Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?)
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్‌సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే)
ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్‌లో చదువుకున్నారు. నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్‌పై దృష్టి సారించి కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్‌చే స్థాపించిన్ హెచ్‌సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు.
కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్‌ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు.
Comments
Please login to add a commentAdd a comment