
సీబీడీటీ కొత్త చీఫ్ అనితా కపూర్!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన అనితా కపూర్, 1978 ఇన్‌కమ్ ట్యాక్స్ కేడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఆమె సీబీడీటీలో ఇన్‌కమ్ ట్యాక్స్ అండ్ కంప్యూటరైజేషన్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాల విభాగ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తు తం చైర్మన్ కేవీ చౌదరి అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నవంబర్1న చౌదరి స్థానంలో అనితా కపూర్ బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది.