంలో అభ్యర్థులు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. సీఎం చంద్రబాబు తన రాజయకీయాలకు నిరుద్యోగ యువతను బలిచేస్తున్నారు. బాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరర్ధకంగా మారిపోయింది. కమిషన్‌కు చైర్మన్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణ, ఎంపికలు గందరగోళంలో పడ్డాయి. గతంలోనే ప్రకటించిన నోటిఫికేషన్లకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియక నిరుద్యోగులు అందోళనకు గురవుతున్నారు.మరోపక్క ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా.. అదీ చేయడం లేదు. లక్షల్లో ఉద్యోగాలిస్తాం, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప ఒక్క ఉద్యోగమూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపైనా స్పష్టత ఇవ్వడంలేదు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న శిక్షణ సంస్థలు ‘వచ్చే నెలలో పరీక్షలు.. స్పెషల్ బ్యాచ్ శిక్షణ’ పేరుతో నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా చైర్మన్ పదవి ఖాళీసర్విస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీల ప్రకటన, పోస్టింగ్స్.. ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే, ఈ ఏడాది జూన్‌లో అధికారంలోకి వచి్చన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సర్విస్ కమిషన్ చైర్మన్‌పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్‌పైన, సభ్యులపైన వేధింపులకు దిగి, చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్విస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా, లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి.కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలలుగా చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికారవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచి్చన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్–1, 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి బాబు సర్కారుకేదీ? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ చిత్తశుద్ధి ప్రస్తుత చంద్రబాబు సర్కారులో కనిపించడంలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్విస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి, ఉద్యోగాల భర్తీ పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లోను 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక ఉన్న చైర్మన్‌ను కుట్రపూరితంగా తొలగించడమే కాకుండా, కొత్త చైర్మన్‌ను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలుగతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఇందులో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు.ఈ నెలలో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అంతే. ఈ మూడు పరీక్షల మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితోపాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు జూలైలనే సరి్టఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా, చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికీ నియామకపత్రాలు ఇవ్వలేదు. -
ఏపీపీఎస్సీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. చదవండి: (ఆర్బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..) -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి) -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్!?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన్ని ప్రభుత్వం రెండ్రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. చదవండి: (రాష్ట్రంలో రాచబాట.. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ) -
ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా రమణారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఏవీ రమణారెడ్డి.. ఆ కమిషన్‌కు ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తరఫున సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సోమవారం జీవో 148ను విడుదల చేశారు. దీంతో రమణారెడ్డి సోమవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరించిన పిన్నమనేని ఉదయభాస్కర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు) -
పరీక్ష పారదర్శకంగా నిర్వహించాం
-
నెలాఖరుకు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి మార్కాపురం: ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇకపై ఏపీపీఎస్సీ ప్రతి ఏడాది క్యాలెండర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి రోస్టర్ విధానంలో భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 2011 మెయిన్స్ పరీక్ష జరుగుతోందని, త్వరలో ఫలితాలను ప్రకటించి, ఇంటర్వూ్యలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు. సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వెన్నా హనుమారెడ్డి, ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మీర్జా షంషీర్ అలీబేగ్‌లు పాల్గొన్నారు. -
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు
ఏయూ క్యాంపస్: ఉద్యోగాలకు కొదవ లేదని, అవసరమైన నైపుణ్యాలను పొందడమే ప్రధానమని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయ భాస్కర్ అన్నారు. బుధవారం ఉదయం ఏయూ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో ఆయన మాట్లాడారు. డిగ్రీ విద్య కేవలం అవకాశాన్ని మాత్రమే చూపగలదని, సామర్థ్యాలను పరీక్షించిన తరువాతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నేడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత సవాళ్లతో కూడిన సమాజం స్వాగతం పలుకుతుందని, దీన్ని దష్టిలో పెట్టుకుని అభ్యసనం నిరంతర ప్రక్రియగా సాగాలని సూచించారు. సమాజాన్ని మార్చగలిగే ప్రబల శక్తి విద్యే : గంటా అంతకుముందు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. సమాజాన్ని మార్చగలిగే ప్రబల శక్తి విద్యేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 17.5 శాతం నిధులు కేటాయించిందన్నారు. ఆర్థ్ధికంగా ఇబ్బందులు, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యా రంగానికి రూ.21 వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అకడమిక్ క్యాలెండర్ రూపొందించి సకాలంలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నేడు విద్యార్థులు నిర్ధారించుకున్న లక్ష్యమే భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. పరిశోధన రంగాలలో విస్తృత అవకాశాలున్నాయని, సృజనాత్మకంగా పనిచేయడం ఎంతో అవసరమన్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడే దిశగా యువతరం నిలవాల్సి ఉందన్నారు. అవంతి విద్యా సంస్థల చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ. 3500 కోట్లు వెచ్చిస్తోందన్నారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను అతిథులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సి.పి.వి.ఎన్.జె మోహన్ రావు, డాక్టర్ వి.ఎస్.వి ప్రభాకర్, బి.సత్యం, డాక్టర్ సి.హెచ్ దివాకర్, డాక్టర్ వై.శ్రీనివాసరావు, డాక్టర్ జి.ఆదినారాయణ రావు, ఆచార్య చందు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
4009 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్
విశాఖపట్నం : ఏపీపీఎస్సీ నుంచి 4009 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఉదయ్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతి ఏడాది పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. గతంలో కోర్టు కేసులను పరిగణలోకి తీసుకోని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉదయ్‌భాస్కర్ వివరించారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్(ఏపీపీఎస్సీ) గా డాక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ సిలబస్ మార్పుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ కోసం క్యాలెండర్ ను రూపొందిస్తామన్నారు. వసతులున్న భవనం దొరికితే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఉదయభాస్కర్ చెప్పారు. కాగా గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్‌గా పని చేశారు. అదే విధంగా కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో ( డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.