సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మీని తొలగిస్తూ సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీకాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీకాలం ఉన్నా ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మోమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని గజ్జల లక్ష్మీ తెలిపారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది
Comments
Please login to add a commentAdd a comment