
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఏవీ రమణారెడ్డి.. ఆ కమిషన్‌కు ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తరఫున సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సోమవారం జీవో 148ను విడుదల చేశారు. దీంతో రమణారెడ్డి సోమవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరించిన పిన్నమనేని ఉదయభాస్కర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.