( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 2019 జూన్ నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన్ని ప్రభుత్వం రెండ్రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment